News


యస్‌ బ్యాంక్‌- కెపాసైట్‌- పీఎన్‌బీహెచ్‌ జోరు

Wednesday 15th January 2020
Markets_main1579079123.png-30950

వాణిజ్య వివాద పరిష్కారానికి వీలుగా నేడు అమెరికా, చైనా ప్రాథమిక ఒప్పందంపై సంతకాలు చేయనున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మా‍ర్కెట్లు అమ్మకాలతో కుదేలయ్యాయి. మధ్యాహ్నం 2.30 కల్లా సెన్సెక్స్‌ 210 పాయింట్లు, నిఫ్టీ 55 పాయింట్ల వరకూ పతనమయ్యాయి. అయితే ఈ పరిస్థితుల్లోనూ యస్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, కెపాసైట్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ కౌంటర్లకు డిమాండ్‌ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ మూడు కౌంటర్లూ నష్టాల మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
 

యస్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌
ఇటీవల పతన బాటలో సాగిన ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ తాజాగా జోరం‍దుకుంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 4 శాతం జంప్‌చేసి రూ. 40 వద్ద ట్రేడవుతోంది. అయితే తొలుత రూ. 37 దిగువన ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. కాగా.. రిలయన్స్‌ పవర్‌కు పూర్తి అనుబంధ సంస్థ అయిన రోసా పవర్‌ సప్లై కంపెనీలో దాదాపు 30 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు యస్‌ బ్యాంక్‌ తాజాగా పేర్కొంది. రిలయన్స్‌ పవర్‌ తనఖాలో ఉంచిన 12.73 కోట్ల రోసా పవర్‌ షేర్లను తాజాగా దాఖలు పరచుకున్నట్లు యస్‌ బ్యాంక్‌ వెల్లడించింది. కాగా.. సెక్యూరిటీల జారీ ద్వారా నిధుల సమీకరణ చేపట్టడం, అధీకృత మూలధన పెంపు తదితర ప్రతిపాదనలను పరిశీలించేందుకు బోర్డు ఫిబ్రవరి 7న అసాధారణ సమావేశాన్ని(ఈజీఎం) నిర్వహించనున్నట్లు తెలియజేసింది.

కెపాసైట్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌
ముంబైలోని బైకుల్లాలో బహుళ అంతస్తుల ఆసుపత్రి నిర్మాణానికిగాను సర్‌ జేజే హాస్పిటల్‌ క్యాంపస్‌ నుంచి కాంట్రాక్టును పొందినట్లు కెపాసైట్‌ కెపాసైట్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ పేర్కొంది. ఈపీసీ ప్రాతిపదికన లభించిన ఈ ఆర్డర్‌ విలువ రూ. 407 కోట్లుగా వెల్లడించింది. దీంతో కెపాసైట్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3 శాతం పెరిగి రూ. 200 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 205 వరకూ జంప్‌చేసింది. కెపాసైట్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌లో ప్రస్తుతం ప్రమోటర్లకు 43.79 శాతం వాటా ఉంది.

పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌
పెహల్‌ ఫౌండేషన్‌ పేరుతో ఏర్పాటు పూర్తి అనుబంధ సంస్థకు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ నుంచి వ్యాపార కార్యకలాపాల ప్రారంభ సర్టిఫికెట్‌(సీవోబీ) లభించినట్లు పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తాజాగా వెల్లడించింది. పెహల్‌ ఫౌండేషన్‌ ద్వారా కార్పొరేట్‌ సామాజిక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ వివరించింది. అయితే కార్యకలాపాలు ప్రారంభించవలసి ఉన్నట్లు తెలియజేసింది. పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలో ప్రమోటర్లకు ప్రస్తుతం 32.66% వాటా ఉంది. కాగా.. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో పీఎన్‌బీ హౌసింగ్‌ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 494 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 502 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది.



You may be interested

రానున్న రోజుల్లో మార్కెట్‌ మున్ముందుకే..!

Wednesday 15th January 2020

ఆసియా యూరప్‌ మార్కెట్లలో నెలకొన్న అమ్మకాలతో రెండు రోజుల వరుస రికార్డు ర్యాలీ తర్వాత దేశీయ మార్కెట్‌ బుధవారం కన్సాలిడేషన్‌ దిశగా కదులుతోంది. ఈ తరుణంలో మార్కెట్‌ గమనంపై విశ్లేషకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. మార్కెట్‌ ర్యాలీలో సత్తా ఇంకా అయిపోలేదని, మార్కెట్‌ దిగివచ్చిన ప్రతిసారి కొనుగోలు చేయమని ఇన్వెస్టర్లకు వారు సలహానిస్తున్నారు. చైనాపై సుంకాలు ప్రస్తుతానికి కొనసాగుతాయని అమెరికా ఉన్నతాధికారి ఒకరు చేసిన వ్యాఖ్యలతో నేడు ప్రపంచ వ్యాప్తంగా

విప్రో షేరును ఏం చేద్దాం..!?

Wednesday 15th January 2020

కంపెనీ మూడో త్రైమాసిక ఫలితాల ప్రకటన తర్వాత రోజు విప్రో షేరు 3.5 శాతం నష్టపోయి, రూ.248 వద్ద ముగిసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం(రూ.2,510 కోట్లు)తో పోల్చితే 2 శాతం క్షీణించి రూ.2,456 కోట్లను ఆర్జించినట్లు కంపెనీ ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ.15,060 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.15,470 కోట్లకు పెరిగింది. త్రైమాసిక ప్రాతిపదికన ఐటీ సేవల వ్యాపారం 3శాతం వృద్ధిని

Most from this category