Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

Stock Market Rally On today Closing
పుంజుకున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. గడిచిన సెషన్‌లో భారీగా నష్టపోయిన సూచీల్లో ఈరోజు రిలీఫ్‌ ర్యాలీ కనిపించింది. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 90 పాయింట్లు లాభపడి 22,047 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 245 పాయింట్లు పుంజుకుని 72,652 వద్ద ముగిసింది.సెన్సెక్స్‌ 30 సూచీలో ఎన్‌టీపీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్‌, భారతీఎయిర్‌టెల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐటీసీ, టాటా మోటార్స్‌, టైటాన్‌, హెచ్‌యూఎల్‌, మారుతీ సుజుకీ, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, నెస్లే, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి.టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎల్‌ అండ్‌ టీ, టెక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Heavy rain led to water leakage at KIA Terminal 2 in Bengaluru, 17 flights effected
బెంగళూరులో భారీ వర్షం.. 17 విమానాలు దారి మళ్లింపు

బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం కురిసిన వర్షం కారణంగా 17 విమానాలను దారి మళ్లించారు. ప్రయాణికులు తదుపరి సర్వీసులకు సంబంధించిన వివరాలను విమానయాన సంస్థల ద్వారా తెలుసుకోవాలని ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు తెలిపాయి.బెంగళూరులో గురువారం కురిసిన భారీ వర్షానికి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2(టీ2) వద్ద భారీగా నీరు చేరింది. టీ2 లగేజీ తీసుకునే ప్రాంతం సమీపంలో పైకప్పు నుంచి నీరు లీకవ్వడం గుర్తించారు. క్షణాల్లో వర్షం పెరగడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ వెంటనే స్పందించి చర్యలు చేపట్టింది.భారీ వర్షాల కారణంగా బెంగళూరుకు రావాల్సిన విమానాలను చెన్నైకి మళ్లించారు. మొత్తం 13 దేశీయ విమానాలు, మూడు అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాలు, ఒక అంతర్జాతీయ కార్గో విమానాన్ని దారి మళ్లించారు. బలమైన గాలుల కారణంగా రాత్రి 9:35 నుంచి 10:30 గంటల వరకు విమానాల ల్యాండింగ్‌ వీలుకాలేదని ఎయిర్‌పోర్ట్‌ ప్రతినిధి ఒకరు మీడియాతో తెలిపారు. ప్రయాణికులు తదుపరి సర్వీసులకు సంబంధించి విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు.ఇదీ చదవండి: గోల్డ్‌ఫైనాన్స్‌ తీసుకుంటే రూ.20వేలే ఇస్తారట! మిగతా డబ్బు..?కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టీ2 టెర్మినల్‌ నిర్మాణాన్ని రూ.5,000 కోట్లతో 2022లో పూర్తి చేశారు. అందులో జనవరి 15, 2023 నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. టెర్మినల్‌ ప్రారంభించిన తక్కువ సమయంలోనే ఇలా లీకేజీలు ఏర్పడడంపట్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Paytm UPI Payments come up with new strategy
పేటీఎం కొత్త వ్యూహం

ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎం ఇటీవల తన పేమెంట్స్‌ బ్యాంక్‌ను రద్దు చేయడంతో తమకు తిరుగులేదని ప్రత్యర్థి కంపెనీలు సంబరపడిపోయాయి. కానీ వాటికి దీటైన సమాధానం ఇస్తూ తిరిగి మార్కెట్‌లో తన స్థానాన్ని పదిలపరుచుకునేందుకు పేటీఎం సరికొత్త ప్లాన్‌ చేసింది. థర్డ్ పార్టీ పేమెంట్ సేవల కోసం ప్రముఖ బ్యాంకులతో జతకట్టింది. యాప్‌లో యూపీఐ లావాదేవీలు చేస్తే ఏకంగా రూ.100 వరకు క్యాష్‌బ్యాక్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది.పెద్దనోట్ల రద్దు సమయంలో దాదాపు దేశం అంతటా ఆన్‌లైన్‌ పేమెంట్‌ సేవలందించిన పేటీఎం..క్రమంగా తన సబ్‌స్రైబర్లను పెంచుకుంది. వారికి మరింత చేరువయ్యేలా ప్రత్యేకంగా పేమెంట్స్‌ బ్యాంక్‌ను ప్రారంభించింది. యుటిలిటీ బిల్లు చెల్లింపుల నుంచి షాపింగ్‌ వరకు డబ్బుతో ముడిపడిన చాలా కార్యకలాపాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. నేరుగా క్రెడిట్‌కార్డులు ఇచ్చే స్థాయికి చేరింది. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌పీసీఐ) ఆధ్వర్యంలోని యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) లావాదేవీల్లో ముందువరుసలో నిలిచింది. టోల్‌గేట్ల వద్ద ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనల ప్రకారం తన వినియోగదారులకు ఫ్యాస్టాగ్‌ సర్వీస్‌ను అందించింది.ఇటీవల కొంతమంది పేటీఎం యూజర్ల ఖాతాల్లో పరిమితులకు మించి లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని ఆర్‌బీఐ అధికారులు తెలిపారు. దాంతో పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటివరకు తన వినియోగదారులు పేమెంట్స్‌ బ్యాంక్‌ ద్వారానే యూపీఐ సేవలు వినియోగించుకునేవారు. ఒక్కసారిగా దాన్ని రద్దు చేయడంతో ప్రత్యర్థి కంపెనీలు ఒకింత సంబరపడిపోయాయి. వాటికి ధీటైన సమాధానం చెబుతూ ఎన్‌పీసీఐ ద్వారా థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్‌ (టీపీఏపీ) లైసెన్స్‌ను సంపాదించింది. దీని ప్రకారం మల్టీ బ్యాంక్‌ మోడల్‌ కింద పేటీఎం బ్రాండ్‌పైనా యూపీఐ సేవలందిస్తోంది.బ్యాంకింగ్‌ సేవలిందిస్తున్న యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యస్‌ బ్యాంక్‌లు పేటీఎంకు పేమెంట్‌ సిస్టమ్‌ ప్రొవైడర్లుగా వ్యవహరిస్తున్నాయి. గతంలో ఉన్న మర్చంట్స్‌కు, కొత్త మర్చంట్స్‌కు యస్‌ బ్యాంక్‌ సేవలందిస్తోంది. @paytm యూపీఐ హ్యాండిల్‌ కలిగిన మర్చంట్‌ పేమెంట్స్‌ యస్‌ బ్యాంక్‌కు రీడైరెక్ట్‌ అయ్యాయి.ఇదీ చదవండి: ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!మార్కెట్‌లో తిరిగి తన స్థానాన్ని పదిలపరుచుకునేలా యూజర్లు క్యాష్‌బ్యాంక్‌ ప్రకటించింది. యూపీఐ లావాదేవీలు చేస్తూ రూ.100 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందేలా వీలుకల్పిస్తుంది. అమెజాన్‌ పే, గూగుల్‌ పే, ఫోన్‌పేలతో సహా ఇప్పటికే దేశంలో 22 థర్డ్ పార్టీ పేమెంట్ యాప్‌లు యూపీఐ సర్వీసులు అందిస్తున్నాయి.#Paytm is India’s favourite payment app! 🚀 Now, better with power of 4 banks Get assured Rs 100 cashback on UPI payments using Paytm app. Download now: https://t.co/750WzmXs4E #PaytmKaro @YESBANK @AxisBank @HDFC_Bank @TheOfficialSBI pic.twitter.com/5MpOIj8owT— Paytm (@Paytm) May 3, 2024

Gold Price Today On Akshaya Tritiya [May 10, 2024]
అక్షయ తృతీయ వేళ భారీ షాకిచ్చిన బంగారం!

