Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

Ola's Bhavish Aggarwal Slams LinkedIn, Tweet Viral
లింక్డ్‌ఇన్‌పై అసంతృప్తి.. భవిష్ అగర్వాల్ ట్వీట్ వైరల్

ఓలా సీఈఓ ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ పోస్ట్ చేస్తూ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో లింక్డ్‌ఇన్‌ను విమర్శించారు. పాశ్చాత్య దేశాల టెక్నలాజిలు భరతదేశంలో వ్యాపిస్తున్నాయి. ఇందులో లోపాలు కూడా కూడా ఉన్నయని వివరించారు. అందుకే భారత్ సొంత టెక్నాలజీని నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు.లింక్డ్‌ఇన్‌ ఏఐ బాట్‌లో 'భవిష్ అగర్వాల్' ఎవరు అని సెర్చ్ చేస్తే.. వచ్చిన ఫలితంలో చాలా వరకు సర్వనామాలకు సంబంధించిన దోషాలు ఉన్నయని భవిష్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.దీనిపైన లింక్డ్‌ఇన్‌ కూడా స్పందించింది. ఇది ప్రొఫెషనల్ కమ్యూనిటీ పాలసీలకు వ్యతిరేఖంగా ఉందని లింక్డ్‌ఇన్ నోటిఫికేషన్ ద్వారా పేర్కొన్నారు. నిజానికి భారత్ సొంత టెక్నాలజీని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇతర దేశాల టెక్నాలజీలను గుడ్డిగా నమ్మితే ఇలాంటి దోషాలే వస్తాయి. దీనిని యూజర్స్ నమ్మే ప్రమాదం ఉంది.Dear @LinkedIn this post of mine was about YOUR AI imposing a political ideology on Indian users that’s unsafe, sinister.Rich of you to call my post unsafe! This is exactly why we need to build own tech and AI in India. Else we’ll just be pawns in others political objectives. pic.twitter.com/ZWqiM90eT1— Bhavish Aggarwal (@bhash) May 9, 2024

State Bank of India PAT jumps 24percent YoY to Rs 20,698 crore
ఎస్‌బీఐ లాభం రికార్డ్‌

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి (క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 18 శాతం ఎగసి రూ. 21,384 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2022–23) క్యూ4లో రూ. 18,094 కోట్లు మాత్రమే ఆర్జించింది. స్టాండెలోన్‌ లాభం సైతం రూ. 16,695 కోట్ల నుంచి రూ. 20,698 కోట్లకు దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం రూ. 1.06 లక్షల కోట్ల నుంచి రూ. 1.28 లక్షల కోట్లకు బలపడింది. నిర్వహణ వ్యయాలు రూ. 29,732 కోట్ల నుంచి రూ. 30,276 కోట్లకు పెరిగాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,315 కోట్ల నుంచి సగానికి తగ్గి రూ. 1,609 కోట్లకు పరిమిత మయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.78 శాతం నుంచి 2.24 శాతానికి తగ్గాయి. పూర్తి ఏడాదికి సైతం.. ఇక పూర్తి ఏడాదికి ఎస్‌బీఐ నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన 21 శాతం జంప్‌చేసింది. రూ. 67,085 కోట్లకు చేరింది. 2022–23లో రూ. 55,648 కోట్లు ఆర్జించింది. వెరసి అటు క్యూ4, ఇటు పూర్తి ఏడాదికి రెండు శతాబ్దాల బ్యాంక్‌ చరిత్రలోనే అత్యధిక లాభాలు ఆర్జించినట్లు ఎస్‌బీఐ చైర్మన్‌ దినేష్‌ కుమార్‌ ఖారా పేర్కొన్నారు. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 3 శాతం బలపడి రూ. 41,655 కోట్లను తాకింది. 3.46 శాతం నికర వడ్డీ మార్జిన్లు సాధించింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 8,049 కోట్ల నుంచి రూ. 7,927 కోట్లకు తగ్గాయి. స్లిప్పేజీలు రూ. 3,185 కోట్ల నుంచి రూ. 3,867 కోట్లకు పెరిగాయి. స్థూల మొండిబకాయిలు 2.78 శాతం నుంచి 2.42 శాతానికి దిగివచ్చాయి. వడ్డీయేతర ఆదాయం 24 శాతం జంప్‌చేసి రూ. 17,369 కోట్లకు చేరింది. గత నాలుగేళ్లలో 27,000 మంది ఉద్యోగులు తగ్గినప్పటికీ రిటైర్‌ అవుతున్న సిబ్బందిలో 75 శాతంమందిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు ఖారా వెల్లడించారు. టెక్నాలజీ, ఏఐలపై భారీగా ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు తెలియజేశారు. 

