News


సికాల్‌ లాజిస్టిక్స్‌లో 10.25 వాటా యస్‌ బ్యాంక్‌ సొంతం !

Thursday 16th January 2020
news_main1579171924.png-30972

  • తనఖా షేర్లకు రుణం చెల్లించని సికాల్‌ లాజిస్టిక్స్‌ 

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగానికి చెందిన రుణదాత యస్‌బ్యాంక్‌ సికాల్‌ లాజిస్టిక్స్‌ తనఖా షేర్లను సొంతం చేసుకుంది. కాఫీ డే గ్రూపుకు చెందిన సికాల్‌ లాజిస్టిక్స్‌ యస్‌బ్యాంక్‌ దగ్గర కొన్ని షేర్లను తనఖా పెట్టింది. నిర్ణిత సమయానికి రుణం చెల్లించకపోవడంతో యస్‌ బ్యాంక్‌ సికాల్‌ లాజిస్టిక్స్‌ నుంచి 10.25 శాతం వాటాను సొంతం చేసుకుంది. యస్‌బ్యాంక్‌ సొంతం చేసుకున్న 60 లక్షల ఈక్విటీ షేర్లలో ఒక్కో షేర్‌ ముఖ విలువ రూ.10 గా ఉంది. లిస్టెడ్‌ కంపెనీ నింబధనలు అనుసరించే 10.25 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు యస్‌బ్యాంక్‌ వెల్లడించింది. కాగా డ్రెడ్జింగ్‌, రీటైల్‌ సేవల్ని అందించే సికాల్‌ లాజిస్టిక్స్‌ 1955 మే 6న ప్రారంభమైంది. 2011లో కాఫీ డే గ్రూపు దీనిని సొంతం చేసుకుంది. అయితే యస్‌బ్యాంక్‌ 10.25 వాటాను సొంతం చేసుకోవడంతో గురువారం బీఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌ షేర్లు రూ.40.15 ప్రారంభమై 0.88 శాతం పుంజుకున్నాయి. మరోపక్క సికాల్‌ లాజిస్టిక్స్‌ షేర్లు రూ.15.80 ప్రారంభమై ప్లాట్‌గా ముగిసింది. 



You may be interested

ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌.. ఏం కొన్నదో చూద్దాం..

Friday 17th January 2020

నిర్వహణ ఆస్తుల పరంగా హెచ్‌డీఎఫ్‌సీ అస్సె్‌ట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ/మ్యూచువల్‌ ఫండ్‌). ఐసీఐసీఐ మ్యూచువల్‌ ఫండ్‌ తర్వాత ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ దేశంలో మూడో అతిపెద్ద సంస్థ. 2019 డిసెంబర్‌ నాటికి రూ.3.6 లక్షల కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది. అయితే, ఇందులో రూ.1.91 లక్షల కోట్లు ఈక్విటీ ఆస్తులే కావడం గమనార్హం. ఈక్విటీ ఆస్తుల పరంగా అతిపెద్ద ఏఎంసీ ఇదే. ఈ సంస్థ గతేడాది నవంబర్‌లో యస్‌ బ్యాంకు షేర్లను

ఎయిర్‌పోర్టు బిజినెస్‌లో వాటా విక్రయించనున్న జీఎంఆర్‌!

Thursday 16th January 2020

టాటా గ్రూప్‌ ఎంటీటీకి సొంతం కానున్న 49 శాతం వాటా న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపార దిగ్గజ కంపెనీ జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించనుంది. గురువారం తన ఎయిర్‌పోర్టు బిజినెస్‌లో 49 శాతం వాటాను టాటా గ్రూప్‌ కంపెనీ ఎంటీటీ టీఆర్‌ఐఎల్‌ అర్బన్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు అమ్మనున్నట్లు జీఎంఆర్‌ వెల్లడించింది. అనేక వ్యాపారాలు కలిగి ఉన్న జీఎంఆర్‌ గ్రూప్‌ ఎయిర్‌పోర్ట్‌ బిజినెస్‌లోలో 44.44 శాతం వాటాను విక్రయిస్తున్నట్లు గతంలో ప్రకటించిన

Most from this category