News


మెటల్‌ షేర్ల ర్యాలీ

Tuesday 12th February 2019
Markets_main1549960593.png-24158

మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతోంది. మెటల్‌ షేర్ల ర్యాలీ మార్కెట్‌ పతనానికి అడ్డుగా నిలుస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 3శాతం ర్యాలీ చేసింది. మెటల్‌ షేర్లలో అత్యధికంగా జిందాల్‌ స్టీల్‌ 9శాతం ర్యాలీ చేసింది. సెయిల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందూస్థాన్‌ కాపర్‌, టాటాస్టీల్‌ షేర్లు 5శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి. అలాగే వేదాంత, జేఎస్‌ఎల్‌హిస్సార్‌, వెల్‌స్పాన్‌కార్పోరేషన్‌, ఎన్‌ఎండీసీ షేర్లు 2శాతం పెరిగాయి. కోల్‌ ఇండియా, హిందాల్కో, హిందూస్థాన్‌ జింక్‌ షేర్లు 1శాతం లాభపడ్డాయి. మధ్యాహ్నం గం.1:20ని.లకు 2.50శాతం లాభపడి 2,785.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు నాల్కో 2శాతం నష్టపోగా, ఏపిల్‌అపోలో, మెయిల్‌ షేర్లు అరశాతం వరకు నష్టపోయాయి. ఇదే సమయానికి జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌, టాటాస్టీల్‌, వేదాంత స్టీల్‌ షేర్లు నిఫ్టీ-50 సూచీలోని టాప్‌ - 5 గెయినర్లలో మొదటి మూడు స్థానాల్లో ట్రేడ్‌ అవుతుండం విశేషం.
ఇక ప్రధాన సూచీల విషయానికొస్తే... నిఫ్టీ ఇండెక్స్‌ 9 పాయింట్ల స్వల్ప నష్టంతో 10890 వద్ద, సెన్సెక్స్‌ సూచీ 50 పాయింట్ల నష్టంతో 36336 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం డౌన్‌..!

Tuesday 12th February 2019

మిడ్‌సెషన్‌ నుంచి మొదలైన అ‍మ్మకాలతో మార్కెట్‌ భారీగా నష్టపోయింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ షేర్లలో విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండెక్స్‌లో అధిక పరిమాణం కలిగిన ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అరశాతం క్షీణతతో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం మేర పతనమైంది. మధ్యాహ్నం గం.2:50ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(27,227.80)తో పోలిస్తే 0.75శాతం నష్టంతో 27,036.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

జనవరిలో టాప్‌ ఎంఎఫ్‌ల అమ్మకాలు, కొనుగోళ్లు..

Tuesday 12th February 2019

గత నెల దేశీయ ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి రెండేళ్లలో కనిష్ఠ నిధుల ప్రవాహం కనిపించింది. గతనెలతో పోలిస్తే 7 శాతం తక్కువగా రూ. 6160 కోట్లు ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి వచ్చాయి. మార్కెట్లో ప్రస్తుత డైలమా మరికొంత కాలం కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో టాప్‌ 3 మ్యూచువల్‌ ఫండ్స్‌ జనవరిలో ఏం కొన్నాయి? ఏం విక్రయించాయి? చూద్దాం.. 1.  హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌:  వివిధ స్టాకుల్లో 1.2 లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు

Most from this category