News


ఆకలిగా ఉందా? లాగించెయ్‌!

Saturday 15th December 2018
startups_main1544849876.png-22959

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మెట్రో నగరాల్లో పిజ్జాలు, బర్గర్లు కామన్‌! మరి, ఇవి ఎంత వరకు హైజెనిక్‌? పోనీ, ఆర్గానిక్‌ ఫుడ్‌తో లాగించేద్దామంటే ముంబైవాసి హితేష్‌ అహుజాకి నాలుకకి రుచించలేదు. అంతే! చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి.. ప్యాకేజ్డ్‌ పిజ్జా అండ్‌ మామోస్‌ స్టార్టప్‌ ‘యమ్‌లేన్‌’ను ప్రారంభించేశాడు. ప్యాకేజీల్లో వచ్చే పిజ్జా, మోమోస్‌ను అప్పటికప్పుడు ఓవెన్‌ లేదా పెనంపై వేడి చేసుకుని తినగలగటమే యమ్‌లేన్‌ ప్రత్యేకత. ఫ్లిప్‌కార్ట్‌ కో–ఫౌండర్‌ బిన్నీ బన్సల్‌ నుంచి రూ.7 కోట్ల నిధులనూ సమీకరించాడు. హైదరాబాద్‌లో యమ్‌లేన్‌ తయారీ ప్లాంట్‌ ఏర్పాటుపై ఆసక్తిగా ఉన్నామని.. స్థానికంగా తయారీ పార్టనర్‌ కోసం అన్వేషిస్తున్నామని హితేష్‌ ‘స్టార్టప్‌ డైరీ’తో చెప్పారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే...

ఎంబీఏ పూర్తయ్యాక.. అమెరికాకు చెందిన న్యూ సిల్క్‌ రూట్‌ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీలో చేరా. ఆరేళ్ల ఉద్యోగ జీవితంలో నాతో పాటు సహోద్యోగులకు స్నాక్స్‌ కోసం స్ట్రీట్‌ ఫుడ్‌ తప్పేదికాదు. ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసినా ఏం చేయలేని పరిస్థితి. అలాగని ఆర్గానిక్‌ ఫుడ్‌ తినాలంటే నాలుకకి రుచించదు. అందుబాటు ధరలో.. నాణ్యమైన ఫుడ్‌ అది కూడా జంక్‌ అయితే బాగుండుననిపించింది. 2016 మార్చిలో ముంబై కేంద్రంగా దేశంలోనే తొలి ప్యాకేజ్డ్‌ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ క్విక్‌పిక్‌ టెక్నాలజీస్‌ను ప్రారంభించాం. ఈ కంపెనీ ఫుడ్‌ బ్రాండే యమ్‌లేన్‌. ప్యాకెట్స్‌ రూపంలో మామోస్‌ను, పిజ్జాలను అందిస్తాం. వాటిని వేడిచేసుకుని తినొచ్చు.
7 రకాల పిజ్జాలు; రూ.80 లోపు..
ప్రస్తుతం హైదరాబాద్, ముంబై, పుణె, బెంగళూరు, గుజరాత్‌ నగరాల్లో సేవలందిస్తున్నాం. డబుల్‌ చీజ్‌ మార్గరీటా, మెక్సికన్‌ టాంగో, పన్నీర్‌ టిక్కా, వెజ్జీ మోజారిల్లా, తందూరీ పన్నీర్‌ మామ్స్, స్పించ్‌ కార్న్‌ చీజ్‌ మామ్స్, వెజిటెబుల్‌ చిల్లీ మామ్స్‌ వంటి 7 రకాల మామోస్‌ అండ్‌ పిజ్జాలున్నాయి. వీటి ధరలు రూ.50–80 వరకుంటాయి. బిగ్‌ బజార్, బిగ్‌ బాస్కెట్, డీమార్ట్, స్టార్‌, హైపర్‌ సిటీ, స్పార్‌ వంటి వెయ్యి స్టోర్లతో ఒప్పందం చేసుకున్నాం. హైదరాబాద్‌లో 200 స్టోర్ల వరకూ ఉన్నాయి.ఏడాదిలో వీటి సంఖ్యను రెండు వేలకు చేర్చుతాం.
నెలకు రూ.50 లక్షల ఆదాయం..
ప్రస్తుతం నెలకు 2 కోట్ల ప్యాకెట్స్‌ను విక్రయిస్తున్నాం. రూ.50 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం. 2020 నాటికి రూ.100 కోట్ల టర్నోవర్‌ను టార్గెట్‌గా పెట్టుకున్నాం. ఆన్‌లైన్‌ విక్రయాల కోసం స్విగ్గీ, జొమాటోతో ఒప్పందం చేసుకున్నాం. యమ్‌లేన్‌.ఇన్‌ నుంచి ఆర్డర్‌ ఇస్తే డెలివరీ చేసేందుకు క్లౌడ్‌స్టార్‌ లాజిస్టిక్‌ కంపెనీతో ఒప్పందం ఉంది. మరో రెండు కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయి. ఏడాదిలో ఢిల్లీ, చెన్నై, రాజస్థాన్‌లకు విస్తరిస్తాం.
రూ.50 కోట్లతో హైదరాబాద్‌లో ప్లాంట్‌..
మా మొత్తం అమ్మకాలు, ఆదాయంలో హైదరాబాద్‌ వాటా 15 శాతం వరకూ ఉంటుంది. యమ్‌లేన్‌ ఫుడ్‌ మొత్తం ముంబైలో తయారవుతుంది. ఈ ప్లాంట్‌ సామర్థ్యం రోజుకు 35 వేల పిజ్జాలు. రెండేళ్లలో రూ.50 కోట్ల పెట్టుబడితో దక్షిణాది నగరాల్లో సొంత తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యించాం. స్థానిక తయారీ సంస్థతో ఒప్పందం చేసుకొని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాం.
రూ.40 కోట్ల సమీకరణ పూర్తి..
ప్రస్తుతం మా కంపెనీలో 40 మంది ఉద్యోగులున్నారు. త్వరలో మరో 30 మందిని నియమించుకోనున్నాం. ఇటీవలే ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో బిన్నీ బన్సల్‌ నుంచి రూ.7 కోట్ల నిధులు సమీకరించాం. పీపుల్‌ గ్రూప్‌ ఫౌండర్‌ అనుపమ్‌ మిట్టల్, మేక్‌ మై ట్రిప్‌ కో–ఫౌండర్‌ సచిన్‌ భాటియా, సింగపూర్‌కు చెందిన ఆర్‌బీ వెంచర్స్, ఒరిస్‌ వెంచర్‌ పార్టనర్స్‌ నుంచి రూ.12 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. వచ్చే ఆరు నెలల్లో రూ.40 కోట్ల నిధులను సమీకరించనున్నాం’’ అని అహూజా వివరించారు.
 
 You may be interested

పెరిగిన ఎగుమతులు

Saturday 15th December 2018

న్యూఢిల్లీ: దేశీ ఎగుమతులు నవంబర్‌లో 26.5 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదేకాలంతో పోల్చితే 0.80 శాతం వృద్ధి చెందాయి. ఇందుకు బేస్‌ఎఫెక్ట్‌ ప్రధాన కారణంగా నిలిచింది. మరోవైపు దిగుమతులు 4.31 శాతం పెరిగి 43.17  బిలియన్‌ డాలర్లుగా నమోదైనట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ సమాచారం ద్వారా వెల్లడైంది. 2016 డిసెంబర్‌ తరువాత దిగుమతులు ఈస్థాయిలో తగ్గడం ఇదే ప్రథమం కాగా.. బంగారం దిగుమతులు భారీగా తగ్గడం ఇందుకు కారణంగా

జెట్‌ ఎయిర్‌వేస్‌ ఖాతాలపై ఎస్‌బీఐ ఫోరెన్సిక్‌ ఆడిట్‌

Saturday 15th December 2018

ముంబై: తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ ఖాతాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ఎస్‌బీఐ ఆదేశించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ బ్యాంకుల నుంచి రూ.8,000 కోట్లకు పైగా రుణాలను తీసుకోగా, ఎస్‌బీఐ లీడ్‌ బ్యాంకర్‌గా ఉంది. చమురు ధరల పెరుగుదలతో జెట్‌ ఎయిర్‌వేస్‌ గత మూడు త్రైమాసికాలుగా రూ.1,000 కోట్లకు పైగా నష్టాలను నమోదు చేస్తోంది. తీవ్ర స్థాయిలో నిధుల కటకటను ఎదుర్కొంటున్న ఈ సంస్థ తాజా నిధుల సమీకరణ యత్నాలను

Most from this category