Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

FAKE NEWS on Anant Ambani target netizens with crypto scam
అనంత్ అంబానీపై క్రిప్టో ముఠా ఫేక్ న్యూస్

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ తనయుడు, రిలయన్స్‌ సంస్థల్లో డైరెక్టర్‌గా ఉన్న అనంత్‌ అంబానీపై క్రిప్టోముఠా సోషల్‌ మీడియాలో ఫేక్‌ వార్తలు ప్రచారం చేస్తోంది. క్రిప్టో కరెన్సీతో అధిక లాభాలు వస్తాయని అనంత్‌ అంబానీ అంగీకరించినట్లు అమాయకులను మోసగిస్తూ ఆయన పేరును వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది.వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనంత్ అంబానీ క్రిప్టో కరెన్సీ ఏజెన్సీలను ప్రోత్సహిస్తూ వ్యాఖ్యలు చేసినట్లుగా, ఆయనపై బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసు వేసినట్లుగా బీబీసీ పేరుతో క్లిక్‌బైట్‌ హెడ్డింగ్‌లతో క్రిప్టో ముఠా రూపొందించిన తప్పుడు కథనాలు ఇటీవల సోషల్‌ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.'హ్యూమన్స్ ఆఫ్ బాంబే'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబానీ తన సహాయకుడు "1X ఆల్రెక్స్ ప్లాట్‌ఫారమ్"ని ఉపయోగించి డబ్బు సంపాదించాడని చెప్పినట్లుగా ఓ కథనం పేర్కొంది. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తితో కూడా అంబానీ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేయించారని, అతను వెంటనే లాభం పొందాడని పేర్కొంది. ఇవన్నీ తప్పుడు కథనాలే అని ఆయా వార్తా సంస్థలు ధ్రువీకరించాయి. నెటిజన్లను తప్పుదోవ పట్టించి క్రిప్టో కరెన్సీ ద్వారా మోసగించేందుకే క్రిప్టో ముఠాలు ఇలా చేసినట్లు తెలుస్తోంది.

Hospitality Industry To Create 200000 Jobs In Next 12-18 Months
ఈ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు

కోవిడ్ మహమ్మారి కారణంగా హాస్పిటాలిటీ పరిశ్రమ తీవ్ర ఎదురుదెబ్బను ఎదుర్కొంది. ఫలితంగా భారీగా తొలగింపులు జరిగాయి. అయితే ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలువడం, ప్రయాణాలు తిరిగి పుంజుకోవడంతో హోటల్స్‌ వ్యాపారంలో డిమాండ్‌ మళ్లీ పెరిగింది. దీంతో విస్తరణ ప్రణాళికలకు, గణనీయమైన నియామకాలకు దారితీసింది.రానున్న 18 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలుహోటళ్ల వ్యాపారం, హాలిడే ప్రయాణాలలో వృద్ధిని పొందేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆతిథ్య సంస్థలు తమ కార్యకలాపాలను దూకుడుగా విస్తరిస్తున్నాయి. టీమ్స్‌లీజ్‌ సర్వీసెస్‌ అంచనాల ప్రకారం.. హోటల్, రెస్టారెంట్, పర్యాటక రంగం రాబోయే 12-18 నెలల్లో సుమారు 2 లక్షల ఉద్యోగాలను సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ ఉద్యోగ అవకాశాలలో దాదాపు సగం హోటల్ పరిశ్రమలోనే ఉంటాయని ఎకమిక్‌ టైమ్స్‌ నివేదించింది.దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుదలను సూచిస్తున్న అంచనాలతో, హోటల్ పరిశ్రమ గణనీయమైన వృద్ధికి సిద్ధంగా ఉంది. ఫార్చ్యూన్ హోటల్స్ ప్రతిష్టాత్మకమైన విస్తరణ ప్రణాళికల ద్వారా నియామకంలో 8-10 శాతం పెరుగుదలను అంచనా వేస్తోంది. ఇక లెమన్ ట్రీ తమ ఆర్థిక సంవత్సర లక్ష్యాలకు మద్దతుగా వేలాది మందిని నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.డిమాండ్ వీరికే..ఫ్రంట్ డెస్క్ ఏజెంట్లు, గెస్ట్‌ రిలేషన్స్‌ మేనేజర్లు, హౌస్ కీపింగ్ సిబ్బంది డిమాండ్‌లో అగ్రస్థానంలో ఉన్నారు. అలాగే మెయింటెనెన్స్ టెక్నీషియన్లు, చెఫ్‌లు వంటి నిపుణులకు కూడా అధిక డిమాండ్‌ ఉంది. ఆతిథ్య రంగంలోని అన్ని విభాగాల్లోనూ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్‌లో గణనీయమైన పెరుగుదల ఉన్నట్లు మ్యాన్‌పవర్ ఏజెన్సీలు నివేదించాయి. సేల్స్, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, టెక్నికల్ ఉద్యోగాలు, మానవ వనరులు ప్రత్యేకించి పరిశ్రమలో విస్తృత ఆధారిత పునరుద్ధరణను సూచిస్తున్నాయి.ఇక్రా ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో హోటల్ పరిశ్రమ 7-9 శాతం స్థిరమైన ఆదాయ వృద్ధిని సాధిస్తుందని అంచనా. ఇది ఈ రంగం స్థితిస్థాపకత, పునరుద్ధరణ పథాన్ని నొక్కి చెబుతోంది. సాంప్రదాయ హోటల్ ఆపరేటర్లు మాత్రమే కాకుండా, ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌లు కూడా హైరింగ్‌లో స్పీడ్‌ పెంచనున్నాయి.

