News


బడ్జెట్‌ పరిభాషకు 'అర్థ్‌శాస్త్రి'

Monday 20th January 2020
news_main1579488892.png-31032

  • సోషల్ మీడియాలో ప్రచారానికి కేంద్రం కసరత్తు

న్యూఢిల్లీ: బడ్జెట్‌ పరిభాషపై సామాన్యులు, విద్యార్థులకు అవగాహన కల్పించే దిశగా కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. జనవరి 22 నుంచి సోషల్ మీడియాలో ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనుంది. '#అర్థ్‌శాస్త్రి' (#ArthShastri) పేరిట నిర్వహించే ఈ ప్రచార కార్యక్రమంలో.. పలు సంక్లిష్టమైన ఆర్థిక అంశాలను ఆసక్తికరమైన యానిమేటెడ్ వీడియోల రూపంలో వివరించనుంది. బడ్జెట్ ప్రక్రియ గురించి సరళమైన విధానంలో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని అధికారవర్గాలు తెలిపాయి. గతేడాది కూడా కేంద్రం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఫిబ్రవరి 1న కొత్త ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మరోవైపు, బడ్జెట్‌ హామీల్లో నెరవేర్చిన వాటి గురించి తెలియజేసేందుకు ఆర్థిక శాఖ '#హమారాభరోసా' ట్యాగ్‌తో మరో ప్రచార కార్యక్రమం కూడా ప్రారంభించింది. జనవరి 29 దాకా ఈ రెండూ కొనసాగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 



You may be interested

నేటి నుంచే దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్‌ సదస్సు

Monday 20th January 2020

పాల్గొననున్న 100కు పైగా భారత సీఈవోలు దావోస్‌: నటి దీపిక పదుకునే, సద్గురు జగ్గీ వాస్‌దేవ్‌, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌, దిగ్గజ పారిశ్రామికవేత్తలు గౌతం అదానీ, కుమారమంగళం బిర్లా, రాహుల్‌ బజాజ్‌, సంజీవ్‌ బజాజ్‌, ఎన్‌ చంద్రశేఖరన్‌, ఆనంద్‌ మహీంద్రా, సునీల్‌ మిట్టల్‌, నందన్‌ నీలేకని, అజయ్‌ పిరమల్‌ సహా 100కు పైగా భారత సీఈవోలు సోమవారం నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) 50వ

కార్పొరేట్ ట్యాక్స్‌ను హేతుబద్ధీకరించాలి

Monday 20th January 2020

రేట్లన్నింటినీ 15 శాతం శ్లాబ్‌గా మార్చాలి కేంద్రానికి పరిశ్రమల సమాఖ్య వినతి న్యూఢిల్లీ: వివిధ కార్పొరేట్ ట్యాక్స్ రేట్లన్నింటినీ ఎటువంటి మినహాయింపులు లేకుండా 15 శాతం స్థాయికి హేతుబద్ధీకరించాలని కేంద్రాన్ని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కోరింది. 2023 ఏప్రిల్ నాటికల్లా దీన్ని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసింది. పెట్టుబడుల నిర్ణయాలు తీసుకునేందుకు అనువుగా రాబోయే బడ్జెట్‌లోనే ఇందుకు సంబంధించిన ప్రకటన చేయాలని సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ పేర్కొన్నారు. కార్పొరేట్ ట్యాక్స్‌ రేటును

Most from this category