News


రూ.899లకే విమాన టికెట్‌

Tuesday 12th February 2019
news_main1549950455.png-24146

విస్తారా, ఇండిగో బంపర్‌ ఆఫర్లు న్యూఢిల్లీ: పలు ప్రధాన రూట్లలో భారీ డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తున్నట్లు విస్తారా ఎయిర్ లైన్స్‌, బడ్జెట్‌ ఎయిర్‌లైన్‌ ఇండిగో ప్రకటించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి సెప్టెంబర్‌ 28 వరకు చేసే జర్నీలపై సోమవారం నుంచి బుధవారం వరకు ఆఫర్‌ ఇస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై ఈ ఆఫర్లు వర్తిస్తాయని స్పష్టంచేసింది. దేశీ విమానాల్లో రూ.899కే విమాన టికెట్‌ను అందిస్తుండగా.. అంతర్జాతీయ రూట్లలో టికెట్‌ ప్రారంభ ధర రూ.3,399 నుంచి ఉన్నట్లు తెలియజేసింది. ఇక ఫిబ్రవరి 27 నుంచి సెప్టెంబర్‌ 18 వరకు జరిగే ప్రయాణాలకు సంబంధించిన బుకింగ్స్‌ను మంగళవారం ప్రారంభిస్తున్నట్లు విస్తారా ప్రకటించింది. కేవలం రెండు రోజులు మాత్రమే కొనసాగే ఈ ఆఫర్‌ రేపటితో ముగియనుంది. ఢిల్లీ-అహ్మదాబాద్, ఢిల్లీ-కోల్‌కతా, ఢిల్లీ-చెన్నై, ముంబై-గోవా రూట్లలో ఇరు సంస్థలు ఆఫర్లను ఇస్తున్నాయి.



You may be interested

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఖాతాలు మళ్లీ మదింపు

Tuesday 12th February 2019

ప్రక్రియ చేపట్టనున్న ఐసీఏఐ విభాగం ఎన్‌సీఎల్‌టీ ఆదేశాల మేరకు నిర్ణయం ఆడిటర్ల అభ్యంతరాలు ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇన్‌ఫ్రా రుణాల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఖాతాలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) మరోసారి మదింపు చేయనుంది. ఈ కేసులో ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఐసీఏఐ అకౌంటింగ్ రీసెర్చ్ ఫౌండేషన్ విభాగం దీన్ని చేపట్టనున్నట్లు ఐసీఏఐ తెలిపింది. 2012-13 నుంచి 2017-18 మధ్య కాలానికి సంబంధించి కంపెనీల చట్టంలోని సెక్షన్ 130

నెంబర్‌ 2 @ 2030

Tuesday 12th February 2019

అత్యంత వేగంగా భారత్‌ వృద్ధి ప్రధాని నరేంద్రమోదీ విశ్వాసం 2019 పెట్రోటెక్‌ సదస్సు ప్రారంభం గ్రేటర్‌ నోయిడా: భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. 2030 నాటికి దేశం ప్రపంచంలోనే రెండవ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘‘అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) సంస్థ, ప్రపంచబ్యాంక్‌ వంటి దిగ్గజాలు భారత్‌ వృద్ధి వేగం కొనసాగుతుందని పేర్కొంటున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులనూ దేశం తట్టుకుని తగిన వృద్ధి రేటును

Most from this category