News


ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు 41శాతం డౌన్‌

Monday 20th January 2020
personal-finance_main1579459778.png-31025

2019లో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్టర్లు నికరంగా చేసిన పెట్టుబడులు రూ.75,000 కోట్లు. కానీ, అంతకుముందు 2018లో చేసిన పెట్టుబడులతో పోలిస్తే 41 శాతం తగ్గడం గమనార్హం. ఆర్థిక వృద్ధి గణనీయంగా తగ్గడం, మార్కెట్లలో తీవ్ర అస్థిరతలు పెట్టుబడులపై ప్రభావం చూపించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ ఏడాది ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు తిరిగి ఇన్వెస్టర్లను ఆకర్షిస్తాయని, మంచి పనితీరు చూపిస్తాయని నిపుణులు అంచనాతో ఉన్నారు. 

 

‘‘మార్కెట్లలో ఉన్న అస్థిరతలు మరికొంత కాలం పాటు కొనసాగొచ్చు. ఇన్వెస్టర్లు ఈ ఆటుపోట్ల నుంచి లబ్ధి పొందాలనుకుంటారు. ఈ అవకాశాన్ని తమ సంపద వృద్ధికి అవకాశంగా మలుచుకుంటారని అంచనా వేస్తున్నాం. మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమలోకి పెట్టుబడుల రాక పెరుగుతుంది. ఈక్విటీ ఫండ్స్‌ సహా అన్ని రకాల మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడులు పెరుగుతాయి’’ అని ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈవో, ఎండీ అశ్వని భాటియా తెలిపారు. యాంఫి డేటాను చూస్తే ఈక్విటీ, ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) 2019లో రూ.74,870 కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్టు తెలుస్తోంది. కానీ, 2018లో వీటిల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.1.2 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2017లో రూ.1.33 లక్షల కోట్లు, 2016లో రూ.51,000 కోట్లుగా ఉండడం గమనార్హం. 

 

అంతక్రితం కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఈక్విటీ పథకాల్లోకి 2019లో వచ్చిన పెట్టుబడులు తగ్గాయని, దీనికి మార్కెట్లలోని అస్థిరతలే కారణమని ఎల్‌అండ్‌టీ మ్యూచువల్‌ ఫండ్‌ చీఫ్‌ కైలాష్‌ కులకర్ణి తెలిపారు. ఈక్విటీ పథకాల్లోకి పెట్టుబడులు రెండు రకాలుగా ఉంఆయి. ఒకటి సిప్‌ రూపంలో, రెండోది నాన్‌సిప్‌ మార్గంలో అంటే ఏకమొత్తంలో వస్తుంటాయి. అయితే, సిప్‌ రూపంలో వచ్చే పెట్టుబడుల్లో స్థిరమైన వృద్ధి నమోదవుతోంది. నెలవారీగా సిప్‌ పెట్టుబడులు రూ.8,000 కోట్లపైనే ఉంటున్నాయి. మొత్తం మీద సిప్‌ రూపంలో గతేడాది మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు రూ.82,453 కోట్లుగా ఉన్నాయి. మార్కెట్ల రిస్క్‌ను అధిగమించేందుకు సిప్‌ ఒక మంచి సాధనం అని తెలిసిందే. పరిశ్రమలో నమోదిత సిప్‌లు 9.55 లక్షలుగా ఉన్నాయి. ఈ ఏడాది కూడా సిప్‌ హవా నడుస్తుందన్నారు మార్నింగ్‌ స్టార్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ కౌస్తభ్‌ బేల్‌పుర్కార్‌. ఆర్థిక వ్యవస్థ రికవరీకి ఎక్కువ అవకాశాలు ఉన్నందున ఏకమొత్తంలో చేసే పెట్టుబడులు కూడా పెరుగుతాయన్న అంచనా వ్యక్తం చేశారు.You may be interested

ఏ కొద్ది కరెక్షన్‌ వచ్చినా.. తదుపరి ర్యాలీయే..

Monday 20th January 2020

నిఫ్టీ గత ఐదు సెషన్లుగా స్థిరీకరణలో ఉందని, 12,278-12,389 స్థాయిల మధ్యలో ట్రేడ్‌ అయిందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చందన్‌ తపారియా పేర్కొన్నారు. నూతన లైఫ్‌టైమ్‌ గరిష్ట స్థాయి 12,389ని నమోదు చేసిందని, ఏ కొద్ది కరెక్షన్‌ వచ్చినా కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చని, ఇప్పటికీ ఇండెక్స్‌ భారీ ట్రెండ్‌ సానుకూలంగానే ఉందన్నారు.    ‘‘వీక్లీ స్కేల్‌పై చిన్న బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. రోజువారీ చార్ట్‌లో మాత్రం నిర్ణయలేమిని

మిడ్‌క్యాప్‌ ర్యాలీకి కారణాలున్నాయ్‌..

Monday 20th January 2020

ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో పొజిషన్లు తీసుకుంటున్నారని.. స్మాల్‌ క్యాప్‌ విషయంలో ఇప్పటికీ అప్రమత్తంగానే ఉన్నట్టు సెంట్రమ్‌ బ్రోకింగ్‌కు చెందిన నిశ్చల్‌ మహేశ్వరి పేర్కొన్నారు. గ్రామీణ రంగంలో మందగమనం ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ రంగంపై ప్రభావం చూపించినట్టు తెలిపారు. గత వేసవిలో, తర్వాత శీతాకాలంలో పంటల సాగు మంచిగానే ఉన్నందున రికవరీపై అంచనాలతో ఉన్నట్టు చెప్పారు. పంటల ఉత్పాదక బాగుంటే, గ్రామీణుల చేతుల్లో ఆదాయం పెరుగుతుందని,

Most from this category