News


దీర్ఘకాలిక రాబడులు భేష్‌

Monday 15th April 2019
personal-finance_main1555306571.png-25129

దీర్ఘకాలిక రాబడులు భేష్‌
రిలయన్స్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌

ఏడాది కాలంలో మిడ్‌, స్మాల్‌క్యాప్‌ కంపెనీల షేర్లు చాలా వరకు నష్టపోయాయి. దీంతో దీర్ఘకాల పెట్టుబడి అవకాశాల దృష్ట్యా కొన్ని ఆకర్షణీయంగా మారాయి. మిడ్‌, స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు ఈ సమయంలో ఆయా విభాగాలకు చెందిన మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలను నమ్ముకోవడం ద్వారా తగిన ప్రతిఫలాన్ని అందుకోవచ్చు. ఆ విధంగా చూసినప్పుడు రిలయన్స్‌ స్మాల్‌క్యాప్‌ పథకం కూడా ఒక ఎంపిక అవుతుంది. మార్కెట్‌ ర్యాలీల్లో మంచి పనితీరును చూపించడమే కాకుండా, మార్కెట్‌ కరెక్షన్లలో నష్టాలను పరిమితం చేయడాన్ని ఈ పథకం పనితీరులో గమనించొచ్చు. ఇందుకు నిదర్శనం గత ఏడాది కాలంలో ఇదే విభాగంలోని ఇతర పథకాలు, బెంచ్‌ మార్క్‌ సూచీతో పోలిస్తే రిలయన్స్‌ స్మాల్‌క్యాప్‌ పథకం నష్టాలను పరిమితం చేసింది. ఏడాది కాలంలో రాబడులు మైనస్‌ 7.5 శాతంగా ఉంటే, బెంచ్‌ మార్క్‌ బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ టీఆర్‌ఐ 11.5 శాతం మేర నష్టాలను ఇవ్వడం గమనార్హం. అంటే బెంచ్‌ మార్క్‌తో పోలిస్తే నష్టాలు 4 శాతం తక్కువే. ఇక మూడేళ్ల కాలంలో రిలయన్స్‌ స్మాల్‌క్యాప్‌ పథకం వార్షికంగా 18.8 శాతం రాబడులను ఇచ్చింది. ఐదేళ్లలో వార్షిక ప్రతిఫలం 24.7 శాతంగా ఉంది. డీఎస్‌పీ స్మాల్‌క్యాప్‌, ఫ్రాంక్లిన్‌ ఇండియా స్మాలర్‌ కంపెనీస్‌, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ స్మాల్‌క్యాప్‌ పథకాల కంటే ఈ పథకమే మెరుగ్గా ఉంది. ఈ పథకం 2010లో ప్రారంభం కాగా, అప్పటి నుంచి చూసుకుంటే వార్షిక రాబడులు 17.71 శాతంగా ఉండడం గమనార్హం. ఇన్వెస్టర్లు కనీసం ఐదేళ్లు, అంతకు మించి కాలానికి ఇన్వెస్ట్‌ చేయాలనుకునేవారు సిప్‌ మార్గంలో ఈ పథకంలో పెట్టుబడులు పెట్టుకోవడాన్ని పరిశీలించొచ్చు. 
పెట్టుబడుల విధానం
పోర్ట్‌ఫోలియో విషయంలో తగినంత వైవిధ్యాన్ని ఈ పథకం పాటిస్తుంటుంది. అస్థిరతల సమయంలో నగదు నిల్వలను పెంచుకోవడాన్ని గమనించొచ్చు. విడిగా ఒక్కో కంపెనీలో మరీ ఎక్కువగా పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్తను పాటిస్తుంటుంది. అందుకే ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో స్టాక్స్‌ సంఖ్య భారీగా కనిపిస్తుంది. ప్రస్తుతం 114 కంపెనీల్లో పెట్టుబడులు కలిగి ఉంది. అన్ని రకాల మార్కెట్‌ సైకిల్స్‌లోనూ కనీసం 100 స్టాక్స్‌ అయినా పోర్ట్‌ఫోలియోలో నిర్వహిస్తుంటుంది. అలాగే, ఒక్కో రంగంపైనా భారీగా ఆధారపడకపోవడాన్ని గమనించొచ్చు. ఇంజనీరింగ్‌లో 14.2 శాతం, కెమికల్స్‌లో 13.66, ఫైనాన్షియల్స్‌లో 12 శాతం, ఎఫ్‌ఎంసీజీలో 10.5 శాతం, కన్‌స్ట్రక్షన్‌ రంగాల్లో 9 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం 0.65 శాతం వరకు నగదు నిల్వలు కలిగి ఉండగా, డెట్‌లో 8 శాతానికి పైగా పెట్టుబడులు కలిగి ఉంది. లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో 10.4 శాతం, మిడ్‌క్యాప్‌లో 21.60 శాతం, స్మాల్‌క్యాప్‌ విభాగంలో 68 శాతం వరకు పెట్టుబడులు పెట్టి ఉంది. 


టాప్‌ హోల్డింగ్స్‌
కంపెనీ    పెట్టుబడుల శాతం
దీపక్‌ నైట్రేట్‌    2.42
వీఐపీ ఇండస్ట్రీస్‌    2.22
జైడస్‌ వెల్‌నెస్‌    1.97
ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌    1.95
నవీన్‌ ఫ్లోరిన్‌ ఇంటర్నేషనల్‌    1.94
వింధ్యా టెలిలింక్స్‌    1.76
సైయంట్‌    1.71
కార్బొరండం యూనివర్సల్‌    1.59
ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌    1.56
బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌    1.55

 



You may be interested

30 కోట్లు దాటిన జియో చందాదారులు

Monday 15th April 2019

న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో చందాదారుల సంఖ్య 30 కోట్లను అధిగమించింది. కార్యకలాపాలు ఆరంభించిన రెండున్నరేళ్లలో ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం. మార్చి 2న ఇది సాధ్యమైనట్టు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్‌ సీజన్లో 30 కోట్ల యూజర్ల మార్క్‌పై కంపెనీ టెలివిజన్‌ ప్రకటనలు కూడా ఇస్తోంది. 10 కోట్ల మంది చందాదారులను వాణిజ్య కార్యకలాపాలు ఆరంభించిన తర్వాత కేవలం 170 రోజుల్లోనే సొంతం చేసుకుని జియో గతంలోనే రికార్డు

ఒక దెబ్బకు.. రెండు పిట్టలు!!

Monday 15th April 2019

ఒక దెబ్బకు.. రెండు పిట్టలు!! - ఈఎల్‌ఎస్‌ఎస్‌తో రెండిందాల మేలు ..‍ - ఇటు అధిక రాబడులు - అటు పన్నుపరమైన ప్రయోజనాలు     రిటైర్మెంట్‌ తర్వాత చాలా మంది ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటోందని నివేదికలు చెబుతున్నాయి. పొదుపు చేసిన డబ్బు తక్కువగా ఉండటం వల్ల.. యాభైలు, అరవైలలో ఉన్న వారు భారీగా వ్యయాలు తగ్గించుకోవడం... అప్పటిదాకా అలవాటుపడిన జీవన విధానాలను మార్చుకోవడం చేసుకోక తప్పడం లేదు. చేతిలో డబ్బు ఉన్నప్పుడు.. అనుభవించేంత తీరిక

Most from this category