Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

Indian Students Need To Show Rs 16 Lakh Savings To Get Australia Visa
ఆస్ట్రేలియాలో చదువు.. వీసాకు కొత్త రూల్‌

ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. స్టూడెంట్ వీసా కావాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులు దేశం కనీస వేతనంలో కనీసం 75 శాతానికి సమానమైన నిధులను కలిగి ఉండాలని ఆస్ట్రేలియా కొత్త నిబంధనను విధించింది.మే 10 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన ప్రకారం.. ఆస్ట్రేలియాలో చదివేందుకు అర్హత సాధించడానికి, భారతీయ విద్యార్థులు తప్పనిసరిగా కనీసం 29,710 ఆస్ట్రేలియా డాలర్లు (దాదాపు రూ. 16,29,964) తమ బ్యాంక్‌ ఖాతాల్లో బ్యాలెన్స్‌ చూపించాలి.నాలుగు సార్లు పెంపుఇమిగ్రేషన్ విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆస్ట్రేలియా ప్రభుత్వం గడిచిన ఏడు నెలల్లో విద్యార్థుల పొదుపు సొమ్ముకు సంబంధించి ​​వీసా నిబంధనలను నాలుగు సార్లు సవరించింది. గత సంవత్సరం అక్టోబర్ నాటికి, విద్యార్థి వీసాల కోసం చూపించాల్సిన మినిమమ్‌ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ 21,041 ఆస్ట్రేలియన్‌ డాలర్లు ఉండేది.ఈ ఏడాది మార్చిలో ఇమిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేసే ప్రక్రియలో భాగంగా ఆస్ట్రేలియన్ ప్రభుత్వం ఇంగ్లిష్‌ భాషా సామర్థ్యాన్ని పెంచింది. కోవిడ్‌ పరిమితుల అనంతరం ఆస్ట్రేలియాకు విద్యార్థుల రాక పెరిగింది. దీంతో వసతికి సైతం కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీసా చట్టాల అమలును కఠినతరం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tired But Not Suicidal Says Melissa McAtee
'నేను ఆత్మహత్య చేసుకోను'.. ఫార్మా కంపెనీపై ఉద్యోగి సంచలన వ్యాఖ్యలు

కరోనా మహమ్మారి ఎంతోమంది ప్రాణాలను హరించింది. ప్రపంచం మొత్తం భయం గుప్పెట్లో ఇరుక్కున్న సమయంలో అనేక ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్స్ తయారుచేసి అందించడం మొదలుపెట్టాయి. ఇలా వ్యాక్సిన్స్ తయారు చేసిన కంపెనీల జాబితాలో ఒకటి ఫార్మా దిగ్గజం 'ఫైజర్'.కరోనా రక్కసి నుంచి రతప్పించుకోవడానికి ఉపయోగించిన వ్యాక్సిన్స్.. ఆ తరువాత అనేక దుష్ప్రభావాలను చూపించింది. దీంతో చాలామంది కరోనా వ్యాక్సిన్ వేసుకున్నవారు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇటీవల ఫైజర్ ఫార్మా కంపెనీలో పనిచేసే మహిళ 'మెలిస్సా మెక్‌టీ'.. ఆ కంపెనీ గురించి సంచనల విషయాలు బయటపెట్టింది.అమెరికాకు చెందిన ఫైజర్ ఫార్మా కంపెనీ ప్రపంచంలోని దాదాపు 150 కంటే ఎక్కువ దేశాలకు తన వ్యాక్సిన్ సరఫరా చేసింది. ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ గురించి పక్కన పెడితే.. అందులో మానవ పిండం కణజాలం-ఉత్పన్నమైన సెల్ లైన్‌లను ఉపయోగించినట్లు ఆరోపిస్తూ కంపెనీ ఈమెయిల్‌లను మెలిస్సా మెక్‌టీ లీక్ చేశారు.మెలిస్సా మెక్‌టీ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇందులో తాను ఫైజర్ విజిల్‌బ్లోయర్‌ని అని పేర్కొంది. కంపెనీలో సుమారు పదేళ్లు పని చేసినట్లు పేర్కొన్నారు. ఈ వీడియో లీక్ చేస్తూ.. తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యం లేదని, తనకు భర్త, కొడుకు ఉన్నట్లు పేర్కొంది. తన కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేస్తూ.. తన ప్రాణానికి హాని కలిగితే అది, కంపెనీ పనే అంటూ వెల్లడించింది.గతంలో 737 మ్యాక్స్ బోయింగ్ విమానంలో లోపాలను గురించి వెల్లడించిన వ్యక్తి, కొన్ని రోజుల తరువాత ప్రాణాలు కోల్పోయాడు. కాబట్టి నా ప్రాణాలకు కూడా ప్రమాదం జరిగితే అది కంపెనీ పన్నిన కుట్ర అని మెలిస్సా మెక్‌టీ అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.I AM A PFIZER WHISTLEBLOWERTHE ONLY ONE ACTUALLY EMPLOYED AS A LONG TERM PFIZER EMPLOYEEI AM TIRED.I am tired of feeling like an imposter.I am tired of feeling like I have no hope. I am tired of fighting, debating, posting, researching.. But I am NOT suicidal. I have a… pic.twitter.com/NcSy9R2Hho— Melissa McAtee (@MelissaMcAtee92) May 8, 2024

