News


రెండేళ్ల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం

Wednesday 14th August 2019
news_main1565766653.png-27761

టోకు ధరల ద్రవ్యోల్బణం జూలైలో 26 నెలల కనిష్టస్థాయికి దిగివచ్చింది. కేంద్ర ప్రభుత్వం బుధవారం జూలై టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) గణాంకాలను విడుదల చేసింది. ఇంధన, విద్యుత్‌ ధరలు దిగిరావడంతో ఈ జూలైలో టోకు ద్రవ్యోల్బణం 1.08శాతానికి పరిమితమైంది. అంతకు ముందు జూన్‌ మాసంలో ఇది 2.02శాతంగా నమోదైంది. వరుసగా రెండో నెలలో కూడా తగ్గిన  టోకు ధరల సూచీ ఆధారిత(డబ్ల్యూపీఐ) గణాంకాలు వివరాలు ఇలా ఉన్నాయి.
1. ప్రైమరీ ఆర్టికల్స్‌ ద్రవ్యోల్బణం 6.72శాతం నుంచి 5.03 దిగివచ్చింది.
2. ఆహార ద్రవ్యోల్బణం 5.04శాతం నుంచి 4.54శాతానికి పరిమితమైంది
3. ఇంధన, విద్యుత్‌ ప్రతి ద్రవ్యోల్బణం 2.2శాతం నుంచి 3.64శాతానికి పెరిగింది.
4. తయారీ రంగ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 0.94శాతం నుంచి 0.34శాతానికి తగ్గింది.



You may be interested

ఇంకో వారంలో ఎఫ్‌ఐఐల ఇన్‌ఫ్లో!

Wednesday 14th August 2019

‘గత నెల నుంచి ఇప్పటి వరకు గమనిస్తే విదేశి నిధుల ఔట్‌ ఫ్లో అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లలో కొనసాగుతుందనే విషయం అర్థమవుతుంది. ముందు, బడ్జెట్‌ పన్ను ప్రతిపాదనలు విదేశి నిధుల ఔట్‌ ఫ్లోకి కారణమయితే ఇప్పుడు ఎమెర్జింగ్‌ మార్కెట్ల నుంచి నిధుల ప్రవాహాం జరగడం, కారణంగా ఉంది’ అని సుందరం మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎండీ, సీఈఓ, సునిల్‌ సుబ్రమణ్యిం ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు.

బ్యాంకింగ్‌ రంగానికే రిస్కు!

Wednesday 14th August 2019

ఆర్‌బీఐ ప్రతిపాదనలపై ఫిచ్‌ హెచ్చరిక బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీలకు, రిటైల్‌ రుణగ్రహీతలకు మరిన్ని రుణాలు ఇచ్చేలా ఆర్‌బీఐ ఇటీవల చేపడుతున్న ప్రోత్సాహక చర్యలు అంతిమంగా బ్యాంకింగ్‌ రంగానికి రిస్కులను పెంచుతాయని అంతర్జాతీయ రేటింగ్‌ఏజన్సీ ఫిచ్‌ రేటింగ్స్‌ హెచ్చరించింది. మందగమన నేపథ్యంలో నగదు ప్రవాహాన్ని పెంచేందుకు ఆర్‌బీఐ ఈ తరహా చర్యలను రూపొందిస్తోంది. కానీ ఇలా అధికంగా రుణాలు మంజూరు చేయడం చివరకు బ్యాంకులకు ముప్పుపగా పరిణమిస్తుందని, బ్యాంకులు అధిక క్రెడిట్‌ రిస్కును అంగీకరించాల్సివస్తుందని

Most from this category