నేడు అక్షయ తృతీయ. దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్ల కోలాహలం నెలకొంది. ఈ తరుణంలో బంగారం ధరలు ఈరోజు (మే 10) కొనుగోలుదారులకు భారీ షాకిచ్చాయి. రెండు తగ్గుముఖం పట్టి ఊరట కలిగించిన పసిడి ధరలు ఈరోజు భారీగా పెరిగాయి.హైదరాబాద్‌, విశాఖపట్నంలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.850 పెరిగి రూ.67,000 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.930 పెరిగి రూ. 73,090 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లో ఇలా..➤ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.850 పెరిగి రూ.67,150 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.930 ఎగసి రూ.73,240 లకు చేరింది. ➤ ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.850 పెరిగి రూ.67,000 వద్ద, 24 క్యారెట్ల స్వర్ణం రూ.930 పెరిగి రూ.73,090 వద్దకు చేరింది.➤ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.900 పెరిగి రూ.67,050 ల​కు, 24 క్యారెట్ల బంగారం రూ.990 పెరిగి రూ.73,150 లకు చేరుకుంది. ➤ బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.850 ఎగిసి రూ.67,000 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.930 పెరిగి రూ.73,090 లకు ఎగిసింది.వెండి కూడా భారీగా..అక్షయ తృతీయ వేళ దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ఈరోజు ఏకంగా రూ.1300 పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి రూ.86,500లుగా ఉంది.

Simpl trims around 15% of workforce, CEO apologizes in Town Hall
వందలాది ఉద్యోగుల తొలగింపు.. సారీ చెప్పిన సీఈవో

ఫిన్‌టెక్ కంపెనీ సింపుల్ (Simpl) వివిధ విభాగాల్లో వందలాది ఉద్యోగులను తొలగించింది. యూజర్ల చేరిక మందగించడం, నిర్వహణ వ్యయం పెరిగిపోవడం వంటి కారణాలతో 15 శాతం దాదాపు  100 మందిని కంపెనీ వదిలించుకుంది. కోతల ప్రభావం ఎక్కువగా ఇంజినీరింగ్, ప్రోడక్ట్ డెవలప్‌మెంట్‌లో అత్యధిక జీతాలు అందుకునే ఉద్యోగులపై పడినట్లు తెలుస్తోంది.తాజా తొలగింపులకు ముందు, సింపుల్ దాదాపు 650 మంది ఉద్యోగులను నియమించుకుంది. ఇందులో ప్రధాన కార్యకలాపాలు, ఇంటర్న్‌లు, కాల్ సెంటర్ ఏజెంట్లు ఉన్నారు. ఈ స్టార్టప్‌లో ఇవి వరుసగా రెండవ సంవత్సరం తొలగింపులు. 2023 మార్చిలో సింపుల్‌ దాదాపు 160-170 మంది ఉద్యోగులను తొలగించింది. తాజా రౌండ్ తొలగింపుల్లో కొంతమంది ఇటీవలే చేరిన ఉద్యోగులు కూడా ఉన్నారు. వారిలో కొందరు ఉద్యోగంలో చేరి ఒకటి లేదా ఒకటిన్నర నెలలు మాత్రమే కావడం గమనార్హం.కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో నిత్యానంద్ శర్మ బుధవారం టౌన్ హాల్ సమావేశాన్ని నిర్వహించారు. అక్కడ తొలగింపులను ఉద్దేశించి ప్రసంగించారు.  లేఆఫ్‌ల నిర్ణయానికి విచారం వ్యక్తం చేశారు. క్షమాపణలు కోరారు. అవుట్‌ప్లేస్‌మెంట్ సహాయంతో సహా ప్రభావితమైన వారికి మద్దతునిస్తామని హామీ ఇచ్చారు.

oil cos cut 14 Percent of their workforce in six years even as their revenues nearly doubled
ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!

