Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Today Gold and Silver Price 28 April 2024
స్థిరంగా బంగారం, వెండి.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?

ఏప్రిల్ ప్రారంభం నుంచి భారీగా పెరిగిన బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ ఉన్నాయి. ఈ రోజు మాత్రం ఉలుకూ.. పలుకూ లేకుండా అన్నట్లు పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో ఈ రోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడలలో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.66850 (22 క్యారెట్స్), రూ.72930 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 200 నుంచి రూ. 200 వరకు పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 67000 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 73080 రూపాయల వద్దే ఉంది. నిన్న రూ.200, రూ.220 వరకు పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు ఏ మాత్రం పెరగలేదు. కాబట్టి నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతాయి.దేశంలోని ఇతర నగరాలలో మాదిరిగానే చెన్నైలో కూడా పసిడి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 67700 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 72760 రూపాయల వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరల్లో కూడా ఈ రోజు ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రోజు (ఏప్రిల్ 28) ఒక కేజీ వెండి ధర 84000 రూపాయల వద్ద నిలిచింది. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో కూడా వెండి ధరల్లో ఎటువంటి మార్పులు లేదు.

Elon Musk Heads To China In A Surprise Visit
చైనాలో మస్క్‌ పర్యటన.. భారత్‌లో టెస్లా కార్ల తయారీ లేనట్లేనా?

ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా సీఈఓ ఎలోన్‌ మస్క్‌ చైనాలో ప్రత్యక్షమయ్యారు. గత కొంత కాలంగా మస్క్‌ సారథ్యంలోని టెస్లా భారత్‌లో మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయనుందని, ఇందుకోసం మస్క్‌ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.కేంద్రం సైతం మస్క్‌ ఏప్రిల్‌ నెల 21, 22 తేదీలలో వస్తున్నారంటూ సూచనప్రాయంగా తెలిపింది. కానీ పలు అన్వేక కారణాల వల్ల భేటీ రద్దయింది.  అయితే ఈ నేపథ్యంలో టెస్లా సీఈఓ తన ఫుల్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ (ఎఫ్‌ఎస్‌డీ)కార్లలోని సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేసేందుకు,ఎఫ్‌ఎస్‌డీ అల్గారిథమ్‌లకు శిక్షణ ఇవ్వడానికి దేశంలో సేకరించిన డేటాను విదేశాలకు బదిలీ చేసేందుకు  కావాల్సిన అనుమతులను పొందేందుకు బీజింగ్‌లోని చైనా అధికారులతో భేటీ కానున్నారు.మరోవైపు ఫుల్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లపై ఎక్స్‌లో చర్చ మొదలైంది.దీనిపై మస్క్‌ స్పందిస్తూ అతి త్వరలో డ్రాగన్‌ కంట్రీలో ఎఫ్‌ఎస్‌డీ కార్లు అందుబాటులోకి రానుందని తెలిపారు.   

Veteran Private Banker Abhay Aima passes away
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత

ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం అభయ్ ఐమా కన్నుమూశారు. శనివారం సాయంత్రం ఆయన 63 ఏళ్ల వయసులో ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన చిరకాల మిత్రుడు, జమ్మూకశ్మీర్ మాజీ  ఆర్థిక మంత్రి హసీబ్ ద్రాబు ఈ విషయం వెల్లడించారు.హసీబ్ ద్రాబు ఈ మేరకు ‘ఎక్స్‌’ (ట్విటర్)లో సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు. "ఐమా సాయెబా, ఇక లేరు! చిన్ననాటి స్నేహితుడు నన్ను ఒంటరిగా విడిచి వెళ్లిపోయాడు. శ్రీనగర్, ముంబైలో ఐదు దశాబ్దాల అనుబంధం ఒక నిమిషంలో ముగిపోయింది" అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు శాంతాక్రూజ్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారని ద్రాబు వేరే పోస్ట్‌లో తెలిపారు.బ్యాంకింగ్‌లో అత్యుత్తమ పదవులు నిర్వహించిన ఐమా 2020లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి పదవీ విరమణ చేశారు. 2021లో స్పైస్ మనీ అడ్వైజరీ బోర్డులో చేరారు. 1995లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో చేరడానికి ముందు, ఐమా సిటీ బ్యాంక్‌లో పనిచేశారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో గ్రాడ్యుయేట్ అయిన ఐమా, బ్యాంకింగ్‌ రంగానికి రాక ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్ కావడానికి కృషి చేశారు.

Semiconductor Startups Increasing In India For Export To Other Countries
సెమీకండక్టర్లను ఎగుమతి చేస్తున్న భారత్‌.. ప్రధాన స్టార్టప్‌లు ఇవే..

సెమీకండక్టర్లను దిగుమతి చేసుకునే దశ నుంచి వాటిని తయారుచేసుకుని ఇతర దేశాల్లోని ప్రముఖ కంపెనీలకు సరఫరా చేసే స్థాయికి భారత్‌ చేరుతోంది. దాంతో దేశీయంగా ఉన్న లిస్టెడ్‌ కంపెనీలు ఇప్పటికే వీటి తయారీలో దూసుకుపోతున్నాయి. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్‌ రంగం మరింత వృద్ధి చెందుతుందని భావించి చాలా స్టార్టప్‌ కంపెనీలు ఈ సెమీకండక్టర్ల తయారీకి సిద్ధం అవుతున్నాయి. అందులో ప్రధానంగా ఈ కింది కంపెనీలు దేశీయంగా సెమీకండక్టర్‌ చిప్‌లను తయారుచేస్తున్నాయి.సాంఖ్యల్యాబ్స్‌మైండ్‌గ్రోడ్‌టెర్మినస్‌ సర్క్యూట్స్‌మార్ఫింగ్‌ మిషన్‌ఫెర్మియానిక్‌ఓక్టర్‌ఆగ్నిట్‌ఇన్‌కోర్‌సైన్‌ఆఫ్‌సిలిజియం సర్క్యూట్స్‌ఔరసెమిసెమీకండక్టర్‌ విభాగంలో అంకుర సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో టి-హబ్‌, నీతి ఆయోగ్‌తో కలిసి అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ కింద కోహర్ట్‌-2 కార్యక్రమాన్ని గతంలో చేపట్టాయి. ఈ కార్యక్రమం కింద అంకుర సంస్థలను ఎంపిక చేసి, 6 నెలల పాటు వాటి ఎదుగుదలకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తాయి. దీని కోసం ఇప్పటికే అంకుర సంస్థలను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇందులో ఫేస్‌ఇంటెల్‌ సిస్టమ్స్‌, క్లూపే సైంటిఫిక్‌, డీప్‌ గ్రిడ్‌ సెమి, సెగో ఆటోమొబైల్‌ సొల్యూషన్‌, స్పైడెక్స్‌ టెక్నాలజీస్‌, జియోకాన్‌, ఛిపెక్స్‌ టెక్నాలజీస్‌, జీలీ స్మార్ట్‌ సిస్టమ్‌ ఉన్నాయి.

Office Space Leasing In Hyderabad rose to 22 7 lakh square feet vestian
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్‌ లీజింగ్‌