Unexpected election outcome could disrupt Indian stock market
మార్కెట్‌కు ఎన్నికల కలవరం

ముంబై: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన మూడు దశల పోలింగ్‌లో తక్కువ శాతం ఓటింగ్‌ నమోదు ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. ఎన్నికలకు ముందు ఊహించినట్లు ప్రస్తుత అధికార పార్టీ గెలుపు అంత సులువు కాదనే అనుమానాలతో అమ్మకాలకు పాల్పడ్డారు. ఆటో మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో గురువారం సెన్సెక్స్‌ 1,062 పాయింట్లు నష్టపోయి 72,404 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 345 పాయింట్లు పతనమైన ఏప్రిల్‌ 19 తర్వాత తొలిసారి 22,000 దిగువున 21,957 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌ ఒకటిన్నర శాతం పతనంతో బీఎస్‌ఈలో రూ.7.34 లక్షల కోట్లు ఆవిరియ్యాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.393 లక్షల కోట్లకు దిగివచి్చంది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ పాలసీ నిర్ణయాలు, అమెరికా ఉద్యోగ గణాంకాల వెల్లడి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.ఆద్యంతం అమ్మకాలే ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమై సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపడంతో ట్రేడింగ్‌ గడిచే కొద్ది నష్టాల తీవ్రత మరింత పెరిగింది. చిన్న, మధ్య, పెద్ద షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 1,132 పాయింట్లు క్షీణించి 72,404 వద్ద, నిఫ్టీ 370 పాయింట్లు పతనమై 21,932 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. ట్రేడింగ్‌ ముగిసే వరకు అమ్మకాలు కొనసాగాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ సూచీలు వరుసగా 2.41%, రెండు శాతం క్షీణించాయి.  → సూచీల వారీగా ఆయిల్‌అండ్‌గ్యాస్‌ 3.50%, క్యాపిటల్‌ గూడ్స్, మెటల్, పారిశ్రామికోత్పత్తి ఇండెక్సులు 3%, యుటిలిటీ, కమోడిటీ సూచీలు 2.50%, బ్యాంకులు, ఫైనాన్స్, సరీ్వసెస్‌ సూచీలు 2% పతనమయ్యాయి.  → మార్చి క్వార్టర్‌లో నికర లాభం 15% వృద్ధి చెందడంతో టీవీఎస్‌ మోటార్స్‌ షేరు 3% పెరిగి రూ.2,061 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌ 6% దూసుకెళ్లి రూ.2,121 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. → క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు ఒకశాతం పెరిగి రూ.820 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో మూడున్నర శాతం బలపడి రూ.840 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.   

Maruti Suzuki rolls out 4th-gen Swift starting at Rs 6. 49 lakh
మారుతీ స్విఫ్ట్‌ కొత్త మోడల్‌

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ స్విఫ్ట్‌ కారులో 4వ జనరేషన్‌ మోడల్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 6.49 లక్షల నుంచి రూ. 9.64 లక్షల వరకు (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంటుంది. ఈ కారును అభివృద్ధి చేయడంపై రూ. 1,450 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు సంస్థ ఎండీ హిసాషి తకెయుచి తెలిపారు. హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌ అమ్మకాల్లో ప్రీమియం విభాగం వాటా 60 శాతంగా ఉంటోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏటా 7 లక్షల యూనిట్లుగా ఉన్న ఈ సెగ్మెంట్‌ 2030 నాటికి పది లక్షల యూనిట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.                                                 

TCS CEO earns the least among IT firms ceos
అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..

దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈవో, ఎండీ కృతివాసన్‌ 2024 ఆర్థిక సంవత్సరంలో వార్షిక పరిహారంగా రూ. 25.36 కోట్లు తీసుకున్నారు. అతిపెద్ద ఐటీ కంపెనీల సీఈవోల జీతాల్లో ఇదే అత్యంత తక్కువ కావడం గమనార్హం.ఆసక్తికరంగా, బయటకు వెళ్తున్న చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్‌జీ సుబ్రమణ్యం ఇదే సంవత్సరంలో సీఈవో కృతివాసన్ కంటే ఎక్కువ వేతనం అందుకున్నారు. అయితే, సీఈఓగా కృతివాసన్ జీతం 10 నెలల కాలానికి కాగా, సుబ్రమణ్యం వేతనం పూర్తి సంవత్సరానికి. కృతివాసన్ 2023 జూన్ 1న రాజేష్ గోపీనాథన్ నుండి సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. రాజీనామా చేయడానికి ముందు రెండు నెలల స్వల్ప వ్యవధిలో గోపీనాథన్ రూ. 1.1 కోట్లు అందుకున్నారు. అంతకు ముందు ఏడాది అంటే 2023 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ. 29.16 కోట్లు అందుకున్నారు.కృతివాసన్ వేతన పరిహారంలో ప్రాథమిక జీతం, ఇతర ప్రయోజనాలు,  అలవెన్సులు, కమీషన్ ఉన్నాయి. టీసీఎస్‌ వార్షిక నివేదిక ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.21 కోట్ల కమీషన్ అందుకున్నారు. కంపెనీలో కృతివాసన్‌కి 11,232 స్టాక్‌లు ఉన్నప్పటికీ వేతన పరిహారంలో ఎంప్లాయి స్టాక్‌ పర్చేజ్‌ స్కీమ్‌ (ESPS) ఉండదు.2024 ఆ‍ర్థిక సంవత్సరానికి సంబంధించి ఇతర ఐటీ సంస్థలు తమ వార్షిక నివేదికలను ఇంకా విడుదల చేయలేదు. 2023 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్ పరేఖ్ రూ. 56 కోట్ల వార్షిక రెమ్యునరేషన్ ప్యాకేజీని పొందారు. ఐటీ కంపెనీ సీఈవోల జీతాల్లో ఇదే అత్యధికం. ఈయన తర్వాత విప్రో సీఈఓ శ్రీనివాస్ పల్లియా సుమారు రూ. 50 కోట్ల అత్యధిక వార్షిక ప్యాకేజీ అందుకున్నారు. రూ. 28.4 కోట్లతో హెచ్‌సీఎల్‌ టెక్‌ సీఈవో విజయకుమార్ మూడో స్థానంలో ఉన్నారు.

Uber India Driver Count Crossed 10 Lakh
భారత్‌లో 10 లక్షలు దాటిన ఉబర్ డ్రైవర్ల సంఖ్య

భారతదేశంలో ఉబర్ డ్రైవర్ల సంఖ్య ఏకంగా 1 మిలియన్ (10 లక్షలు) కంటే ఎక్కువ ఉన్నట్లు సంస్థ సీఈఓ దారా ఖోస్రోషాహి ప్రకటించారు. ఈ ఏడాది మార్చి త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. 10 లక్షల డ్రైవర్ల మార్కును దాటిన అమెరిక, బ్రెజిల్ తర్వాత మూడో దేశంగా భారత్ నిలిచిందని ఆయన స్పష్టం చేశారు.ఉబర్ సేవలు దేశంలో కొత్త ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. దీంతో మునుపటి కంటే డ్రైవర్ల సంఖ్య పెరిగిందని ఖోస్రోషాహి అన్నారు. మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ భారీగా పెరిగిందని ఖోస్రోషాహి అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత మార్కెట్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది.బుకింగ్‌లు, లావాదేవీల పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో భారతదేశం ఒకటి. పెద్ద మార్కెట్లు నెమ్మదిగా వృద్ధి చెందుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం ఓఎన్‌డీసీతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు ఉబెర్ ప్రకటించింది. రాబోయే రోజుల్లో కంపెనీ మరింత వృద్ధి చెందుతుందని, డ్రైవర్ల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