Banks In These Cities Will Be Closed For Phase 4 Of Elections On May 13
మే 13న ఎన్నికలు.. ఈ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు

భారత ఎన్నికల సంఘం టైమ్‌టేబుల్ ప్రకారం ఏడు దశల లోక్‌సభ 2024 ఎన్నికల నాలుగో రౌండ్ మే 13న (సోమవారం) జరగనుంది. అయితే ఎన్నికల పోలింగ్‌ సజావుగా జరిగేలా నియోజకవర్గాలలోని స్కూల్స్‌, ఇతర సంస్థలకు ఈసీ సెలవు ప్రకటించింది. ఆర్‌బీఐ ప్రకారం ఓటింగ్ జరగనున్న అన్ని నియోజకవర్గాల్లో బ్యాంకులు మూత పడనున్నాయి. ఈ ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు మే 13న 4వ దశ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ- కాశ్మీర్‌లో బ్యాంక్ సేవలు నిలిచిపోనున్నాయి.

Ola Moves Microsoft To Krutrim, Loss Of Rs 100 Crore For Microsoft In India
అజ్యూర్‌కు ఓలా గుడ్‌బై.. మైక్రోసాఫ్ట్‌కు 100 కోట్ల నష్టం?

ప్రముఖ దేశీయ క్యాబ్‌ సర్వీస్‌ దిగ్గజం ఓలా..మైక్రోసాఫ్ట్‌ మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ సర్వీస్‌ అజ్యూర్‌కు స్వస్తి పలికిన విషయం తెలిసిందే. ఓలా తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా మైక్రోసాఫ్ట్‌ ఇండియాకు దాదాపూ రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందనే అంచనాలు నెలకొన్నాయి.ఇటీవల ఓలా సీఈవో భవీష్‌ అగర్వాల్‌ మైక్రోసాఫ్ట్‌కు చెందిన లింక్డిన్‌ ఏఐలో బాట్‌లో తన గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. భవీష్‌ అగర్వాల్‌ ఎవరు? అని సెర్చ్‌ చేశారు. దీనికి బాట్‌ అతడు/ ఆయన ఉండాల్సిన చోటు వారు/ వాళ్లు ఉండడం చూసి.. అనే సమాధానం ఇచ్చింది. అంతే ఈ సమాధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భవిష్‌ లింక్డిన్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. తమ నిబంధనలకు విరుద్దం అంటూ ఆ పోస్ట్‌ను లింక్డిన్‌ డిలీట్‌ చేసింది. లింక్డిన్‌ పోస్ట్‌ తన పోస్ట్‌ డిలీట్‌ చేయడంతో లింక్డిన్‌ మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్‌పై భవిష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వారంలోగా మైక్రోసాఫ్ట్ అజ్యూర్‌ క్లౌట్‌ కంప్యూటింగ్‌ సేవలకు స్వస్తి పలకాలని తమ కంపెనీ నిర్ణయించినట్లు తెలిపారు. మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని లింక్డిన్‌ తీరు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఫలితంగా మైక్రోసాఫ్ట్‌ వందల కోట్లలో నష్టం వాటిల్లనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

Today Gold Rate In India
దేశంలో బంగారం ధరలు.. తగ్గాయా? పెరిగాయా?

దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,250 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,360 వద్ద కొనసాగుతోంది. ఇక దేశంలో పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయిహైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందివిజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందివిశాఖ పట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందిబెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందిచెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,640గా ఉంది.ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందిఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,510గా ఉంది.కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉంది.

World Needs Indian Leadership Says Japanese Ceo
‘భళా భారత్‌’.. జపాన్‌ కంపెనీ సీఈఓ ప్రశంసల వర్షం

భారత్‌ సంస్కృతి, సంప్రదాయాలకు జపాన్‌ టెక్‌ కంపెనీ కోఫౌండర్‌ ఫిదా అయ్యారు. భారత్‌ భళా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే సత్తా ఈ దేశానికే ఉందంటూ లింక్డిన్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.టెక్ జపాన్ కంపెనీ కోఫౌండర్‌, సీఈఓ నౌటకా నిషియామా.. తన వ్యాపార కార్యకలాపాల్ని భారత్‌లో విస్తరించాలని భావించారు. ఇందుకోసం ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాల్ని అర్ధం చేసుకునేందుకు గత నెలలో సిలికాన్‌ వ్యాలీగా పేరొందిన బెంగళూరుకు వచ్చారు.ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా ఈ నేపథ్యంలో భారత్‌పై ప్రశంసలు కురిపిస్తూ ఓ పోస్ట్‌ పెట్టారు. ఈ రోజు ప్రపంచం నివసించడానికి అస్తవ్యస్తమైన ప్రదేశంగా ఉందని అన్నారు. అయితే అనేక విషయాల్లో అపార అనుభవం ఉన్న భారత్‌ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా ఉందన్నారు. ఆశ్చర్యపోయా‘ప్రపంచానికి భారతీయ నాయకత్వం అవసరం. నేను భారతదేశానికి వచ్చి నెలరోజులైంది. దేశంలోని విలువల వైవిధ్యాన్ని చూసి మరోసారి ఆశ్చర్యపోయాను’ అని లింక్డిన్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్‌లు.. వివిధ మతాలు, జాతులు, విలువలతో కూడిన పెద్ద దేశంగా ఉన్నప్పటికీ భారతదేశం ఒకే దేశం కావడం ఒక అద్భుతం. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ల విజయాల్ని ఉదహరించారు. భారత్‌ పోటీ, సహకారం రెండింటినీ మూర్తీభవించిందని.. ప్రపంచ సంస్థలో నాయకత్వం వహించే సామర్థ్యాన్ని కలిగి ఉందని నిషియామా అన్నారు. వ్యాపార రంగంలో, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల రెండవ తరం అమెరికన్లు కాదు. వారు ఇక్కడే (భారత్‌) జన్మించారు. ఇక్కడే చదువుకున్నారు. ఆపై గ్రాడ్యుయేట్ కోసం అమెరికాకు వెళ్లారు. వాళ్లే టెక్‌ రంగాల్ని శాసిస్తున్నారంటూ భారత్‌ను కొనియాడుతూ పోస్ట్‌ చేశారు. నౌటకా నిషియామా పోస్ట్‌పై నెటిజన్లు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Anand Mahindra Share Electric Flying Taxi
భారతదేశపు మొదటి 'ఫ్లైయింగ్ టాక్సీ' - ఆనంద్ మహీంద్రా ట్వీట్

గత కొన్ని సంవత్సరాలు ఎగిరే కార్లు వస్తాయని వింటూనే ఉన్నాము. ఇటీవల ఆనంద్ మహీంద్రా దేశంలో అడుగు పెట్టనున్న మొదటి ఎలక్ట్రిక్ ట్యాక్సీను పరిచయం చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎప్లాన్ (Eplane) అనే స్టార్టప్ కంపెనీ ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ టాక్సీని అభివృద్ధి చేసింది. దీనికి గత సంవత్సరమే ఏవియేషన్ సెక్టార్ రెగ్యులేటర్ డీజీసీఏ నుంచి అనుమతి లభించింది. దీంతో ఈ కంపెనీ భారతదేశంలో తొలి ఎలక్ట్రిక్ విమానాల తయారు చేసే కంపెనీగా అవతరిస్తుంది.ఈ కంపెనీకి చెందిన ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీని ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) వేదికగా షేర్ చేస్తూ.. వచ్చే ఏడాది లోపల మద్రాస్ ఐఐటీ ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీని అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.The eplane company. A company being incubated at IIT Madras to build a flying electric taxi by sometime next year…IIT Madras has become one of the WORLD’s most exciting and active incubators. Thanks to them and the rapidly growing number of ambitious incubators throughout… pic.twitter.com/Ijb9Rd2MAH— anand mahindra (@anandmahindra) May 10, 2024

iVoomi JeetX ZE electric scooter launched at Rs 80,000
మార్కెట్‌లో కొత్త ఈవీ బైక్‌.. ధర ఎంతంటే?

దేశీయ ఆటోమొబైల్‌ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. వాహనదారులు పెట్రోల్‌, డీజిల్‌ ఆధారిత వాహనాలకు స్వస్తిచెబుతున్నారు. ధర కాస్త ఎక్కువే అయినా ఈవీ వెహికల్స్‌ కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. ఈ తరుణంలో పూణే ఆధారిత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ iVoomi కొత్త ఎలక్ట్రిక్‌ స్కూట్‌ మార్కెట్‌కు పరిచయం చేసింది. JeetX ZE పేరుతో విడుదల చేసిన బైక్‌ ధర రూ. 80,000 (ఎక్స్-షోరూమ్) ధర ఉండగా... దీని రేంజ్‌ 170 కిమీల పరిధిని వరకు ఉంది.మూడు విభిన్న వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌ నార్డో గ్రే, అల్ట్రా రెడ్, అర్బన్ గ్రీన్ ఇలా ఎనిమిది రకాల రంగుల్లో JeetX ZE 2.1 కిలోవాట్ల పీక్ పవర్ కోసం రేట్ బీఎల్‌డీసీ మోటార్‌కు కనెక్ట్ చేసిన 3 కిలోవాట్ గంటల బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. గంటకు గరిష్టంగా 57 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్‌ చేయొచ్చు. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 5.5 గంటల సమయం పడుతుంది. 2.5 గంటల కంటే తక్కువ సమయంలో 50 శాతం ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు.

Indian Luxury Homes Claim Larger Share Of Sales
ధరెంతైనా.. ఖరీదైన ఇళ్లను ఎగబడి కొనుగోలు చేస్తున్న భారతీయులు

భారతీయలు లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ గ్రూప్ నివేదిక ప్రకారం.. మన దేశంలో విక్రయించే లగ్జరీ గృహాల వాటా గత ఐదేళ్లలో మూడు రెట్లు పెరిగింది.శుక్రవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం విలాసవంతమైన గృహాల విలువ కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉన్నట్లు తెలింది. భారత్‌లోని తొలి ప్రధాన ఏడు నగరాల్లో ఈ ఏడాది జనవరి- మార్చి (మొదటి త్రైమాసికం)లో విక్రయించిన రెసిడెన్షియల్‌ యూనిట్లు 21 శాతంగా ఉన్నాయి. 2019లో ఇదే కాలానికి 7శాతం మాత్రమే విక్రయించినట్లు నివేదిక హైలెట్‌ చేసింది. బలమైన ఆర్థిక వృద్ధి, ప్రవాస భారతీయుల నుండి డిమాండ్ కారణంగా భారత్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగం ఊపందుకుంది. వెరసి ఈ ఏడాది ప్రారంభంలో డీఎల్‌ఎఫ్‌ కంపెనీ న్యూఢిల్లీకి సమీపంలో 1,100 కంటే ఎక్కువ గృహాలు నిర్మాణాన్ని ప్రారంభించక ముందే మూడు రోజుల్లో అమ్ముడయ్యాయి. వీటిలో అధిక భాగం ఎన్‌ఆర్‌ఐలు కొనుగోలు చేశారు. బడ్జెట్‌ ధరలో లభ్యమయ్యే ఇళ్లు అదే కాలంలో అమ్మకాల వాటా 37శాతం నుండి 18శాతానికి క్షీణించాయి. మధ్య శ్రేణి, ప్రీమియం హౌసింగ్ సెగ్మెంట్‌లో 4 మిలియన్ నుంచి 15 మిలియన్ మధ్య ధర కలిగిన గృహాలు దాదాపు 59 శాతం వాటాతో అత్యధికంగా అమ్ముడు పోయినట్లు అనరాక్‌ నివేదిక హైలెట్‌ చేసింది.

OpenAI And Apple Deal For ChatGPT Features in iPhone
ఐఫోన్‌లో చాట్‌జీపీటీ ఫీచర్స్!.. ఓపెన్ఏఐతో యాపిల్ చర్చ

ఇప్పటికే పలు స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) ఫీచర్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో దిగ్గజ ఐఫోన్‌ తయారీ సంస్థ 'యాపిల్' తన మొబైల్‌లో స్టార్టప్ టెక్నాలజీని ఉపయోగించడానికి ఓపెన్ఏఐతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.రాబోయే యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 18లో చాట్‌జీపీటీ ఫీచర్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సంస్థ ఓపెన్ఏఐతో జత కట్టినట్లు సమాచారం. రెండు కంపెనీల మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన వెల్లడి కావాల్సి ఉంది.ఒప్పందం కుదిరిన తరువాత ఈ టెక్నాలజీ సెప్టెంబర్ 2024లో ప్రారంభమవుతుందని సమాచారం. ఇప్పటికే యాపిల్ కంపెనీ జెమినీ చాట్‌బాట్‌తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపించాయి. ఆ చర్చలు ఇంకా పూర్తికాక ముందే.. యాపిల్ కంపెనీ ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉంది.యాపిల్ కంపెనీ జూన్‌లో నిర్వహించనున్న వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్పిరెన్స్‌‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రకటించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. గత సంవత్సరం యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా చాట్‌జీపీటీ వినియోగాన్ని గురించి ప్రస్తావించారు. ఇందులో అనేక సమస్యలను క్రమబద్ధీకరించవలసి అవసరం ఉందని, దీనివల్ల ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయని ఆయన ప్రస్తావించారు.

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
SVC 90.380364 2024-04-09
MWK 90.380364 2024-04-09
SVC 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19

Commodities

Name Rate Change Change
Silver 1 Kg 88700.00 200.00
Gold 22K 10gm 66150.00 -100.00
Gold 24k 10 gm 72160.00 -100.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement