News


బెన్‌గ్రాహమ్‌ ఫిల్టర్స్‌ను సరితూగే నాలుగు స్టాక్స్‌?

Friday 8th February 2019
personal-finance_main1549649474.png-24096

వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌ పితామహుడే బెన్‌ గ్రాహమ్‌. వారెన్‌ బఫెట్‌కు మార్గదర్శకుడు. ఓ కంపెనీ తన ఆస్తుల విలువ కంటే తక్కువకు ట్రేడ్‌ అవుతుంటే ఆ కంపెనీ షేరులో ఇన్వెస్ట్‌ చేయడం బెన్‌ గ్రాహమ్‌ అనుసరించే విధానం. మనదేశ స్టాక్స్‌ గత ఏడాది కాలంలో గణనీయంగా దిద్దుబాటుకు గురయ్యాయి. మరి వాటిల్లో బెన్‌ గ్రాహమ్‌ చూసే కొలమానాలకు సరితూగేవి ఏమున్నాయో? గమనిస్తే... 

 

ఓ కంపెనీ అంతర్గత విలువ (ఇంట్రిన్సిక్‌ వ్యాల్యూ) ఆ కంపెనీ అసలు విలువ ఏ మేరకు అన్నది తెలియజేస్తుంది. ఈ స్థాయి, అంతకంటే తక్కువకు ఇన్వెస్ట్‌ చేయడం వల్ల పెట్టుబడికి ఎక్కువ భద్రత ఉంటుంది. బెన్‌ గ్రాహమ్‌ పాటించిన కొలమానాలు... మార్కెట్‌ క్యాప్‌ రూ.400 కోట్లకు పైన ఉన్నవి. రుణ భారం అసల్లేనివి, కరెంట్‌ రేషియో 2 శాతం పైన ఉన్నవి. రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ 15 శాతానికి పైన ఉన్నవి. 15 ఏళ్ల కాలంలో రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ మధ్యస్థంగా ఉన్నవి, ఐదేళ్ల కాలంలో ఈపీఎస్‌ వృద్ధి 10 శాతానికి పైన, ఎర్నింగ్స్‌ ఈల్డ్‌ 10.5 శాతానికి పైన, గత మూడేళ్లలో ఆపరేటింగ్‌ మార్జిన్‌ స్థిరంగా ఉన్నవి లేదా పెరిగినవి. వీటికి సరితూగేవి మూడు స్టాక్స్‌ను వ్యాల్యూ రీసెర్చ్‌ గుర్తించింది. 

 

కేఎస్‌ఈ
పశువుల దాణా తయారీలో అతిపెద్ద కంపెనీ. కేరళలో ఎక్కువ కార్యకలాపాలను కలిగి ఉంది. పశువుల దాణా తయారీ నుంచి 78 శాతం ఆదాయం వస్తోంది. కొబ్బరి నుంచి నూనెను వెలికితీసే ఆయిల్‌ కేక్‌ డివిజన్‌ నుంచి 20 శాతం ఆదాయం వస్తోంది. డెయిరీ విభాగం సమీకరించే పాల ద్వారా 2 శాతం ఆదాయం సమకూరుతోంది. కర్ణాటకలోనూ దాణా ప్లాంట్‌ను ప్రారంభించింది. గడిచిన ఐదేళ్ల కాలంలో ఇన్వెస్టర్లకు 54 శాతం చొప్పున రాబడులు ఇచ్చింది. గత ఐదేళ్ల కాలంలో ఆదాయం 10 శాతం, నికర లాభం 423 శాతం చొప్పున పెరిగాయి. గత ఏడాది కాలంలో ఈ కంపెనీ షేరు ధర 30 శాతానికి పైగా క్షీణించింది. 

 

అంబికా కాటన్‌ మిల్స్‌
1988లో కొయంబత్తూరులో ప్రారంభమైన కంపెనీ. ఖరీదైన నాణ్యతతో కూడిన యార్న్‌ను తయారు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా టాప్‌ కంపెనీలు అంబికా కాటన్‌ మిల్స్‌ యార్న్‌ను షర్ట్‌ల్లో వినియోగిస్తున్నాయి. పవన విద్యుత్‌ కేంద్రాల రూపంలో 5 శాతం ఆదాయం వస్తోంది. నాలుగు ప్లాంట్‌ల్లో కలిపి 1,08,288 స్పిండిల్‌ సామర్థ్యం ఉంది. అధిక రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ 2014లో 20 శాతంగా ఉంటే, 2017-18 నాటికి 15.2 శాతానికి తగ్గింది. ఆపరేటింగ్‌ మార్జిన్లపైనా ఒత్తిడి ఉంది. గత ఐదేళ్లలో షేరువారీ ఆర్జన 11 శాతం పెరిగింది. ఇదే కాలంలో ఏటా 32 శాతం రాబడులు ఇవ్వగా, గతేడాది 22 శాతం క్షీణించింది.

 

తిరుమలై కెమికల్స్‌
పీహెచ్‌ తాలిక్‌ అన్హిడ్రైడ్‌ (పీఏఎన్‌)ను తయారు చేసే రెండో అతిపెద్ద కంపెనీ. దీన్ని ప్లాస్టిక్‌ పైపులు, పెయింట్ల తయారీలో ప్రధానంగా ఉపయోగిస్తారు. అలిక్‌ అన్హిడ్రైడ్‌, డైఎథిల్‌ పీహెచ్‌ తాలేట్‌, జంతువుల దాణాలో వినియోగించే ఫుడ్‌ యాసిడ్లు, కాస్మెటిక్స్‌, ఆహారం, పానీయాల్లో వినియోగిస్తారు. గత ఐదేళ్లలో ఈ కంపెనీ కార్యకలాపాలు పునురుద్ధరణకు నోచుకున్నాయి. ఈపీఎస్‌ ప్రతికూల స్థాయి నుంచి ఏటా 47 శాతం చొప్పున వృద్ధి చెందుతూ వచ్చింది. ఆపరేటింగ్‌ మార్జిన్‌ 2014 డిసెంబర్‌లో 2.8 శాతంగా ఉంటే, 2018 సెప్టెంబర్‌ నాటికి 22.5 శాతానికి చేరుకుంది. టర్న్‌ అరౌండ్‌కు మంచి ఉదాహరణ. అధిక ముడి పదార్థాల ధరల కారణంగా డిసెంబర్‌ త్రైమాసికంలో లాభం, ఆపరేటింగ్‌ మార్జిన్‌ గణనీయంగా తగ్గాయి. అయినప్పటికీ గత ఐదేళ్లలో కాంపాండెడ్‌ ప్రాతిపదికన ఏటా 58 శాతం చొప్పున రాబడులను ఇచ్చిన స్టాక్‌.

 

మైథాన్‌ అలాయ్స్‌
మాంగనీస్‌ అలాయ్‌ తయారీలో పెద్ద కంపెనీ. తయారీ వ్యయం తక్కువ ఉండడం ఈ కంపెనీకి బలం. ఫెర్రో మాంగనీస్‌, సిలికో మాంగనీస్‌, ఫెర్రో సిలికాన్‌లను తయారు చేసి ఎగుమతి చేస్తుంటుంది. ఈ కంపెనీ ఉత్పత్తులను ప్రధానంగా స్టీల్‌ తయారీలోనే వినియోగిస్తుంటారు. అయితే, టన్ను స్టీల్‌లో కేవలం 10-15 కిలోల మేరే ఫెర్రో అలాయ్స్‌ వినియోగిస్తుంటారు. దేశ, విదేశీ మార్కెట్ల వాటా సగం, సగంగా ఉంది. దేశీయంగా సెయిల్‌, జెఎస్‌డబ్ల్యూ, జేఎస్‌పీఎల్‌, జేఎస్‌ఎల్‌ క్లయింట్లుగా ఉన్నాయి. గత ఏడేళ్లలో దేశీయంగా ఎక్కువ కంపెనీలు ఈ కంపెనీ వినియోగదారులుగానే ఉన్నాయి. స్టీల్‌ రంగంపై ఆధారపడిన కంపెనీ కావడంతో ఎప్పటికప్పుడు మారే ధరల ప్రభావం పడుతుంది. 
 You may be interested

పీఎంఎస్‌లకూ నష్టాల సెగ

Friday 8th February 2019

ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు, ఏఎంసీలు నిర్వహించే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసులు (పీఎంఎస్‌) సైతం జనవరి నెలలో నష్టాలను ఎదుర్కొన్నాయి. పెద్ద ఇన్వె‍స్టర్లకు ఈ సంస్థలు ఈక్విటీ పెట్టుబడి సేవలను అందిస్తుంటాయి. ఇన్వెస్టర్ల తరఫున నిపుణుల ఆధ్వర్యంలో పెట్టుబడి వ్యవహారాలు చూసే పీఎంఎస్‌లు సైతం గత నెలలో మార్కెట్ల అస్థిరతల ప్రభావానికి లోనైనట్టు గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తోంది. పేరున్న పీఎంఎస్‌ సంస్థల నిర్వహణలోని పెట్టుబడుల విలువ 10 శాతం క్షీణించడం అస్థిరతల్లో

సెన్సెక్స్‌ 424 పాయింట్లు క్రాష్‌

Friday 8th February 2019

మార్కెట్‌ను మెప్పించని ఆర్‌బీఐ వడ్డీరేట్ల కోత 425 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్‌ మెటల్‌, అటో షేర్లలో అమ్మకాలు యూరప్‌ వృద్ధి మందగిస్తుందంటూ యూరోపియన్‌ యూనియన్‌ చేసిన హెచ్చరిక ప్రపంచ మార్కెట్లలో చిన్న కల్లోలాన్ని సృష్టించింది. ప్రపంచ మార్కెట్లు క్షీణించిన నేపథ్యంలో భారత్‌ సూచీలు సైతం శుక్రవారం పడిపోయాయి. రెండు రోజుల క్రితం సాధించుకున్న 11,000 పాయింట్ల స్థాయిని నిఫ్టీ తిరిగి వదులుకుంది.  అటో, మెటల్‌, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్ల అమ్మకాలతో చివరి అరగంటలో

Most from this category