India has extended free import of yellow peas by four more months until October 2024
బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు

బఠానీలను ఉచితంగా దిగుమతి చేసుకునే గడువును ప్రభుత్వం అక్టోబర్ 2024 వరకు పొడిగించింది. ఈమేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.గతేడాది డిసెంబరులో ప్రభుత్వం బఠానీల దిగుమతిపై ఎలాంటి సుంకం విధించకూడదని నిర్ణయించింది. దాంతో కొన్ని నిబంధనలు తయారుచేసి మార్చి 2024 వరకు అవి అమలులో ఉంటాయని పేర్కొంది. తర్వాత వాటిని జూన్ వరకు పొడిగించారు. తాజాగా ఈ నిబంధనలు అక్టోబర్‌ వరకు అమలవుతాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.డీజీఎఫ్‌టీ నోటిఫికేషన్‌ ప్రకారం.. బఠానీల ఇంపోర్ట్స్‌కు సంబంధించి కనీస దిగుమతి ధర (ఎంఐపీ) షరతులు వర్తించవు. ఆన్‌లైన్ మానిటరింగ్ సిస్టమ్‌కు లోబడి ఎంతైనా దిగుమతి చేసుకోవచ్చు. ఎలాంటి సుంకం ఉండదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 235.92 మిలియన్‌ డాలర్ల విలువైన బఠానీలను దిగుమతి చేసుకున్నట్లు తెలిసింది.

gold price today rate may 9 Akshaya Tritiya
రేపే పసిడి కొనుగోలు జాతర.. దిగొచ్చిన బంగారం!

పసిడి ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న అక్షయ తృతీయ వచ్చేస్తోంది. శుక్రవారం దేశవ్యాప్తంగా బంగారం కొనుగోలు జాతర జరగనుంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఈరోజు (మే 8) కూడా కాస్త దిగొచ్చాయి.క్రితం రోజున కాస్తంత తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించిన బంగారం ధరలు ఈరోజు కూడా స్వల్పంగా తగ్గాయి. దీంతో అక్షయ తృతీయ పర్వదినం వేళ బంగారం కొనాలనుకుంటున్నవారికి కాస్త ఉపశమనం కలిగించాయి. అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి లేదా ఇతర ఏదేనా విలువైన వస్తువులు కొంటే అక్షయం అవుతుందని భారతీయుల నమ్మకం.రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి  రూ.66,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.110 తగ్గి రూ. 72,160 లకు దిగొచ్చింది.ఇతర ప్రధాన నగరాల్లో..➤ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,300 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.110 దిగొచ్చి రూ.72,310 లకు చేరింది. ➤ ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,150 వద్ద, 24 క్యారెట్ల స్వర్ణం రూ.110 క్షీణించి రూ.72,160 వద్దకు తగ్గింది.➤ బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,150 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.110 తగ్గి రూ.72,160 లకు దిగొచ్చింది.➤ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.66,150 ల​కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.170 తగ్గి రూ.72,160 లకు దిగొచ్చింది.వెండి రివర్స్‌!దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ఈరోజు రూ.200 పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి రూ.85,200లుగా ఉంది.

Customs data showed that China exports of rare earths are down about 0.2% from a year earlier
అరుదైన ఖనిజాల ఎగుమతులు తగ్గిస్తున్న డ్రాగన్‌ దేశం

చైనా అరుదైన ఖనిజాల ఎగుమతులు తగ్గిస్తుంది. గతేడాది ఏప్రిల్‌ నెలతో పోలిస్తే ఈసారి 0.2 శాతం ఎగుమతులు తగ్గినట్లు కస్టమ్స్ డేటా ద్వారా తెలిసింది. ప్రపంచంలోనే ముడి ఖనిజాల ఉత్పత్తిలో చైనా మొదటిస్థానంలో ఉంది. దాదాపు 17 అరుదైన ఖనిజాలను ఆ దేశం రవాణా చేస్తుంది. ఈమేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ డేటా వెల్లడించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.2024 ఏప్రిల్‌లో చైనా ఎగుమతులు: 4,566 టన్నులు.2023 ఏప్రిల్‌లో ఎగుమతులు: 4,574 టన్నులు2024 మార్చిలో ఎగుమతులు: 4,709.6 టన్నులు 2024 మొదటి నాలుగు నెలల్లో మొత్తం ఎగుమతులు: 18,049.5 టన్నులుఏడాదివారీగా పెరుగుదల: 10 శాతం2024 ఏప్రిల్‌లో చైనా దిగుమతి చేసుకున్న ఖనిజాలు: మార్చితో పోలిస్తే 32.5% తగ్గి 13,145.9 టన్నులకు చేరుకున్నాయి.2024 మొదటి నాలుగు నెలల కాలంలో దిగుమతులు మొత్తం 18.1% తగ్గి 48,842.5 టన్నులుగా నమోదయ్యాయి.యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. చైనా ప్రపంచవ్యాప్తంగా 70 శాతం అరుదైన ఖనిజాలను కలిగి ఉంది. 90 శాతం మైనింగ్‌ రిఫైన్డ్ అవుట్‌పుట్‌ సామర్థ్యం చైనా సొంతం. చైనా ఎగుమతిచేసే అరుదైన ఖనిజాలతో లేజర్‌లు, సైనిక పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు , విండ్ టర్బైన్‌లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు తయారుచేస్తున్నారు.ఇదీ చదవండి: సిక్‌ లీవ్‌ తీసుకున్న ఉద్యోగుల తొలగింపుచైనా ఇలాగే అరుదైన ఖనిజాల ఎగుమతులు తగ్గిస్తుంటే సమీప భవిష్యత్తులో వీటితో తయారయ్యే వస్తువుల ధర పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ ‍వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశీయంగా ఖనిజాల అన్వేషణ జరిపి వాటిని వెలికితీసే ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.  

interest free loans to bank employees are taxable says SC
బ్యాంకు ఉద్యోగులకు షాక్‌.. వాటిపై పన్ను కట్టాల్సిందే..!

బ్యాంకులు తమ ఉద్యోగులకు ఇచ్చే వడ్డీ రహిత లేదా రాయితీ రుణాలు "అంచు ప్రయోజనాలు" (ఫ్రింజ్‌ బెనిఫెట్స్‌) అని, వాటిపై పన్ను వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.బ్యాంకు సిబ్బంది అనుభవిస్తున్న రుణ ప్రయోజనం వారికి ప్రత్యేకమైనదని, అది జీతంతోపాటు అదనపు ప్రయోజనమని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించినట్లుగా ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఈ ప్రయోజనంపై పన్ను వర్తిస్తుందని మే 7న ధర్మాసనం పేర్కొంది.ఆదాయపు పన్ను నియమాన్ని కోర్టు సమర్థించడంతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటును బెంచ్‌మార్క్‌గా నిర్ణయించడం కూడా ఏకపక్ష లేదా అసమాన అధికార వినియోగం కాదని అభిప్రాయపడింది. ఫ్రింజ్ బెనిఫిట్ గణన కోసం ఒకే స్పష్టమైన బెంచ్‌మార్క్‌ను నిర్ణయించడం ద్వారా కస్టమర్ల నుండి వివిధ బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీ రేట్లను నిర్ధారించే చిక్కుముడి ఉండదని బెంచ్ పేర్కొంది.బ్యాంకులు తమ ఉద్యోగులకు అందించే వడ్డీ రహిత లేదా రాయితీతో కూడిన రుణ ప్రయోజనాలపై ఎస్‌బీఐ ప్రైమ్ లెండింగ్ రేటు ప్రకారం వసూలు చేసే వడ్డీ కంటే బ్యాంకు వసూలు చేసే వడ్డీ తక్కువగా ఉన్నట్లయితే వీటిని ఫ్రింజ్‌ బెనిఫిట్స్‌గా భావించి పన్ను విధించే ఆస్కారం ఉందని ఆదాయపు పన్ను నియమాలు చెబుతున్నాయి.

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
SVC 90.380364 2024-04-09
MWK 90.380364 2024-04-09
SVC 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19

Commodities

Name Rate Change Change
Silver 1 Kg 88700.00 200.00
Gold 22K 10gm 66150.00 -100.00
Gold 24k 10 gm 72160.00 -100.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement