News


ఎంఎఫ్‌లకు క్రిసిల్‌ ర్యాకింగ్‌లు

Saturday 9th February 2019
personal-finance_main1549712272.png-24113

గతేడాది మ్యూచువల్‌ ఫండ్స్‌ రాబడులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. లిక్విడిటీపై ఆందోళన, ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభం, అంతర్జాతీయ పరిస్థితులు.. ఈక్విటీలపై ప్రభావం చూపాయి. దీంతో చాలా మ్యూచువల్‌ ఫండ్స్‌ పేలవ ప్రదర్శన చూపాయి. డిసెంబర్‌ నాటికి ఎంఎఫ్‌లు చూపిన ప్రదర్శన ఆధారంగా 474ఫండ్స్‌కు క్రిసిల్‌ ర్యాంకులిచ్చింది. ఇందులో 211 ఎంఎఫ్‌లు ఈక్విటీ ఫండ్స్‌ కాగా, 215 డెట్‌, 48 హైబ్రిడ్‌ ఫండ్స్‌ ఉన్నాయి. ర్యాంకింగ్‌లో యాక్సి్‌స్‌ ఎంఎఫ్‌, కోటక్‌ మహీంద్రా ఎంఎఫ్‌లు తమ పథకాలతో అగ్రస్థానాన్ని అలంకరించాయి. వీటి తర్వాత స్థానాల్లో హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎంఎఫ్‌, ఐడీఎఫ్‌సీ ఎంఎఫ్‌ ఉన్నాయి. వీటితో పాటు 25 లార్జ్‌క్యాప్‌, 20 మిడ్‌క్యాప్‌; 11 స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌కు సైతం క్రిసిల్‌ ర్యాంకులు ఇచ్చింది. లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌ విభాగంలో రిలయన్స్‌ లార్జ్‌ క్యాప్‌ఫండ్‌ టాప్‌లో నిలిచింది. కేవలం తోటి ఫండ్స్‌తో పోలిస్తే దాదాపు రెట్టింపు రాబడినివ్వడమే కాకుండా పనితీరులో కూడా మెరుగు చూపిందని క్రిసిల్‌ డైరెక్టర్‌ భూషణ్‌ కేదార్‌ చెప్పారు. తర్వాత స్థానాల్లో ఎడెల్‌వీజ్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్‌, ఐడీఎఫ్‌సీ లార్జ్‌క్యాప్‌ ఫండ్‌ నిలిచాయి. గతేడాది చిన్నస్టాకులతో పోలిస్తే లార్జ్‌క్యాప్సే ఎక్కువ లాభాలు ఆర్జించాయి. అందువల్ల ఇతర ఫండ్స్‌తో పోలిస్తే లార్జ్‌క్యాప్‌ ఫండ్సేఎక్కువ రాబడినిచ్చాయని వివరించారు.


MF

You may be interested

ఎన్నికల ముందే కొనుగోళ్లకు ఛాన్స్‌!

Saturday 9th February 2019

డీకే అగర్వాల్‌ సూచన సాధారణ ఎన్నికలకు ముందు సరైన కొనుగోళ్లకు అవకాశం వస్తుంటుందని, ఇన్వెస్టర్లు ఈ సమయంలో సంపద సృష్టి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రముఖ అనలిస్టు డీకే అగర్వాల్‌ సూచించారు. ఈ దఫా ఎన్నికలకు ముందు ప్రభుత్వం పలు జనాకర్షక పథకాలను ప్రవేశపెట్టింది. దీంతో ఇకపై వినిమయం మరింత జోరందుకుంటుందని, ఇన్వెస్టర్‌ సెంటిమెంట్‌ పాజిటివ్‌గా మారుతుందని అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ తాజాగా తీసుకున్న రేట్‌ కట్‌ నిర్ణయం మోదీ ప్రభుత్వానికి అందించిన

స్వల్పంగా పెరిగిన పసిడి ధర

Saturday 9th February 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర వారంతపు రోజైన శుక్రవారం 4.50డాలర్లు లాభపడింది. రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 1,318.50 డాలర్ల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ ఆర్థికవృద్ది మందగమనం ఆందోళనలు మరోసారి తెరపైకి రావడంతో పాటు ప్రపంచమార్కెట్లలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచాయి. అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్‌ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ దేశాధ్యక్షుడు ట్రంప్‌ శుక్రవారం ది రోజ్‌ గార్డెన్‌లో మాట్లాడుతూ.. సరిహద్దుల్లో

Most from this category