దేశవ్యాప్తంగా ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతేడాది తొలి త్రైమాసికంలో ఆఫీస్‌ స్థలాల లీజింగ్‌లో వృద్ధి నమోదైందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్‌ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. టాప్ ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీస్ లీజింగ్ డేటాను విడుదల చేసింది.2024 జనవరి-మార్చిలో ఆఫీస్ లీజింగ్‌ 13 శాతం పెరిగి 134 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. ఇది సంవత్సరం క్రితం ఇదే కాలంలో 118.5 లక్షల చదరపు అడుగులు ఉండేది.  అయితే 2023 నాల్గవ త్రైమాసికంలో గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 31 శాతం తగ్గింది.మెట్రో నగరాల్లో అత్యధికంగా చెన్నైలో ఆఫీస్‌ స్థలాల డిమాండ్‌ రెండింతలు పెరిగింది. ఏడాది క్రితం 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్థలం లీజుకు తీసుకోగా, ఈసారి ఏకంగా 33.5 లక్షల చదరపు అడుగులకు చేరుకున్నట్లు నివేదిక వెల్లడించింది.హైదరాబాద్‌లో భారీగా లీజింగ్‌  హైదరాబాద్‌లోనూ ఆఫీస్‌ స్థలం లీజింగ్‌ భారీగా పెరిగింది. తొలి త్రైమాసికంలో 22.7 లక్షల చదరపు అడుగులు లీజుకు తీసుకున్నట్లు వెస్టియన్‌ నివేదిక తెలిపింది. ఏడాది క్రితం నమోదైన 15 లక్షల కంటే ఇది 50 శాతం అధికం కావడం విశేషం. మరోవైపు, దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆఫీస్‌ స్థలం లీజు తగ్గుముఖం పట్టింది. జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో 18.1 లక్షల చదరపు అడుగుల స్థలం మాత్రమే లీజుకు పోయిందని తెలిపింది.ఏడాది క్రితం తీసుకున్న 24 లక్షల చదరపు అడుగులతో పోలిస్తే 25 శాతం తగ్గింది. అలాగే ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ రీజియన్‌లో కూడా 40 శాతం తగ్గింది. దేశవ్యాప్తంగా ఆఫీస్‌ లీజింగ్‌లో దక్షిణాది నగరాలైన బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై వాటా 61 శాతంగా ఉంది. ఈ మూడు నగరాల్లో వాటా 54 శాతం పెరిగింది. అయితే బెంగళూరులో ఆఫీస్‌ లీజింగ్‌ 33 లక్షల చదరపు అడుగుల నుంచి 26.2 లక్షల చదరపు అడుగులకు పడిపోవడం గమనార్హం.ఆర్థిక రాజధాని ముంబైలో ఆఫీస్‌ స్థలం లీజు 12 లక్షల అడుగుల నుంచి 24.9 లక్షలకు పెరగడం విశేషం. కోల్‌కతాలో మాత్రం 3.5 లక్షల చదరపు అడుగుల నుంచి 1.6 లక్షల అడుగులకు పడిపోయింది. పుణెలో ఆఫీస్‌ స్థలం సగానికి సగం పడిపోయింది. ఏడాది క్రితం 15 లక్షల చదరపు అడుగులు కాగా, ఈ సారి 7.1 లక్షల చదరపు అడుగులకు జారుకుంది.ఇక రంగాలవారీగా తీసుకుంటే ఐటీ, ఐటీఈఎస్‌ రంగానికి చెందిన సంస్థలు అధికంగా ఆఫీస్‌ స్థలాలను లీజుకు తీసుకున్నాయి. వీటి వాటా 47 శాతంగా ఉంది. అలాగే బీఎఫ్‌ఎస్‌ఐ రంగం వాటా 11 శాతంగా ఉంది.

Every Minute 500 Hours Of Content Been Uploaded
నిమిషానికి 500 గంటల కంటెంట్‌ అప్‌లోడ్‌.. యూట్యూబ్‌ ప్రస్థానం ఇదే..

ఒక నిమిషానికి దాదాపు 500 గంటల కంటెంట్‌ను అప్‌లోడ్‌ చేస్తున్న యూట్యూబ్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.ఫిబ్రవరి 14, 2005లో పేపాల్‌లో పనిచేస్తున్న స్టీవ్ చెన్‌, చాడ్ హార్లీ, జావెద్ కరీం యూట్యాబ్‌ను రూపొందించారు.2005 ఏప్రిల్‌ 23న ‘మీ ఎట్‌ ది జు’ అనే వీడియోను మొదటగా అప్‌లోడ్‌ చేశారు.మే 2005లో యూట్యూబ్‌ బెటా సైట్‌ను ప్రారంభించారు.సెప్టెంబర్‌ 2005లో మొదటగా 1 మిలియన్‌ మంది వీక్షించిన వీడియా ‘నైక్‌’ యాడ్‌.నవంబర్‌ 2005లో మొదటగా 3.5 మిలియన్‌ డాలర్లతో సెకోయా క్యాపిటల్‌ పెట్టుబడి పెట్టింది.మార్చి 2006లో మొదటగా యూట్యూట్‌లో ప్రకటనలు ప్రారంభించారు.జులై 2006 వరకు సగటున రోజూ 100 మిలియన్‌ వీక్షణలు వచ్చాయి.అక్టోబర్‌ 9, 2006లో యూట్యూబ్‌ను 1.65 బిలియన్‌ డాలర్లకు గూగుల్‌ కొనుగోలు చేసింది.యూట్యూబ్‌ వీడియో అప్‌లోడర్లుకు 2007 నుంచి అవార్డులను ప్రకటిస్తోంది.2008లో యూట్యూబ్‌ సినిమాలు, టీవీ షోలను అప్‌లోడ్‌ చేయడం మొదలుపెట్టింది.జనవరి 2010లో మూవీ రెంటల్‌ సర్వీస్‌ను తీసుకొచ్చింది.మార్చి 2010లో ఉచితంగా స్పోర్ట్స్‌ కంటెంట్‌ అప్‌లోడ్‌ను ప్రారంభించింది.మే 2010లో రోజూ సగటున 2 బిలియన్‌ వీక్షణలు వచ్చేవి.2011లో 3 బిలియన్‌ వీక్షణలకు చేరింది.జనవరి 2012లో రోజూ 4 బిలియన్‌ వ్యూస్‌ వచ్చేవి.2012లో ప్రతి నిమిషానికి 60 గంటల కంటెంట్‌ అప్‌లోడ్‌ అయ్యేంది. ప్రతినెల కొత్తగా 800 మిలియన్ల మంది యూట్యూబ్‌ చూసేవారు.మొదటగా 2012 డిసెంబర్‌ 21న 1 బిలియన్‌ వ్యూస్‌ వచ్చిన వీడియా.. ‘గంగనమ్‌ స్టైల్‌’.మార్చి 2013లో 1 బిలియన్‌ యూజర్ల మార్కును తాకింది.సుసాన్ వోజ్కి ఫిబ్రవరి 2014లో యూట్యూబ్ సీఈఓగా నియమితులయ్యారు.యూట్యూబ్‌ కిడ్స్‌ అని పిలువబడే మొబైల్ యాప్‌ను యూట్యూబ్‌ 2015లో విడుదల చేసింది.2017 ఫిబ్రవరి నాటికి ప్రతి నిమిషానికి 400 గంటల నిడివి ఉన్న కంటెంట్‌ అప్‌లోడ్‌ అయ్యేది.ఆగస్టు 2017లో సర్వీస్ ప్లే బటన్‌తో లోగోను రీడిజైన్ చేశారు.ఏప్రిల్ 3, 2018న కాలిఫోర్నియాలోని శాన్ బ్రూనోలో ఉన్న యూట్యూబ్ ప్రధాన కార్యాలయంలో కాల్పులు జరిగాయి.2019 నాటికి ప్రతి నిమిషానికి 500 గంటల నిడివి ఉన్న కంటెంట్‌ అప్‌లోడ్‌ అయ్యేది.పింక్‌ఫాంగ్ ఛానల్‌కు చెందిన బేబీ షార్క్ డ్యాన్స్‌ వీడియో వ్యూస్‌ జనవరి, 2022 నాటికి 1400 కోట్లు దాటి రికార్డు నెలకొల్పింది. 2016 జూన్‌లో ఈ వీడియో అప్‌లోడ్‌ చేశారు.ఇదీ చదవండి: గూగుల్‌లో 20 ఏళ్ళు.. సుందర్ పిచాయ్ ఎమోషనల్ పోస్ట్అత్యంత వయసు కలిగిన యూట్యూబర్‌గా ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా గుడివాడ గ్రామానికి చెందిన కర్రి మస్తానమ్మ(107) రికార్డు నెలకొల్పారు.యూట్యూబ్‌లో 70 శాతం ట్రాఫిక్‌ మొబైల్‌ ఫోన్ల ద్వారానే వస్తోంది.96 శాతం టీనేజర్లు దీన్ని వినియోగిస్తున్నారు.91 దేశాల్లో ఇది సేవలందిస్తోంది.యూట్యూబ్‌ 80 భాషల్లో సేవలందిస్తోంది. దాదాపు 95 శాతం మంది తమ స్థానిక భాషలో వీడియోలు వీక్షించవచ్చు. 

Amazon Great Summer sale to start soon
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

ఆన్‌లైన్‌లో భారీ డిస్కౌంట్ల కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్‌న్యూస్‌ ఇంది. ప్రముఖ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ (Amazon Great Summer Sale) అతి త్వరలో ప్రారంభం కానుంది. అనేక పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందించే ఈ సేల్ గురించి ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ముందుగానే ప్రకటించింది.అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ టీజర్ పేజీలో ఈ సేల్ వినియోగదారులకు ‘బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్' అందిస్తుందని పేర్కొంది. సేల్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సేల్ ఈవెంట్‌కు ముందు.. అమెజాన్ డిస్కౌంట్లు ఇవ్వనున్న  కొన్ని ఫోన్ల జాబితాను వెల్లడించింది. మీరు కొనాలనుకుంటున్న ఫోన్‌ ఈ జాబితాలో ఉందో లేదో చూసేయండి..ఈ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు..అమెజాన్‌ ముఖ్యంగా 8 వన్‌ప్లస్ ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందించనుంది. అధికారిక అమెజాన్ సేల్ లిస్టింగ్ ప్రకారం.. వన్‌ప్లస్‌ 12 (OnePlus 12), వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4 (OnePlus Nord CE 4), వన్‌ప్లస్‌ 12 ఆర్‌ (OnePlus 12R), వన్‌ప్లస్‌ నార్డ్‌ 3(OnePlus Nord 3) వంటి ఫోన్లలపై డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సమయంలో రెడ్‌మీ 13సీ (Redmi 13C), రెడ్‌మీ నోట్‌ 13 ప్రో (Redmi Note 13 Pro), శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం 34 (Samsung Galaxy M34), షావోమీ 14 (Xiaomi 14), శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌ 23 (Samsung Galaxy S23), ఐకూ జెడ్‌ 9 (iQOO Z9), గెలాక్సీ ఎస్‌ 24 (Galaxy S24), టెక్నో పోవా 6 ప్రో (Tecno Pova 6 Pro) వంటి మరిన్ని ఫోన్లపై కూడా డిస్కౌంట్‌లు ఉంటాయి. ఈ ఫోన్లపై కచ్చితమైన ధరలు రాబోయే రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు కొన్ని కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై కూడా డిస్కౌంట్లను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతానికి, డిస్కౌంట్‌లను పొందే ఐఫోన్‌ల పేర్లను వెల్లడించలేదు. అయితే, సేల్ ఈవెంట్‌లో యాపిల్ డివైజ్‌లు కూడా ఉంటాయని టీజర్ పేర్కొంది.

Sundar Pichai Completes 20 Years At Google And Insta Post Viral
గూగుల్‌లో 20 ఏళ్ళు.. సుందర్ పిచాయ్ ఎమోషనల్ పోస్ట్

గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) 'సుందర్ పిచాయ్' టెక్ దిగ్గజంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. ఏప్రిల్ 26 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.''2004 ఏప్రిల్ 26 గూగుల్ కంపెనీలో నా మొదటి రోజు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మార్పులు వచ్చాయి. టెక్నాలజీ మాత్రమే కాకుండా.. మా ఉత్పత్తులను ఉపయోగించే వారి సంఖ్య కూడా పెరిగింది. ఈ అద్భుతమైన కంపెనీలో పని చేయడం వల్ల చాలా థ్రిల్ పొందాను. సంస్థలో పనిచేస్తున్నందుకు ఇప్పటికీ నన్ను నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నాను'' అంటూ సుందర్ పిచాయ్ పోస్ట్ చేశారు. సుందర్ పిచాయ్ చేసిన ఈ పోస్ట్ కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. ఇప్పటికే 1,42,999 కంటే ఎక్కువ లైక్స్ పొందిన ఈ పోస్ట్ మీద నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. చాలామంది సుందర్ పిచాయ్ విజయాన్ని గొప్పగా అభినందించారు.  సుందర్ పిచాయ్ 2004లో గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ హెడ్‌గా చేరాడు. ఆ తరువాత దినదినాభివృద్ధి చెందుతూ ఆ కంపెనీకి సీఈఓగా ఎదిగారు. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన పిచాయ్‌ నేడు భారతదేశం గర్వించదగ్గ వ్యక్తిగా ఎదిగారంటే దాని వెనుక ఉన్న ఆయన కృషి అనన్య సామాన్యమనే చెప్పాలి.    View this post on Instagram           A post shared by Sundar Pichai (@sundarpichai)

Buffett real estate firm to pay 250 million usd to settle lawsuits
రూ.20 వేల కోట్ల సెటిల్మెంట్‌కు వారెన్ బఫ్ఫెట్‌

వారెన్ బఫ్ఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్వే యాజమాన్యంలోని రియల్ ఎస్టేట్ కంపెనీ ‘హోమ్‌ సర్వీసెస్ ఆఫ్ అమెరికా’ అమెరికా దేశవ్యాప్తంగా వ్యాజ్యాలను పరిష్కరించుకునేందుకు 250 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.20 వేల కోట్లు) చెల్లించడానికి అంగీకరించింది.రియల్‌ బ్రోకరేజీలు తమ నుంచి అధికంగా బ్రోకర్‌ కమీషన్లు వసూలు చేశాయంటూ అమెరికాలోని గృహ యజమానులు ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ప్రతిపాదిత సెటిల్‌మెంట్ ద్వారా తమ 51 బ్రాండ్‌లు, దాదాపు 70,000 రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, 300 ఫ్రాంఛైజీలకు ఈ వ్యాజ్యాల నుంచి విముక్తి లభిస్తుందని హోమ్‌ సర్వీసెస్ ఆఫ్ అమెరికా తెలిపింది.కెల్లర్ విలియమ్స్ రియాల్టీ, రీ/మ్యాక్స్, కంపాస్, ఎనీవేర్ రియల్ ఎస్టేట్‌తో సహా అనేక ఇతర పెద్ద బ్రోకరేజ్ సంస్థలు ఇదివరకే సెటిల్మెంట్‌కు సిద్ధమైన నేపథ్యంలో  ‘హోమ్‌ సర్వీసెస్ ఆఫ్ అమెరికా’ కంపెనీ కూడా సెటిల్మెంట్‌ సిద్ధమైంది. గత నెలలో, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ 418 మిలియన్ డాలర్లు చెల్లించడానికి అంగీకరించింది.

Pasteurized milk safe from bird flu fda
బర్డ్‌ఫ్లూ భయం లేదు.. అలా చేసిన పాలు సేఫ్‌!

జంతువుల్లో ప్రాణాంతకమైన బర్డ్‌ఫ్లూ వైరస్‌ అమెరికాలో మనిషికి సోకడం భయాందోళన కలిగిస్తోంది. వైరస్‌ ఆనవాళ్లు మనుషులు తాగే ఆవు పాలలో కనిపించడంతో అందరూ భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు కీలక విషయం చెప్పారు.యూఎస్‌ స్టోర్లలో విక్రయిస్తున్న పాలు బర్డ్ ఫ్లూ నుండి సురక్షితమైనవని అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ వెల్లడించింది. ఎందుకంటే ఈ పాలను పాశ్చరైజేషన్ చేస్తారని, పాశ్చరైజేషన్ వ్యాధిని ప్రభావవంతంగా చంపుతుందని పేర్కొన్నారు.అత్యంత వ్యాధికారక ఏవియన్ ఇన్‌ఫ్లుయంజా (HPAI) వ్యాప్తి దేశవ్యాప్తంగా పాడి పశువుల మందల ద్వారా వ్యాపించింది. తేలికపాటి లక్షణాలతో ఒక వ్యక్తికి సోకింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని పాల విక్రయ సంస్థల నుంచి నమూనాలను ఎఫ్‌డీఏ పరీక్షించింది. ఇందులో ప్రతి ఐదు శాంపిల్స్‌లో ఒక దాంట్లో వైరస్‌ ఆనవాళ్లు కనిపించాయని ఎఫ్‌డీఏ పేర్కొంది.అయితే పాశ్చరైజేషన్ ప్రక్రియ కారణంగా వైరస్ పాల ద్వారా ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం లేదని ఎఫ్‌డీఏ ప్రకటించింది. దీనిపై మరిన్ని పరీక్షలు అవసరమని పేర్కొంది. హెచ్‌పీఏఐని నిష్క్రియం చేయడంలో పాశ్చరైజేషన్ ప్రభావవంతంగా ఉంటుందిని ప్రాథమిక ఫలితాల్లో గుర్తించినట్లు ఎఫ్‌డీఏ వెల్లడించింది. ఇంతకుముందు బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు పచ్చి పాలలో కనుగొనడంతో ఆరోగ్య అధికారులు పచ్చి పాలను తాగొద్దని సూచించారు.

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
SVC 90.380364 2024-04-09
MWK 90.380364 2024-04-09
SVC 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19

Commodities

Name Rate Change Change
Silver 65.70 75.20

Egg & Chicken Price

Title Price Quantity
Egg 100.00 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement