News


బాండ్లలో స్థిరమైన రాబడులు

Monday 20th January 2020
personal-finance_main1579490431.png-31035

  • బాండ్లలో స్థిరమైన రాబడులు
  • ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఆల్‌సీజన్స్‌ బాండ్‌ ఫండ్‌

దేశ జీడీపీ వృద్ధి రేటు కనిష్ట స్థాయిలకు చేరింది. అదే సమయంలో ప్రభుత్వానికి పన్నుల ఆదాయం తగ్గడం ద్రవ్యలోటుపై భారాన్ని మోపేదే. ఇదంతా బాండ్‌ మార్కెట్‌పై ప్రతిఫలిస్తుంది. దీంతో జనవరి-మార్చి త్రైమాసికంలో ప్రభుత్వ బాండ్ల పరంగా అధిక సరఫరా నెలకొనే పరిస్థితులు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ప్రభుత్వం అధికంగా రుణ సమీకరణ చేస్తే అది బాండ్‌ మార్కెట్‌పై తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. ద్రవ్యలోటు అంచనాలను మించే అవకాశాలు, అలాగే, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం బాండ్‌ ఈల్డ్స్‌ను నిర్ణయించనున్నాయి. స్వల్పకాల బాండ్లలో ర్యాలీ నెలకొనే అవకాశం ఉంది. అంటే ఈ సమయంలో దీర్ఘకాల గిల్డ్‌ ఫండ్స్‌ తీసుకోవడం కొంత రిస్కే అవుతుంది. కనుక ఈ విధమైన పరిస్థితుల్లో అన్ని రకాల కాల వ్యవధులు కలిగిన బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసే డైనమిక్‌ బాండ్‌ ఫండ్స్‌ను పెట్టుబడులకు పరిశీలించడం అనుకూలం అవుతుంది. మార్కెట్లలో రేట్లకు అనుగుణంగా డైనమిక్‌ బాండ్‌ ఫండ్స్‌ మేనేజర్లు తమ పోర్ట్‌ఫోలియోలోని బాండ్లను ఎంపిక చేసుకునే స్వేచ్ఛతో ఉంటారు. కనుక ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఆల్‌సీజన్స్‌ బాండ్‌ ఫండ్‌ను పరిశీలించొచ్చు. 

పనితీరు...
డైనమిక్‌ బాండ్స్‌ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఆల్‌సీజన్స్‌ బాండ్‌ పథకం నిలకడైన పనితీరు చూపిస్తోంది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో పెట్టుబడులపై రాబడులు 10.4 శాతంగా ఉన్నాయి. కానీ, ఈ కాలంలో ఈ విభాగం సగటు రాబడులు 7.8 శాతమే అని గుర్తించాలి. అలాగే, మూడేళ్లలో వార్షిక రాబడులు 6.9 శాతంగా ఉంటే, ఐదేళ్లలో సగటు వార్షిక రాబడులు 8.8 శాతంగా ఉండడం బాండ్లలో మెరుగైన పనితీరుగానే చూడాల్సి ఉంటుంది. మూడేళ్ల కాలంలో డైనమిక్‌ బాండ్స్‌ విభాగం సగటు వార్షిక రాబడులు 5.1 శాతం, ఐదేళ్ల కాలంలో 7.1 శాతంతో పోలిస్తే ఈ పథకం పనితీరు బాగానే ఉంది. ఈ పథకం అన్ని రకాల మార్కెట్‌ పరిస్థితుల్లోనూ స్థిరమైన రాబడులను ఇచ్చింది. 2014, 2016 బాండ్ల ర్యాలీ జరిగిన సంవత్సరాల్లో 16-19 శాతం వరకు గరిష్ట రాబడులను ఇచ్చి మేటిగా నిలిచింది. అలాగే, ప్రతికూలంగా ఉన్న 2018 సంవత్సరంలోనూ 6 శాతం రాబడులతో మంచి పనితీరే చూపించింది. కనుక ఇన్వెస్టర్లు, కొంత రిస్క్‌ తీసుకునే సామర్థ్యం కలిగిన వారు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఆల్‌సీజన్స్‌ బాండ్‌ పథకాన్ని పరిశీలించొచ్చు.

పెట్టుబడుల విధానం...
డిసెంబర్‌లో ఆర్‌బీఐ ఎంపీసీ విధాన ప్రకటన తర్వాత పదేళ్ల ప్రభుత్వ బాండ్‌ ఈల్డ్స్‌ వేగంగా పెరిగాయి. 30 బేసిస్‌ పాయింట్ల వరకు పెరిగి 6.7-6.8 శాతాన్ని చేరాయి. కానీ, ఆర్‌బీఐ ట్విస్ట్‌, ఓఎంవో చర్యలతో మళ్లీ ఈల్డ్స్‌ తగ్గాయి. అయితే, దీర్ఘకాలిక బాండ్‌ ఈల్డ్స్‌ మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా. సాధారణంగా దీర్ఘకాలిక బాండ్లు వడ్డీ రేట్ల పరంగా సున్నితంగా ఉంటాయి. కనుక అప్పటి మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా అనుకూలమైన కాలానికి బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసే డైనమిక్‌ బాండ్‌ ఫండ్స్‌ను ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకోవచ్చు. 



You may be interested

నేడు ఫ్లాట్‌ ఓపెనింగ్‌?

Monday 20th January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 7 పాయింట్లు ప్లస్‌ నేడు(సోమవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 7 పాయింట్ల స్వల్ప లాభంతో 12,384 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,377 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. వివాద పరిష్కారంలో భాగంగా చైనాతో వాణిజ్య

వేలంలో ఇల్లు.. కొనేటప్పుడు బీ కేర్‌ఫుల్లు!!

Monday 20th January 2020

ఆదరాబాదరాగా కొని సమస్యల పాలు కావద్దు.. ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవడం కీలకం బ్యాంకులపై ఆ బాధ్యత ఉండదు ఉన్నది ఉన్నట్టుగానే అనే షరతుతో వేలం సమస్యలు ఎదురైతే కొనుగోలుదారునిదే బాధ్యత అన్ని షరతులు, నిబంధనలను ముందే తెలుసుకోవాలి న్యాయ నిపుణుల సూచనల మేరకు నడచుకోవాలి కారు చౌకగా వస్తుందనో... ఎవరో చెప్పారనో... మంచి ఏరియాలో ఉందనో ఇలా కారణాలేవైతేనేం బ్యాంకులు వేలం వేసే ఇళ్లవైపు మొగ్గుచూపేవారు చాలామందే ఉంటారు. అయితే, ఇలా కొనేటప్పుడు నిబంధనలు... చట్టపరమైన అంశాలన్నింటినీ కూలంకషంగా

Most from this category