News


200 కోట్లకు వాట్సాప్ యూజర్ల సంఖ్య

Thursday 13th February 2020
news_main1581567085.png-31741

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల సంఖ్య 200 కోట్లకు చేరింది. ప్రపంచ జనాభాలో ఇది సుమారు 25 శాతం. వాట్సాప్ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. ప్రతీ వ్యక్తిగత మెసేజీకి పూర్తి స్థాయిలో గోప్యత ఉండేలా ఎప్పటికప్పుడు తమ ప్లాట్‌ఫాంను సురక్షితంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించింది. యూజర్లు పంపే, అందుకునే మెసేజీలు లేదా ఫోన్‌కాల్స్‌ను మూడో వ్యక్తి చూడటం గానీ వినడం గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని స్పష్టం చేసింది. వాట్సాప్ ద్వారా పంపే సందేశాల గోప్యనీయత, వదంతుల వ్యాప్తి వంటి అంశాలపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో సంస్థ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. గతేడాది జూలై గణాంకాల ప్రకారం వాట్సాప్‌నకు భారత్‌లో 40 కోట్ల మంది పైగా యూజర్లు ఉన్నారు. వాట్సాప్ వేదికగా ప్రతి రోజూ 60 బిలియన్ల పైగా మెసేజీల మార్పిడి జరుగుతోందని, సుమారు 150 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లు (ఎంఏయూ) ఉన్నారని కంపెనీ మాతృ సంస్థ ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జకర్‌బర్గ్ 2018 ఫిబ్రవరిలో ప్రకటించారు. 



You may be interested

రూ.187 పెరిగిన పుత్తడి

Thursday 13th February 2020

  కరోనా వైరస్‌ ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడులపై దృష్టి పెడుతుండడంతో గురువారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దేశీయ ఎంసీఎక్స్‌లో ఉదయం 9:30 గంటల ప్రాంతంలో నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే రూ.187 పెరిగి 10 గ్రాముల పసిడి ధర రూ.40,607.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో నిన్నటిముగింపు ధరతో పోలిస్తే 5 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,576.65 డాలర్ల వద్ద ట్రేడ్‌

లాభంతో మొదలై క్షణాల్లో నష్టాల్లోకి...!

Thursday 13th February 2020

దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు గురువారం లాభంతో మొదలై, క్షణాల్లో నష్టాల్లోకి మళ్లాయి. ఆర్థిక గణాంకాలు మార్కెట్‌ను మెప్పించకపోవడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సూచీలను నష్టాల్లోకి మళ్లించాయి. సెన్సెక్స్‌ 141 పాయింట్ల లాభంతో 41,707.21 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 12,219.55 వద్ద ట్రేడింగ్‌ను మొదలయ్యాయి. అయితే బుధవారం మార్కెట్‌ ముగింపు అనంతరం వెలువడిన డిసెంబర్‌ పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) మైనస్‌లోకి వెళ్లిపోగా, జనవరి వినియోగ

Most from this category