Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

Indian stock market reaches 5 lakh crore dollars landmark ahead of election results
బీఎస్‌ఈ కంపెనీల సరికొత్త రికార్డ్‌ 5 లక్షల కోట్ల డాలర్లు

దేశీ స్టాక్‌ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్‌ఈ తాజాగా 5 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ)ను సాధించింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. ఈ ఏడాది ప్రారంభం నుంచి 633 బిలియన్‌ డాలర్లకుపైగా జమ చేసుకుంది. నిజానికి మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ చరిత్రాత్మక గరిష్టానికి 1.7 శాతం దూరంలో ఉన్నప్పటికీ బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ తొలిసారి 5 ట్రిలియన్‌ డాలర్ల మైలురాయిని అధిగమించడం విశేషం!ముంబై: బీఎస్‌ఈ తొలిసారి 5 లక్షల కోట్ల డాలర్ల విలువను అందుకుంది. ఓవైపు బ్లూచిప్స్‌ పరుగుతీస్తుంటే.. మరోపక్క మధ్య, చిన్నతరహా కంపెనీల ఇండెక్సులు సైతం సరికొత్త గరిష్టాలకు చేరాయి. దీంతో బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రికార్డ్‌ నెలకొల్పింది. వెరసి బీఎస్‌ఈ విలువ తొలిసారి రూ. 415 లక్షల కోట్లకు చేరింది. 2023 నవంబర్‌లో తొలిసారి బీఎస్‌ఈ విలువ 4 ట్రిలియన్‌ డాలర్లను తాకింది.ఆపై ఆరు నెలల్లోనే 5 లక్షల కోట్లకు చేరింది. ఇప్పటివరకూ ప్రపంచంలో 5 ట్రిలియన్‌ డాలర్ల క్లబ్‌లో యూఎస్‌ఏ, చైనా, జపాన్, హాంకాంగ్‌ మాత్రమే ఉన్నాయి. మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ భారీగా సహకరించడం ఈ సందర్భంగా గమనార్హం. ఇటీవల మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నప్పటికీ.. 2024 జనవరి మొదలు సెన్సెక్స్‌ 2.3 శాతం బలపడగా.. మిడ్‌ క్యాప్‌ 16.3 శాతం, స్మాల్‌ క్యాప్‌ 11.5 శాతం ఎగశాయి. జర్నీ తీరిలా 2007 మే నెలలో ట్రిలియన్‌ డాలర్ల విలువను సాధించిన బీఎస్‌ఈ ఆపై దశాబ్దం తదుపరి అంటే 2017 జులైలో 2 ట్రిలియన్‌ డాలర్లను చేరింది. ఈ బాటలో 2021 మే నెలకల్లా 3 లక్షల కోట్ల డాలర్లను తాకింది. 5 లక్షల కోట్ల డాలర్ల జాబితాలో 55.65 ట్రిలియన్‌ డాలర్లతో యూఎస్‌ఏ టాప్‌ ర్యాంకులో ఉంది. 9.4 ట్రిలియన్లతో చైనా, 6.4 ట్రిలియన్లతో జపాన్, 5.47 ట్రిలియన్లతో హాంకాంగ్‌ తదుపరి నిలుస్తున్నాయి.మార్కెట్‌ విలువ మదింపులో మార్పులు లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ)ను మదింపు చేయడంలో సెబీ తాజాగా నిబంధనలను పునర్వ్యవస్థీకరించింది. దీంతో ఇకపై రోజువారీ మార్కెట్‌ విలువ మదింపునకు బదులుగా ఆరు నెలల సగటును ప్రాతిపదికగా తీసుకోనున్నారు. దీని వలన సరైన విలువ మదింపునకు వీలుంటుందని మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు.స్వల్ప నష్టాలతో సరి.. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో స్టాక్‌ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల వేళ అప్రమత్తత, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 53 పాయింట్లు నష్టపోయి 73,953 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 22,529 వద్ద నిలిచింది. మెటల్, ఇంధన షేర్లు రాణించగా, బ్యాంకులు, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోన య్యాయి.ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు.., మిడ్‌ సెషన్‌లో కాసేపు లాభాల్లో ట్రేడయ్యా యి. తదుపరి అమ్మకాలు తలెత్తడంతో స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశ వివరాలు వెల్లడికి ముందు(బుధవారం రాత్రి) అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో (జూన్‌ 4న) ఎన్నికల ఫలితాల వెలువడనున్న నేపథ్యంలో మార్కెట్లో అస్థిరతను సూచించే వీఐఎక్స్‌ సూచీ 7% పెరిగి 23 నెలల గరిష్టస్థాయి 22.3 స్థాయిని తాకింది.

Next 10 years going to be even more exciting for India tech journey: Rajeev Chandrasekhar
ట్రిలియన్‌ డాలర్లకు డిజిటల్‌ ఎకానమీ

న్యూఢిల్లీ: భారత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ ఏటా 2.8 శాతం వృద్ధి చెందుతోంది. 2027–28 నాటికి ఇది ఒక ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ అధికారిక నివాసంలో సోమవారం సాయంత్రం జరిగిన విశేష సంపర్క్‌ అభియాన్‌లో ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమంలో దాదాపు 300 ఐటీ, స్టార్టప్‌లు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. ‘2026–27 నాటికి భారత డిజిటల్‌ ఎకానమీ 1 ట్రిలియన్‌ డాలర్ల మార్కును చేరుకుంటుందని ప్రభుత్వం ముందుగా అంచనా వేసింది. అయితే కోవిడ్‌–19 మహమ్మారితో సహా వివిధ కారణాల వల్ల లక్ష్యం ఆ తర్వాతి సంవత్సరానికి మార్చారు’ అని తెలిపారు.

Fssai Finds No Traces Of Eto From Mdh And Everest Masala Spice
ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌లకు క్లీన్‌ చిట్‌

భారత్‌కు చెందిన ప్రముఖ మసాలా బ్రాండ్‌లు ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌ సంస్థలకు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (fssai) క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఆ రెండు సంస్థల అమ్మకాలు జరుపుతున్న మసాలల పొడుల ఉత్పత్తుల్లోక్యాన్సర్‌కు కారకమయ్యే ఎథిలీన్‌ ఆక్సైడ్‌ (eto) రసాయనాలు లేవని నిర్ధారించింది.కొద్ది రోజుల క్రితం భారతీయ బ్రాండ్లయిన ఎవరెస్ట్, ఎండీహెచ్‌ అమ్మకాలు జరుపుతున్న మసాలల పొడుల ఉత్పత్తుల్లో పరిమితికి మించి ఎథిలీన్‌ ఆక్సైడ్‌ అనే పురుగుల మందు ఉన్నట్లు కనుగొన్నామని హాంకాంగ్‌ సెంటర్‌ ఫర్‌ ఫుడ్‌ సేఫ్టీ (సీఎఫ్‌ఎస్‌) ఏప్రిల్‌ 5న ప్రకటించింది. ఈ ఉత్పత్తులను కొనొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సీఎఫ్‌ఎస్‌ ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని, ఈ బ్రాండ్ల ఉత్పత్తులను సింగపూర్‌ ఫుడ్‌ ఏజెన్సీ రీకాల్‌ చేసింది.అందులో ఎవరెస్ట్‌ ఫిష్‌ కర్రీ మసాలా, ఎమ్‌డీహెచ్‌కు చెందిన మద్రాస్‌ కర్రీ పౌడర్, సాంబార్‌ మసాలా మిక్స్‌డ్‌ మసాలా పౌడర్, కర్రీ పౌడర్‌ మిక్స్‌డ్‌ మసాలా పౌడర్‌ ఉన్నాయి.ఎఫ్‌ఎస్‌ఏఐ అప్రమత్తంఆ ఆరోపణల నేపథ్యంలో అప్రమత్తమైన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అన్నీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఫుడ్‌ సేప్టీ కమిషనర్లు, రిజినల్‌ డైరెక్టర్లను అప్రమత్తం చేసింది. వెంటనే ఎవరెస్ట్‌, ఎమ్‌డీహెచ్‌ మసాల పొడుల శాంపిల్స్‌ కలెక్ట్‌ చేసి వాటిపై టెస్టులు చేయాలని ఆదేశించింది. దీంతో ఉన్నతాధికారులు మహరాష్ట్ర, గుజరాత్‌, హర్యానా, రాజస్థాన్‌లలో మసాల దినుసుల శాంపిల్స్‌ను కలెక్ట్‌ చేశారు.ఇథిలీన్ ఆక్సైడ్‌ గురించి అన్వేషణపలు నివేదికల ప్రకారం.. అధికారులు మసాల దినుసుల శాంపిల్స్‌ను పరీక్షించారు. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (NABL) గుర్తింపు పొందిన ప్రయోగశాలలలో ఇథిలీన్ ఆక్సైడ్ కోసం నమూనాలను పరీక్షించారు.28 ల్యాబ్‌ రిపోర్టులు అయితే ఇప్పటివరకు 28 ల్యాబ్ రిపోర్టులు అందాయి. ఫుడ్ రెగ్యులేటర్‌ సైంటిఫిక్ ప్యానెల్ శాంపిల్స్‌ను విశ్లేషించగా వాటిలో ఎలాంటి ప్రమాదకరమైన రసాయనం లేదని తేలింది.ఆ రెండు కంపెనీలకు క్లీన్‌ చిట్‌అంతేకాదు ఇతర బ్రాండ్‌లకు చెందిన మరో 300 మసాలా శాంపిల్స్ పరీక్ష నివేదికలను కూడా విశ్లేషించింది. అయితే భారతీయ ఉత్పత్తులు వినియోగానికి సురక్షితమైనవని చూపిస్తూ క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థం ఆనవాళ్లు లేవని ఎమ్‌డీహెచ్‌, ఎవరెస్ట్‌లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.

Zomato CEO Deepinder Goyal Startup Journey And His Father Words
అప్పుడు 'నీ తండ్రి స్థాయి తెలుసా అన్నారు': దీపిందర్ గోయల్

కేంద్ర మంత్రి 'హర్దీప్ సింగ్ పూరి' నిర్వహించిన విశేష్ సంపర్క్ కార్యక్రమానికి జొమాటో సీఈఓ 'దీపిందర్ గోయల్' హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన తన 20 సంవత్సరాల క్రితం నాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు.దీపిందర్ గోయల్ 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు.. ఫుడ్ డెలివరీ స్టార్టప్‌ను ప్రారంభించాలనే ఆలోచనను నా తండ్రితో చెప్పాను. అప్పుడు నా తండ్రి నాతో.. నీ తండ్రి ఏ స్థాయిలో ఉన్నారనే అర్థంతో.. 'జంతా హై తేరా బాప్ కౌన్ హై? అని అన్నట్లు వెల్లడించారు.చిన్న గ్రామంలో ఉన్న మనం స్టార్టప్‌ వంటివి సాధ్యం కాదని తన తండ్రి భావించినట్లు తెలిపారు. అయితే పంజాబ్‌లోని ఒక చిన్న పట్టణం నుంచి ప్రభుత్వ సహకారంతో జొమాటో వంటి సంస్థను స్థాపించగలిగాను. 2008లో కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాను. ఇది నాకు చాలా ఆనందంగా ఉందని గోయల్ అన్నారు.దీపిందర్ గోయల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. పేదరికం నుంచి వచ్చి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన గోయల్ వీడియోను ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.Deepinder Goyal, ZomatoWhen I started Zomato in 2008, my father used to say “tu janta hai tera baap kaun hai” as my dad thought I could never do a start up given our humble background. This government and their initiatives enabled a small town boy like me to build something… pic.twitter.com/vogdM6v8oT— Hardeep Singh Puri (मोदी का परिवार) (@HardeepSPuri) May 20, 2024

Flipkart Grocery Business in India
భారీగా పెరిగిన ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ బిజినెస్

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన గ్రోసరీ వ్యాపారంలో 1.6 రెట్లు వార్షిక వృద్ధిని నమోదు చేసింది. కస్టమర్ల నిత్యావరస వస్తువులను సరసమైన ధరలతో అందించడం మాత్రమే కాకుండా.. అత్యుత్తమ ఆన్‌లైన్ షాపింగ్ అనుభవాన్ని అందించడంతో కంపెనీ అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది.సంస్థ డెలివరీ చేసే అన్ని ఉత్పత్తుల మీద తయారీ తేదీ మాత్రమే కాకుండా ఎక్స్‌పైరీ తేదీ కూడా పేర్కొంటుంది. ఇది వినియోగదారుల నమ్మకాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.ఫ్లిప్‌కార్ట్ తన గ్రోసరీ వ్యాపారాన్ని బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ వంటి మెట్రోలతో పాటు దేశంలోని టైర్ 2 పట్టణాల్లో కూడా విస్తరిస్తుంది. ఇందులో భాగంగానే ఔరంగాబాద్, బంకురా, బొకారో వంటి నగరాల్లో వినియోగదారులకు చేరువవుతోంది. ఛతర్‌పూర్, గౌహతి, జంషెడ్‌పూర్, కృష్ణానగర్, విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ అధిక ప్రజాదరణ పొందుతోంది.ఫ్లిప్‌కార్ట్ క్విక్ సర్వీస్ కింద.. బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై, న్యూ ఢిల్లీ, అనంతపురం, బెర్హంపూర్, గోరఖ్‌పూర్ వంటి పట్టణాలతో సహా సుమారు 200కు పైగా నగరాల్లో ఈ రోజు బుక్ చేస్తే.. మరుసటి రోజే డెలివరీ అందిస్తోంది.ఎక్కువ మంది ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీలో ఆయిల్, నెయ్యి, గోధుమ పిండి (ఆటా), టీ, కాఫీ, డిటర్జెంట్లు, లిక్విడ్ డిటర్జెంట్లు, డ్రై ఫ్రూట్స్, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిని ఎక్కువగా బుక్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో ఇతర ముఖ్యమైన వస్తువులకు కూడా మంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఫ్లిప్‌కార్ట్.. అహ్మదాబాద్, భువనేశ్వర్, చెన్నై, హుబ్లీ, హైదరాబాద్, కోల్‌కతా వంటి కీలక ప్రదేశాల్లో కేంద్రాలను ప్రారంభించింది. నెట్‌వర్క్‌ పెరగడంతో ఎక్కువ మంది కస్టమర్‌లకు సకాలంలో డెలివరీ చేయడానికి సాధ్యమవుతుంది.

Elon Musk Tweet About Microsoft New Recall Feature
'బ్లాక్ మిర్రర్ ఎపిసోడ్'.. సత్యనాదెళ్ళ వీడియోపై మస్క్ కామెంట్

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్ సరికొత్త కంప్యూటర్లను ఆవిష్కరించింది. ఈ శక్తివంతమైన ఏఐ టూల్ గురించి సత్య నాదెళ్ల వివరిస్తున్న వీడియో బిలియనీర్ ఇలాన్ మస్క్ దృష్టిని ఆకర్శించింది.వీడియోలో సత్య నాదెళ్ల.. రీకాల్ ఫీచర్ అనే కొత్త ఫీచర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇది మీరు చూసే, మీ కంప్యూటర్‌లో ప్రదర్శించే ప్రతి వివరాలను రికార్డ్ చేస్తుంది. డివైస్ నుంచి మీ మొత్తం హిస్టరీని సర్చ్ చేయడానికి, మళ్ళీ తిరిగి పొందటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.ఇది ఫోటోగ్రాఫిక్ మెమరీగా పనిచేస్తుంది. మీ కంప్యూటర్‌లో మీరు చేసే ప్రతిదాన్ని గుర్తుంచుకోవడానికి, అర్థం చేసుకోవడానికి స్క్రీన్‌షాట్‌లను నిరంతరం రికార్డ్ చేస్తుంది. ఇది కేవలం కీవర్డ్ సర్చ్ కాదు, డాక్యుమెంట్ కాదు. గతంలోని క్షణాలను రీక్రియేట్ చేస్తుందని అన్నారు.ఈ వీడియో ఎక్స్ (ట్విటర్)లో భారీగా వైరల్ అయ్యింది. 24.3 మిలియన్లకంటే ఎక్కువ వ్యూవ్స్ పొందిన ఈ వీడియోపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ చేస్తున్నారు. ఇందులో టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ కూడా ఉన్నారు.ఈ వీడియోపైన మస్క్ స్పందిస్తూ.. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'బ్లాక్ మిర్రర్'ని ప్రస్తావిస్తూ, ఇది వ్యక్తుల జీవితాలపై దృష్టి పెడుతుందని అన్నారు. అంతే కాకుండా ఈ ఫీచర్‌ను ఆఫ్ చేస్తున్నాను అని కూడా తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. మస్క్ మాత్రమే కాకుండా కొందరు నెటిజన్లు కూడా కొత్త ఫీచర్‌ను విమర్శించారు.బ్లాక్ మిర్రర్ సిరీస్బ్లాక్ మిర్రర్ అనేది చార్లీ బ్రూకర్ రూపొందించిన బ్రిటిష్ ఆంథాలజీ టెలివిజన్ సిరీస్. సమకాలీన సామాజిక సమస్యలపై వ్యాఖ్యానించడానికి సాంకేతికత మరియు మీడియా థీమ్‌లను ఉపయోగిస్తుంది. ఇది ఒక రకమైన ఊహాజనిత కల్పన. ఇది 2011 నుంచి 2013 వరకు ఆరు సిరీస్‌లలో 27 ఎపిసోడ్‌లుగా ప్రసారమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో 2016, 17, 19, 23లలో నాలుగు సిరీస్‌లుగా ప్రసారం చేశారు. 2025లో ఏడో సిరీస్ విడుదలవుతుంది.This is a Black Mirror episode. Definitely turning this “feature” off. https://t.co/bx1KLqLf67— Elon Musk (@elonmusk) May 20, 2024

TPEM and TMPV Join Hands With Bajaj Finance
బజాజ్ ఫైనాన్స్‌తో చేతులు కలిపిన టాటా మోటార్స్.. ఎందుకో తెలుసా?

డీలర్‌లకు ఫైనాన్సింగ్ ఎంపికలను మెరుగుపరచడానికి, అలాగే సులభతరం చేసే ప్రయత్నంలో భాగంగా టాటా మోటార్స్ అనుబంధ సంస్థలైన టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (TMPV), టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (TPEM).. బజాజ్ ఫిన్‌సర్వ్ లిమిటెడ్‌లో భాగమైన బజాజ్ ఫైనాన్స్‌తో చేతులు కలిపాయి. ఈ భాగస్వామ్యానికి సంబంధించిన MoUపై టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ & డైరెక్టర్ ధీమన్ గుప్తా.. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సిద్ధార్థ భట్ సంతకం చేశారు.ఈ భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ.. మా డీలర్ భాగస్వాములు మా వ్యాపారంలో అంతర్భాగంగా ఉన్నారు. వారి కార్యకలాపాలను సులభతరం చేయడంలో వారికి సహాయపడే పరిష్కారాల కోసం చురుకుగా పని చేయడం మాకు సంతోషంగా ఉంది. ఈ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ కోసం బజాజ్ ఫైనాన్స్‌తో భాగస్వామిగా ఉండటం చాలా సంతోషంగా ఉందని ధీమాన్ గుప్తా అన్నారు.బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అనూప్ సాహా మాట్లాడుతూ.. బజాజ్ ఫైనాన్స్‌లో వ్యక్తులు, వ్యాపారాలు రెండింటినీ శక్తివంతం చేసే ఫైనాన్సింగ్ సొల్యూషన్లు ఉన్నాయని అన్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా.. మేము TMPV & TPEM అధీకృత ప్రయాణీకులకు, ఎలక్ట్రిక్ వాహనాల డీలర్‌లకు ఆర్థిక మూలధనాన్ని అందిస్తాము. ఈ సహకారం డీలర్‌లకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా భారతదేశంలో ఆటోమోటివ్ పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తుందని మేము విశ్వసిస్తున్నామని అన్నారు.

Severe Turbulence on Singapore Airlines Flight From London One Dead
సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో కుదుపులు.. ఒకరు మృతి

సరైన రోడ్డు మార్గాలు లేకపోవడం వల్ల బస్సులు కుదుపులకు గురవుతాయి. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటనలో విమానం తీవ్ర కుదుపులకు గురైంది. వినటానికి వింతగా ఉన్నా ఇది నిజం. దీనిని సింగపూర్ ఎయిర్‌లైన్స్ కూడా ధ్రువీకరించింది.సోమవారం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు బయలుదేరిన SQ321 విమానం మార్గమధ్యంలో తీవ్రమైన అల్లకల్లోలాన్ని ఎదుర్కొందని.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో విమానం బ్యాంకాక్‌లోని సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం మధ్యాహ్నం 3.45 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ల్యాండ్ అయింది.బోయింగ్ 777-300 ER విమానంలో మొత్తం 211 మంది ప్రయాణికులతో పాటు 18 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో 30 మంది గాయపడగా, ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని సింగపూర్ ఎయిర్‌లైన్స్ ధ్రువీకరిస్తూ.. మరణించిన వ్యక్తి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసింది.విమానం ల్యాండ్ అయిన తరువాత అవసరమైన వైద్య సహాయం అందించడానికి థాయ్‌లాండ్‌లోని స్థానిక అధికారులతో కలిసి పని పనిచేస్తున్నట్లు.. ఇంకా అదనపు సహాయాన్ని అందించడానికి బ్యాంకాక్‌కు ఒక బృందాన్ని పంపినట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది.ప్రయాణికులు సీటు బెల్ట్ ధరించనప్పుడు ఇటువంటి గాయాలు సాధారణంగా జరుగుతాయని నిపుణులు తెలిపారు. వాతావరణ రాడార్ నుంచి ముందస్తు సమాచారం అందకపోవడంతో పైలెట్ కూడా ముందుగా ప్రయాణికులను హెచ్చరికను ఇవ్వలేకపోయారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు సీటు బెల్టు ధరించకపోవడం వల్ల.. వారు కాక్‌పిట్‌లోకి పడే అవకాశం ఉంటుంది. అలంటి సమయంలో ఊహకందని ప్రమాదం జరుగుతుంది.Singapore Airlines flight #SQ321, operating from London (Heathrow) to Singapore on 20 May 2024, encountered severe turbulence en-route. The aircraft diverted to Bangkok and landed at 1545hrs local time on 21 May 2024.We can confirm that there are injuries and one fatality on…— Singapore Airlines (@SingaporeAir) May 21, 2024

Mahindra and Mahindra Finance New CRO Mahesh Rajaraman
మహీంద్రా ఫైనాన్స్ సీఆర్ఓగా 'మహేష్ రాజారామన్‌'

న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ మంగళవారం కంపెనీ చీఫ్ రిస్క్ ఆఫీసర్ (CRO)గా 'మహేష్ రాజారామన్‌'ను నియమించినట్లు ప్రకటించింది. మల్లికా మిట్టల్ తన పదవికి రాజీనామాను చేయడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.సీఆర్ఓగా 5 సంవత్సరాల కాలానికి నియమితులైన రాజారామన్, బ్యాంకింగ్ రంగంలో 29 సంవత్సరాల అనుభవాన్ని కలిగి ఉన్నారు. టీమ్‌ను ముందుకు నడిపించడంలో అనుభవం ఉందని.. సంస్థ ఈయన సారథ్యంలో మరింత అభివృద్ధి చెందుతుందని మహీంద్రా ఫైనాన్స్ తెలిపింది.రాజారామన్ యెస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్, ఏఎన్‌జెడ్ గ్రైండ్‌లేస్ బ్యాంక్ వంటి వివిధ బ్యాంకులతో అనుబంధం కలిగి ఉన్నారు. ఈయన 2024 ఆగష్టు 1నుంచి చీఫ్ రిస్క్ ఆఫీసర్ (CRO)గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

India Needs to Create 11 5 Crore Jobs By 2030 Details
2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?

అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఉపాధి అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. 2030 నాటికి దేశంలో 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని కోసం సర్వీస్, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లను పెంచాలని చెబుతున్నారు. ఇది జరిగితే ఇండియా ఎకానమీ కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలంటే.. సంవత్సరానికి 1.65 కోట్ల ఉద్యోగాలను సృష్టించవలసి ఉంటుంది. గత దశాబ్దంలో ప్రతి ఏటా 1.24 కోట్ల ఉద్యోగాలు పెరిగాయని నాటిక్సిస్ ఎస్ఏ సీనియర్ ఎకనమిస్ట్ 'ట్రిన్ న్గుయెన్' సోమవారం ఒక నివేదికలో పేర్కొన్నారు.భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం 7 శాతానికి పైగా వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. అయితే దేశం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఉద్యోగావకాశాలు మందకొడిగానే సాగుతున్నాయి. మూడో సారి మోదీ అధికారంలోకి వస్తే.. నిరుద్యోగం పెద్ద సవాలుగా మారుతుందని పలువురు చెబుతున్నారు.గత దశాబ్దంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 11.2 కోట్ల ఉద్యోగాలను సృష్టించినప్పటికీ, కేవలం 10 శాతం ఉద్యోగాలు మాత్రమే అధికారికంగా ఉన్నాయని న్గుయెన్ రాశారు. ప్రపంచ బ్యాంకు ప్రకారం, దేశం మొత్తం శ్రామిక శక్తి రేటు 58 శాతంగా ఉంది. ఇది ఆసియాలోని ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. చాలా తక్కువ. ఉద్యోగావకాశాలు ఎప్పుడైతే పెరుగుతాయో.. అప్పుడే ఇతర దేశాలతో భారత్ పోటీ పడగలదని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు.

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Commodities

Name Rate Change Change%
Silver 1 Kg 98900.00 98900.00 -100.00
Gold 22K 10gm 68290.00 68290.00 -10.00
Gold 24k 10 gm 74500.00 74500.00 -10.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement
Advertisement