ప్రభుత్వ ఆయిల్‌, గ్యాస్ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన ఆరేళ్లలో ప్రభుత్వ చమురు సంస్థలు సుమారు 15,700 ఉద్యోగాలను తగ్గించాయి. వాటి శ్రామికశక్తిలో ఇది 14 శాతంగా ఉంది. ఈ ఆరేళ్ల కాలంలో ఆయా కంపెనీల ఆదాయాలు మాత్రం రెట్టింపు అయినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ వేలసంఖ్యలో ఉద్యోగులను తగ్గించడంపట్ల ఆందోళనలు నెలకొంటున్నాయి.చమురు మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం..ఉద్యోగాల కోత అన్ని విభాగాల్లో ఉంది. ప్రధానంగా నాన్-మేనేజిరియల్ ఉద్యోగాలను భారీగా తగ్గించారు. ప్రభుత్వ చమురు, గ్యాస్ కంపెనీల్లో 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 1,10,000గా ఉన్న శ్రామికశక్తి 94,300కి పడిపోయింది. ఎక్స్‌ప్లోరేషన్‌, ఉత్పత్తి, మార్కెటింగ్, రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో గడిచిన ఆరేళ్లలో 20-24% ఉద్యోగాలను తొలగించారు. రిఫైనరీల్లో మాత్రం కేవలం 3% ఉద్యోగాల కోత విధించారు. ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు 6శాతం, నాన్‌ మేనేజిరియల్‌ ఉద్యోగాలు 25 శాతం మేర తగ్గించినట్లు తెలిసింది.కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన కొత్త ఉద్యోగాలు నియమించడం, బౌట్‌సోర్సింగ్‌ కొలువులపై దృష్టిసారించడంతో రెగ్యులర్‌ స్థానాలపై వేటు పడుతున్నట్లు తెలిసింది. దాంతోపాటు శ్రామికశక్తి స్థానంలో అవకాశం ఉన్న విభాగాల్లో టెక్నాలజీ వాడకాన్ని పెంచుతున్నారు. పదవివిరమణ చేసిన ఉద్యోగులు స్థానంలో పరిమిత స్థాయిలోనే కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. ఫలితంగా కంపెనీల ఆదాయాలు పెరుగుతున్నా ఉద్యోగుల సంఖ్యలో కోతలు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలాఉండగా, 2022-23 నాటికంటే ముందు ఆరు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ చమురు కంపెనీలు మూలధన వ్యయంలో భాగంగా సుమారు రూ.6.8 లక్షల కోట్లు వెచ్చించాయి.

Shares of gold finance companies weakened after the RBI reiterated rules
గోల్డ్‌ఫైనాన్స్‌ తీసుకుంటే రూ.20వేలే ఇస్తారట! మిగతా డబ్బు..?

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ ) నగదు పంపిణీని రూ.20,000కి పరిమితం చేయాలని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది. లోన్‌కోసం వచ్చిన వినియోగదారులకు ఎన్‌బీఎఫ్‌సీలు నగదు రూపంలో గరిష్ఠంగా రూ.20వేలు మాత్రమే అందించేలా ఆర్‌బీఐ ప్రకటనలో తెలిపింది.  తాజా ప్రకటనతో గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు గురువారం బలహీనపడ్డాయి. ముత్తూట్ ఫైనాన్స్ షేర్‌ ధర 3.73%, మణప్పురం ఫైనాన్స్ 7.3%, ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్ 4% క్షీణించింది. ఆర్‌బీఐ నిర్ణయంతో బంగారం తాకట్టుపెట్టి నగదు తీసుకోవాలనుకునే వారికి ఇబ్బంది కలుగుతుందని పలువురు భావిస్తున్నారు.ఇదీ చదవండి: ప్రీమియంను మరింత పెంచనున్న బీమా సంస్థలుఎన్నికల నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకోవడం సరైందేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రచారంలో భాగంగా ఖర్చులకు డబ్బు సమకూర్చాలంటే ఇంట్లో బంగారం తాకట్టుపెట్టి నగదు తీసుకుంటారు. అలాంటి చర్యలను కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకొచ్చినట్లు కొందరు చెబుతున్నారు. కొత్త నిబంధనల ప్రకారం.. బంగారం తాకట్టు పెట్టే వారికి ఇకపై గరిష్ఠంగా రూ.20వేలు నగదు మాత్రమే ఇస్తారు. మిగతా డబ్బు నేరుగా తమ బ్యాంకు అకౌంట్‌లో జమచేస్తారు. తిరిగి బ్యాంకుకు వెళ్లి నిబంధనల ప్రకారం డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది.

Stock Market Rally On Today Opening
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 93 పాయింట్లు లాభపడి 22,037కు చేరింది. సెన్సెక్స్‌ 229 పాయింట్లు పెరిగి 72,646 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 105.21 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 84.19 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.46 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.51 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 0.27 శాతం పుంజుకుంది.సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన మూడు దశల పోలింగ్‌లో తక్కువ శాతం ఓటింగ్‌ నమోదు ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. ఎన్నికలకు ముందు ఊహించినట్లు ప్రస్తుత అధికార పార్టీ గెలుపు అంత సులువు కాదనే అనుమానాలతో అమ్మకాలకు పాల్పడ్డారు. ఆటో మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో గురువారం సెన్సెక్స్‌ 1,062 పాయింట్లు నష్టపోయి 72,404 వద్ద స్థిరపడింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

health insurance companies are likely to hike health premiums by another 10-15 per cent
ప్రీమియంను మరింత పెంచనున్న బీమా సంస్థలు

ఆరోగ్య బీమా రంగ సంస్థలు పాలసీదారులకు షాకివ్వబోతున్నాయి. గతేడాదిగా పాలసీ ప్రీమియంను దాదాపు 50 శాతం వరకు పెంచిన సంస్థలు..మరోసారి పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. బీమా నియంత్రణ మండలి ఐఆర్‌డీఏఐ తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ప్రీమియం ఛార్జీలు పెంచకతప్పడం లేదని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం 25 శాతం నుంచి 50 శాతం వరకు పెరగగా..వచ్చే కొన్ని నెలల్లో మరో 10 శాతం నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని లోకల్‌సర్కిల్‌ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో 11 వేల మంది పాల్గొన్నారు. వీరిలో 21 శాతం మంది ప్రీమియం 50 శాతం వరకు పెరిగినట్లు వెల్లడించగా..31 శాతం మంది 25-50 శాతం వరకు పెరిగాయని తెలిపారు.ప్రీమియం అధికమవడంతో సామాన్యులు ఆరోగ్య పాలసీ తీసుకోవడానికి ఆసక్తి చూపడంలేదు. 2022లో 62 శాతంగా ఉన్న పాలసీదారులు 2023లో 52 శాతానికి తగ్గారు. మరోవైపు, గత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య  బీమా కంపెనీలు రికార్డు స్థాయిలో లాభాలు పొందుతున్నాయి. వాటి సరాసరి వార్షిక వృద్ధిరేటు 20 శాతంగా నమోదవుతుంది. కరోనాతో ఆరోగ్య  బీమా పాలసీలు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, క్రమంగా తగ్గుతోంది.

Ola's Bhavish Aggarwal Slams LinkedIn, Tweet Viral
లింక్డ్‌ఇన్‌పై అసంతృప్తి.. భవిష్ అగర్వాల్ ట్వీట్ వైరల్

ఓలా సీఈఓ ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ పోస్ట్ చేస్తూ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో లింక్డ్‌ఇన్‌ను విమర్శించారు. పాశ్చాత్య దేశాల టెక్నలాజిలు భరతదేశంలో వ్యాపిస్తున్నాయి. ఇందులో లోపాలు కూడా కూడా ఉన్నయని వివరించారు. అందుకే భారత్ సొంత టెక్నాలజీని నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు.లింక్డ్‌ఇన్‌ ఏఐ బాట్‌లో 'భవిష్ అగర్వాల్' ఎవరు అని సెర్చ్ చేస్తే.. వచ్చిన ఫలితంలో చాలా వరకు సర్వనామాలకు సంబంధించిన దోషాలు ఉన్నయని భవిష్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.దీనిపైన లింక్డ్‌ఇన్‌ కూడా స్పందించింది. ఇది ప్రొఫెషనల్ కమ్యూనిటీ పాలసీలకు వ్యతిరేఖంగా ఉందని లింక్డ్‌ఇన్ నోటిఫికేషన్ ద్వారా పేర్కొన్నారు. నిజానికి భారత్ సొంత టెక్నాలజీని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇతర దేశాల టెక్నాలజీలను గుడ్డిగా నమ్మితే ఇలాంటి దోషాలే వస్తాయి. దీనిని యూజర్స్ నమ్మే ప్రమాదం ఉంది.Dear @LinkedIn this post of mine was about YOUR AI imposing a political ideology on Indian users that’s unsafe, sinister.Rich of you to call my post unsafe! This is exactly why we need to build own tech and AI in India. Else we’ll just be pawns in others political objectives. pic.twitter.com/ZWqiM90eT1— Bhavish Aggarwal (@bhash) May 9, 2024

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
SVC 90.380364 2024-04-09
MWK 90.380364 2024-04-09
SVC 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19

Commodities

Name Rate Change Change
Silver 1 Kg 88700.00 200.00
Gold 22K 10gm 66150.00 -100.00
Gold 24k 10 gm 72160.00 -100.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement