News


రెండో రోజూ యస్‌బ్యాంక్‌ ర్యాలీ

Friday 14th February 2020
Markets_main1581673822.png-31798

  • ఇంట్రాడేలో రూ.40ల స్థాయిని అందుకున్న షేరు

కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారని యస్‌ బ్యాంక్‌ ప్రకటనతో రెండోరోజూ ఈ బ్యాంకు షేర్ల ర్యాలీ చేశాయి. ఈ రెండు రోజుల్లో షేరు 9శాతం లాభపడింది. నేడు ఈ కంపెనీ షేరు రూ.37.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  నిధుల సమీకరణ సన్నాహాలలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలను ఈ నెల 14(శుక్రవారం)కల్లా విడుదల చేయనున్నట్లు ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.  జేసీ ఫ్లవర్స్‌ అండ్‌ కో, టిల్డెన్‌ పార్క్‌ కేపిటల్‌ మేనేజ్‌మెంట్‌, ఓక్‌ హిల్‌ అడ్వయిజర్స్‌(ఓహెచ్‌ఏ యూకే), సిల్వర్‌ పాయింట్‌ కేపిటల్‌ కంపెనీలు బ్యాంకులో పెట్టుబడుల ద్వారా వాటా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు బ్యాంకు రెండురోజుల క్రితం ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చింది. ఆధీకృత మూలధనాన్ని ప్రస్తుత రూ. 800 కోట్ల నుంచి రూ. 1100 కోట్లకు పెంచుకోవడంతో పాటు ఈక్విటీ షేర్లు, మార్పిడికి వీలయ్యే డిబెంచర్ల జారీ ద్వారా రూ. 10,000 కోట్లవరకూ సమీకరిం‍చేందుకు యస్‌ బ్యాంక్‌ చేసిన ప్రతిపాదనకు వాటాదారులు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఎవరెడీ ఇండస్ట్రీస్‌ ఇండియా కంపెనీలో రూ.5 ముఖవిలువ కలిగిన 68లక్షల విలువ కలిగిన ఈక్విటీ షేర్లను విక్రయించింది. ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ బ్యాంక్‌ దీర్ఘకాలిక ఇష్యూయర్‌ రేటింగ్‌ను ఇండియా(ఎ) నుంచి ఇండియా(ఎ-)కు తగ్గించింది. అలాగే గతంలో కేటాయించి నెగిటివ్‌ వాచ్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు తెలిపింది.ఈ సానుకూల వార్తలతో శుక్రవారం ట్రేడింగ్‌లో 8శాతం పెరిగి రూ.40.20 అందుకుంది. మధ్యాహ్నం 3గంటలకు షేరు క్రితం ముగింపు(రూ.37.20)తో పోలిస్తే 4.44శాతం లాభంతో రూ.38.85 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు రూ.29.05, రూ.285.90లుగా ఉన్నాయి. 



You may be interested

మార్కెట్‌లోకి ఎస్‌-సీఎన్‌జీ వ్యాగన్‌ ఆర్‌!

Friday 14th February 2020

దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా సరికొత్త  ఎస్‌-సీఎన్‌జీ వ్యాగన్‌ ఆర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. BS-IV నిబంధనలకు అనుగుణంగా సీఎన్‌జీతో నడిచే విధంగా దీనిని రూపొందించారు. రాబోయే కొన్ని సంవత్సరాల్లో 10 లక్షల గ్రీన్‌ వాహనల విక్రయమే లక్ష్యంగా ఈ కారును రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మోడల్‌  ఎక్స్‌షోరూం ధరను రూ.5.25లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటిదాక మారుతీ విడుదల చేసిన BS-IV వాహనాల్లో తాజా ఎస్‌-సీఎన్‌జీ

లార్జ్‌క్యాప్స్‌పైనే నమ్మకం!

Friday 14th February 2020

ఆండ్రూ హోలండ్‌ దేశీయ మార్కెట్లో రంగాలవారీగా పెద్ద కంపెనీల షేర్లపైనే నమ్మకం ఉంచుతున్నట్లు అవెండాస్‌ క్యాపిటల్‌ సీఈఓ ఆండ్రూహోలండ్‌ చెప్పారు. బడ్జెట్‌ ఓకే అని, ఎకానమీని పునరుజ్జీవం చెందించేందుకు ఆర్‌బీఐ భారీ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మార్చిచివరకు ప్రభుత్వం, ఆర్‌బీఐ చర్యలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తేలిపోతుందన్నారు. ప్రభుత్వం కన్నా ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యలు ఎకానమీకి మంచి ప్రయోజనం చేకూరుస్తాయని, కాకపోతే ఇందుకు సమయం పడుతుందని తెలిపారు. విత్తలోటు పెరుగుతుందనే భయాలతో

Most from this category