News


విప్రో లాభం రూ.2,456 కోట్లు

Wednesday 15th January 2020
news_main1579058594.png-30931

  • 2 శాతం క్షీణత 
  • 3 శాతం పెరిగిన ఆదాయం 
  • ఒక్కో షేర్‌కు రూ. 1 డివిడెండ్‌ 

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) డిసెంబర్‌ క్వార్టర్‌లో రూ.2,456 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం(రూ.2,510 కోట్లు)తో పోల్చితే 2 శాతం క్షీణించిందని  విప్రో సీఈఓ, ఎమ్‌డీ అబిదాలి జడ్‌ నీముచ్‌వాలా తెలిపారు. ఆదాయం మాత్రం రూ.15,060 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.15,470 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.1 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. ఆర్థిక ఫలితాలకు సంబంధించి కంపెనీ వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు.....

మార్చి క్వార్టర్‌లో ఐటీ సేవల విభాగం ఆదాయం 2 శాతం (సీక్వెన్షియల్‌గా)మేర పెరగగలదని ఈ కంపెనీ అంచనా వేస్తోంది. డిసెంబర్‌ క్వార్టర్‌లో 209 కోట్ల డాలర్ల మేర ఉన్న ఐటీసేవల విభాగం ఆదాయం ఈ మార్చి క్వార్టర్‌లో 210-214 కోట్ల డాలర్ల రేంజ్‌లో ఉండొచ్చని పేర్కొంది. ఈ క్యూ3లో షేర్‌ వారీ ఆర్జన(ఈపీఎస్‌) 3 శాతం వృద్ధితో రూ.4.30కు పెరిగింది. పది కోట్ల డాలర్ల డీల్స్‌ను నాలుగింటిని సాధించింది. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ విభాగం(బీఎఫ్‌ఎస్‌ఐ) పనితీరు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, ఈ క్యూ4లో మంచి డీల్స్‌నే సాధించగలమని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది. డిజిటల్‌ విభాగం మంచి వృద్ధిని సాధిస్తోంది. గత క్యూ3లో మొత్తం ఆదాయంలో 23 శాతం వాటా ఉన్న ఈ విభాగం వాటా ఈ క్యూ3లో 40 శాతానికి ఎగసింది. 

1,891 మందికి కొత్త ఉద్యోగాలు....
ఈ క్యూ3లో 1,891 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చింది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.87,318కు పెరిగింది. ఆట్రీషన్‌ రేటు (ఉద్యోగుల వలస) 15.7 శాతానికి తగ్గింది. అమెరికాలోని మొత్తం ఉద్యోగుల్లో స్థానికుల వాటా 70 శాతానికి పెరిగింది. 
మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి.

మంచి వృద్ధి సాధించాం...
ఈ క్యూ3లో మంచి వృద్ధి సాధించాం. అన్ని విభాగాలు, అన్ని మార్కెట్లలలో కూడా మంచి పనితీరునే చూపించాం. ‍క్లయింట్లతో సత్సంబంధాలపై దృష్టి పెడుతున్నాం. భారీ డీల్స్‌ సాధించడంపైననే ప్రధానంగా దృష్టి పెట్టాం. 

 



You may be interested

చేతక్‌ ఎలక్ట్రిక్‌ @రూ.లక్ష

Wednesday 15th January 2020

ప్రారంభ ధర రూ. లక్ష  బుకింగ్‌ అమౌంట్‌ రూ. 2000 ఆన్‌లైన్‌లో అవకాశం ఫిబ్రవరి నెలాఖరు నుంచి డెలివరీలు ముంబై: ప్రముఖ వాహ‌న త‌యారీ కంపెనీ బజాజ్‌ ఆటో ఒకప్పటి తన ఐకానిక్‌ స్కూటర్‌ ‘చేతక్‌’ను మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నూతన తరానికి తగిన విధంగా ఈసారి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను విడుదలచేసింది. ఈ-స్కూటర్‌ ప్రారంభ ధర రూ. లక్ష కాగా, ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు ప్రభుత్వం ఇస్తోన్న సబ్సిడీలు పోనూ ఇది ఎక్స్‌-షోరూం ధరని కంపెనీ వివరించింది.

నేడు ప్రతికూల ఓపెనింగ్‌?

Wednesday 15th January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 33 పాయింట్లు మైనస్‌ నేడు(బుధవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు ప్రతికూలం(నెగిటివ్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నేటి ఉదయం 8.30 ప్రాంతం‍లో 33  పాయింట్ల క్షీణించి 12,361 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,394 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను  ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి  తెలిసిందే. కాగా.. చైనాతో వాణిజ్య వివాద పరిష్కార డీల్‌

Most from this category