News


స్పైస్‌జెట్‌కు ఇంధన సెగ

Tuesday 12th February 2019
Markets_main1549950963.png-24148

  • 77 శాతం తగ్గిన నికర లాభం
  • రూ.2,531 కోట్లకు మొత్తం ఆదాయం

ముంబై: చౌక ధరల విమానయాన సంస్థ, స్పైస్‌జెట్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక  కాలంలో 77 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.240 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.55 కోట్లకు చేరిందని స్పైస్‌జెట్‌ తెలిపింది. విమానయాన ఇంధనం ధరలు 34 శాతం పెరగడం,  రూపాయి 11 శాతం పతనం కావడం వంటి కారణాల వల్ల  ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని స్పైస్‌జెట్‌ చైర్మన్‌ అజయ్‌ సింగ్‌ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.2,096 కోట్ల నుంచి రూ.2,531 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు.
భవిష్యత్తు అంచనాలు ఆశావహమే...
ప్యాసింజర్‌ ఈల్డ్స్‌ 8 శాతం పెరగడం వల్ల నష్టాలు తగ్గాయని అజయ్‌ సింగ్‌ వివరించారు. ఇంధన వ్యయాలు భారీగా పెరిగినా, కరెన్సీ మారకం పతనమైనా, ఆదాయం పెరుగుదల, పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా ఈ క్యూ3లో మంచి ఫలితాలు సాధించామని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రంగంలోని సమస్యలు ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తున్నాయని, భవిష్యత్తు అంచనాలు ఆశావహంగానే ఉన్నాయని పేర్కొన్నారు. సామర్థ్యం పెంపు కోసం జోరుగా పెట్టుబడులు పెట్టనున్నామని వివరించారు.



You may be interested

పెరిగిన ఆంధ్రా బ్యాంకు నష్టాలు

Tuesday 12th February 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ప్రభుత్వ రంగంలోని ఆంధ్రా బ్యాంకు నష్టాలు డిసెంబరు త్రైమాసికంలో మరింత పెరిగాయి. ఈ కాలంలో బ్యాంకు రూ.578 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2017 డిసెంబరు త్రైమాసికంలో ఈ నష్టం రూ.532 కోట్లుగా ఉంది. టర్నోవరు రూ.5,093 కోట్ల నుంచి రూ.5,322 కోట్లకు ఎగసింది. ఏప్రిల్‌- డిసెంబరు కాలంలో మొత్తం రూ.15,663 కోట్ల టర్నోవరుపై రూ.1,552 కోట్ల నష్టం వచ్చినట్లు బ్యాంకు వెల్లడించింది. మొండి బకాయిల

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఖాతాలు మళ్లీ మదింపు

Tuesday 12th February 2019

ప్రక్రియ చేపట్టనున్న ఐసీఏఐ విభాగం ఎన్‌సీఎల్‌టీ ఆదేశాల మేరకు నిర్ణయం ఆడిటర్ల అభ్యంతరాలు ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇన్‌ఫ్రా రుణాల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఖాతాలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) మరోసారి మదింపు చేయనుంది. ఈ కేసులో ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఐసీఏఐ అకౌంటింగ్ రీసెర్చ్ ఫౌండేషన్ విభాగం దీన్ని చేపట్టనున్నట్లు ఐసీఏఐ తెలిపింది. 2012-13 నుంచి 2017-18 మధ్య కాలానికి సంబంధించి కంపెనీల చట్టంలోని సెక్షన్ 130

Most from this category