Aircraft sustained damage to its nose and a tyre near the landing gear
ట్రక్‌ట్యాక్సీను ఢీకొట్టిన 180 మంది ప్రయాణిస్తున్న విమానం!

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎయిర్‌క్రాఫ్ట్‌ టగ్‌ట్రక్‌ ట్యాక్సీను ఢీకొన్న సంఘటన బుధవారం పుణె ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులున్నట్లు ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు చెప్పాయి.గ్రౌండ్‌ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం..పుణె నుంచి దిల్లీకి బయలుదేరిన విమానం టగ్‌ట్రక్‌ ట్యాక్సీను ఢీకొట్టింది. విమానం ముందు భాగంతోపాటు ట్రక్‌ దిబ్బతింది. ఫ్లైట్‌ కిందిభాగం ట్రక్‌కు తగలడంతో ల్యాండింగ్‌ గేర్‌ వద్ద టైర్‌ పాడయ్యింది. ఘటన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. అయితే వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు చెప్పాయి. భూమిపై విమానాన్ని నడిపేందుకు టగ్ ట్రక్ టాక్సీని ఉపయోగిస్తారు.ఇదీ చదవండి: ఆకాశవీధిలో 41.8 కోట్లమంది.. ఇక్రా నివేదికఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ ప్రారంభించినట్లు సమాచారం. పూర్తి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికులను ప్రమాదం జరిగిన విమానంలో నుంచి దింపేసి వారి గమ్యస్థానాలు చేరేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు చెప్పాయి.

gold price today rate may 17
రెండు రోజులుగా బెంబేలెత్తించిన బంగారం.. నేడు కాస్త..

బంగారం ధరల మోతకు బ్రేక్‌ పడింది. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (మే 17) కాస్త దిగొచ్చాయి. రెండు రోజులుగా ఆకాశాన్నంటిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. తులం బంగారం రూ.280 మేర తగ్గి ఈరోజు పసిడి కొనుగోలు చేసేవారికి కాస్త ఉపశమనం కలిగించింది.తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.250 తగ్గి రూ.67,600 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.270 తగ్గి రూ. 73,750 లకు దిగొచ్చింది.ఇతర నగరాల్లో.. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.67,750 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.270 దిగొచ్చి రూ.73,900 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.67,600లకు, 24 క్యారెట్ల బంగారం రూ.270 తగ్గి రూ.73,750 లకు క్షీణించింది.ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.67,950 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.280 తగ్గి రూ.73,850 లకు దిగొచ్చింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.250 క్షీణించి రూ.67,600 వద్దకు తగ్గగా 24 క్యారెట్ల బంగారం రూ.270 తగ్గి రూ.73,750 లకు దిగొచ్చింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు (మే 17) స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.92,500లుగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Air passenger traffic in the country is projected to touch 418 million in the current financial year
ఆకాశవీధిలో 41.8 కోట్లమంది.. ఇక్రా నివేదిక

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణీకుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అదే సమయంలో విమాన సంస్థల ఆదాయాలు 15-17 శాతం పెరుగుతాయని చెప్పింది. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) అధీనంలోని విమానాశ్రయాలతో పాటు దిల్లీ, హైదరాబాద్‌, కోచి అంతర్జాతీయ విమానాశ్రయాలను నమూనాగా తీసుకుని ఇక్రా ఈ నివేదిక విడుదల చేసింది.ఇక్రా నివేదిక ప్రకారం..కరోనా కంటే ముందు నమోదైన విమాన ప్రయాణాలతో పోలిస్తే 10 శాతం అధికంగా ఫ్లైట్‌జర్నీ చేస్తున్నారు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 37.6 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. విమానాల రద్దీ ఏటా 8-11 శాతం పెరుగుతోంది. 2023 క్యాలెండర్‌ ఏడాదిలో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీలో భారత్‌ వాటా 4.2 శాతంగా ఉంది. 2019లోని 3.8 శాతంతో పోలిస్తే అధికం. 2023లో గ్లోబల​్‌గా ప్రయాణికుల రద్దీ 96 శాతం పుంజుకుంది. అదే భారత్‌లో మాత్రం 106 శాతం రికవరీ అయింది. దేశీయంగా కొత్త మార్గాలు, విమానాశ్రయాల సంఖ్య పెరగడంతో ఇది సాధ్యపడినట్లు ఇక్రా తెలిపింది.ఇదీ చదవండి: పెరగనున్న వస్తు ఎగుమతులు.. ఎంతంటే..ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ వినయ్ కుమార్ మాట్లాడుతూ..‘విరామం కోసం, వృత్తి వ్యాపార అవసరాల రీత్యా ప్రయాణాలు అధికంగా చేస్తున్నారు. కొత్త గమ్యస్థానాలకు విమాన సర్వీసులు ప్రారంభం కావడమూ కలిసొస్తోంది’ అన్నారు.

Government slashes 41 medicine prices
షుగర్‌ పేషంట్లకు శుభవార్త.. మందుల ధరలు తగ్గింపు

మధుమేహం, గుండె, కాలేయ జబ్బులు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 41 సాధారణ మందులు, ఆరు ఔషధ మిశ్రమాల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) నోటిఫికేషన్ జారీ చేసింది.ఎన్‌పీపీఏ జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. యాంటాసిడ్‌లు, మల్టీవిటమిన్‌లు, యాంటీబయాటిక్‌ ఔషధాలు చౌకగా లభించే మందులలో ఉన్నాయి. వివిధ ఔషధాల తగ్గింపు ధరలకు సంబంధించిన సమాచారాన్ని డీలర్లు, స్టాకిస్టులకు తక్షణమే తెలియజేయాలని ఫార్మా కంపెనీలను ఎన్‌పీపీఏ ఆదేశించింది. నిత్యావసర ఔషధాల ధర ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఎన్‌పీపీఏ 143వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రపంచంలోనే అత్యధిక మధుమేహం కేసులు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. మందుల ధర తగ్గింపు వల్ల దేశంలోని 10 కోట్ల మందికి పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనం కలగనుంది. కాగా గత నెలలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ 923 షెడ్యూల్డ్ డ్రగ్ ఫార్ములేషన్‌లకు వార్షిక సవరించిన సీలింగ్ ధరలను, 65 ఫార్ములేషన్‌లకు రిటైల్ ధరలను ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తెచ్చింది.

Stock Market Rally On Today Opening
నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయి 22,361కు చేరింది. సెన్సెక్స్‌ 113 పాయింట్లు దిగజారి 73,553 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 104.5 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 83.32 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.38 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లోకి వెళ్లాయి. ఎస్‌ అండ్‌ పీ 0.2 శాతం నష్టపోయింది. నాస్‌డాక్‌ 0.3 శాతం దిగజారింది.అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతుకు తోడు బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్‌ సూచీలు గురువారం దాదాపు ఒకశాతం ర్యాలీ అయ్యాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే తక్కువగానే నమోదవడంతో ఈ ఏడాదిలో ఫెడ్‌ రిజర్వ్‌ కనీసం రెండు సార్లు వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలు తెరపైకి వచ్చాయి. ఈ పరిణామం ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్లపై కూడా సానుకూల ప్రభావం చూపింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Reliance Jio Tops Spectrum Auction With Rs 3,000 Crore EMD
స్పెక్ట్రమ్ వేలంలో జియో ముందంజ

మొబైల్ ఫోన్ సేవల స్పెక్ట్రమ్ బ్యాండ్‌ల వేలంలో రిలయన్స్ జియో ముందంజలో నిలించింది. టెలికాం డిపార్ట్‌మెంట్ తాజాగా ప్రచురించిన వివరాల ప్రకారం.. రాబోయే స్పెక్ట్రమ్ వేలం కోసం ధరావతు సొమ్ము కింద రిలయన్స్ జియో అత్యధికంగా రూ. 3,000 కోట్లను డిపాజిట్ చేసింది.టెలికమ్యూనికేషన్స్‌ విభాగం విడుదల చేసిన ప్రీ-క్వాలిఫైడ్ బిడ్డర్ వివరాల ప్రకారం.. భారతి ఎయిర్‌టెల్ రూ. 1,050 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 300 కోట్ల విలువైన మనీ డిపాజిట్‌ను సమర్పించాయి. కంపెనీలు డిపాజిట్ చేసిన ఈఎండీ మొత్తం ఆధారంగా పాయింట్లను పొందుతాయి. ఇది వారికి కావలసిన సర్కిల్‌ల సంఖ్య, స్పెక్ట్రమ్ పరిమాణానికి వేలం పాడేందుకు వీలు కల్పిస్తుంది. ఎన్ని ఎక్కువ పాయింట్లు ఉంటే వేలం దక్కించుకునేందకు అంత సామర్థ్యం ఉంటుంది.రిలయన్స్ జియో ఇప్పటి వరకు పాల్గొన్న అన్ని స్పెక్ట్రమ్ వేలంలో చార్ట్‌లో ముందుంది. జియో నెట్‌వర్త్‌ రూ.2.31 లక్షల కోట్లు కాగా, ఎయిర్‌టెల్ నెట్‌వర్త్‌ రూ.86,260.8 కోట్లు. ఇక వొడాఫోన్‌ ఐడియా నెట్‌వర్త్‌ విషయానికి వస్తే రూ. 1.16 కోట్ల వద్ద ప్రతికూల జోన్‌లో ఉంది.జూన్ 6 నుంచి సుమారు రూ.96,317 కోట్ల బేస్ ధరతో మొబైల్ ఫోన్ సేవల కోసం ఎనిమిది స్పెక్ట్రమ్ బ్యాండ్‌లను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్పెక్ట్రమ్ 20 సంవత్సరాల పాటు కేటాయిస్తారు. దక్కించుకున్న బిడ్డర్లు 20 సమాన వార్షిక వాయిదాలలో చెల్లింపులు చేయవచ్చు. వేలం ద్వారా పొందిన స్పెక్ట్రమ్‌ను పదేళ్ల తర్వాత సరండర్‌ చేసే అవకాశం ఉంటుంది.

Merchandise exports from India grow to 500 billion USD in the current financial year
పెరగనున్న వస్తు ఎగుమతులు.. ఎంతంటే..

భారత్‌ వస్తు ఎగుమతులు 2024-25 ఏడాదికిగాను 500 బిలియన్‌ డాలర్లకు(సుమారు రూ.41.5 లక్షల కోట్లు) చేరవచ్చని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఫియో) అంచనా వేసింది. సుమారు 400 బిలియన్‌ డాలర్ల విలువచేసే సేవల ఎగుమతులుతోడైతే మొత్తంగా ఎక్స్‌పోర్ట్స్‌ 900 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని ఫియో ప్రెసిడెంట్ అశ్వనీ కుమార్ తెలిపారు. 2023-24లో దేశం మొత్తం ఎగుమతులు 778 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయన్నారు. అంతకుముందు ఏడాది కంటే 2023-24లో వస్తు ఎగుమతులు 3% తగ్గి 437 బి.డాలర్లు (సుమారు రూ.36.27 లక్షల కోట్లు)గా నమోదైనట్లు అశ్వనీ చెప్పారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘సేవల ఎగుమతుల్లో ఇంజినీరింగ్, అడ్వర్టైజింగ్ రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌ విస్తరణ వల్ల వ్యాపార ఎగుమతులు మరింత పెరుగుతాయి. భారత్‌ నుంచి యూఎస్‌, యూరప్‌కు అధికంగా ఎగుమతులు జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, మెషినరీ, హై అండ్ మీడియం టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, మెడికల్, డయాగ్నొస్టిక్ పరికరాలకు డిమాండ్‌ ఉంది’ అన్నారు.ఇదీ చదవండి: స్టాక్‌మార్కెట్‌లో కొత్త ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సినవి..ఫియో వైస్ ప్రెసిడెంట్ ఇస్రార్ అహ్మద్ మాట్లాడుతూ..‘ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్‌ఐ) పథకం ద్వారా లబ్ధిపొందిన చాలా కంపెనీలు తమ ఉత్పత్తిని పెంచుతున్నాయి. 2023-24లో రెండంకెల క్షీణతను చూసిన దుస్తులు, పాదరక్షలు, డైమండ్లు, ఆభరణాల వంటి లేబర్‌ ఇంటెన్సివ్ రంగాలు ఈసారి మెరుగైన ఫలితాలు నమోదు చేయబోతున్నాయి. ఈసారి ఆశించిన విధంగానే రుతుపవనాలు వస్తాయి. ప్రభుత్వం తృణధాన్యాల ఎగుమతులపై ఉన్న కొన్ని పరిమితులను తొలగించవచ్చు’ అని చెప్పారు.

Come to office or you may get fired, Cognizant issues layoff warning to employees
ఆఫీస్‌కి రాకపోతే ఫైరింగే.. ప్రముఖ ఐటీ కంపెనీ వార్నింగ్‌!

ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్‌ (Cognizant) రిటర్న్-టు-ఆఫీస్ పాలసీకి సంబంధించి తమ ఉద్యోగులకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. పదేపదే రిమైండర్‌లు చేసినప్పటికీ కార్యాలయానికి తిరిగి రావాలనే ఆదేశాన్ని విస్మరించేవారు తొలగింపు సహా తీవ్రమైన క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసిందని ‘లైవ్‌మింట్‌’ కథనం పేర్కొంది."నిర్దేశాలను పాటించడంలో వైఫల్యం కంపెనీ విధానాల ప్రకారం తీవ్రమైన దుష్ప్రవర్తనకు దారితీస్తుందని దయచేసి గమనించండి. తదనుగుణంగా మీపై తగిన క్రమశిక్షణా చర్యలు ప్రారంభించడం జరుగుతుంది. ఇది తొలగింపునకు కూడా దారితీయవచ్చు" అని ఒక ఉద్యోగికి రాసిన లేఖలో కాగ్నెజెంట్‌ హెచ్చరించినట్లుగా నివేదిక పేర్కొంది.ఇన్‌ ఆఫీస్‌ వర్క్‌ ప్రాముఖ్యతను కాగ్నిజెంట్ ఇంతకు ముందే పునరుద్ఘాటించింది. ఆఫీస్ పాలసీని పాటించడంలో వైఫల్యాన్ని కంపెనీ పాలసీల ప్రకారం తీవ్రమైన దుష్ప్రవర్తనగా పరిగణిస్తామని, ఇది టర్మినేషన్‌కు సైతం దారితీసే అవకాశం ఉందని ఏప్రిల్ 15 నాటి లేఖలో కాగ్నిజెంట్‌ స్పష్టం చేసింది.భారత్‌లో కాగ్నిజెంట్ శ్రామిక శక్తి గణనీయంగా ఉంది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. దాని 347,700 మంది ఉద్యోగులలో సుమారు 2,54,000 మంది భారత్‌లోనే ఉన్నారు. కంపెనీ అతిపెద్ద ఉద్యోగుల స్థావరం భారత్‌ అని దీనిని బట్టీ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ రిటర్న్-టు-ఆఫీస్ విధానం భారత్‌లో ప్రాధాన్యత సంతరించుకుంది.ఇన్‌ ఆఫీస్‌ వర్క్‌ తప్పనిసరి ఆదేశాలు అనేక కారణాల నుంచి వచ్చాయి. ఆవిష్కరణలు, జట్టు కృషి, బలమైన సంస్థాగత సంస్కృతిని వ్యక్తిగత సహకారం ప్రోత్సహిస్తుందని కంపెనీలు విశ్వసిస్తున్నాయి. అంతేకాకుండా, ప్రత్యేకించి సెన్సిటివ్ డేటా, కాంప్లెక్స్ ప్రాజెక్ట్‌లను నిర్వహించే పరిశ్రమలలో కార్యాచరణ, భద్రతాపరమైన అంశాలు కూడా కారణంగా ఉన్నాయి.టీసీఎస్‌ (TCS), ఇన్ఫోసిస్‌ (Infosys), విప్రో (Wipro) వంటి కంపెనీలు కూడా గతంలో రిటర్న్-టు-ఆఫీస్ విధానాన్ని తప్పనిసరి చేశాయి. అయితే, కొన్ని కంపెనీలు రిమోట్ పని సౌలభ్యానికి అలవాటుపడిన కొంతమంది ఉద్యోగుల నుంచి ప్రతిఘటనను ఎదుర్కొన్నాయి. చాలా మంది ఉద్యోగులు రిమోట్ వర్క్‌ మెరుగైన పని-జీవిత సమతుల్యతను అందిస్తుందని, ప్రయాణ ఒత్తిడిని తగ్గిస్తుందని వాదించారు. అయితే కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఈ ఉద్యోగుల ప్రాధాన్యతలను వ్యాపార అవసరాలు, కార్యాచరణ సామర్థ్యాలతో సమతుల్యం చేస్తున్నాయి.

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
EUR 90.648214 2024-05-16
USD 90.648214 2024-05-16

Commodities

Name Rate Change Change%
Silver 1 Kg 92500.00 92500.00 0.00
Gold 22K 10gm 67600.00 67600.00 -250.00
Gold 24k 10 gm 73750.00 73750.00 -270.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement
Advertisement