News


విప్రో షేరును ఏం చేద్దాం..!?

Wednesday 15th January 2020
Markets_main1579075532.png-30949

కంపెనీ మూడో త్రైమాసిక ఫలితాల ప్రకటన తర్వాత రోజు విప్రో షేరు 3.5 శాతం నష్టపోయి, రూ.248 వద్ద ముగిసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం(రూ.2,510 కోట్లు)తో పోల్చితే 2 శాతం క్షీణించి రూ.2,456 కోట్లను ఆర్జించినట్లు కంపెనీ ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ.15,060 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.15,470 కోట్లకు పెరిగింది. త్రైమాసిక ప్రాతిపదికన ఐటీ సేవల వ్యాపారం 3శాతం వృద్ధిని సాధించి రూ.15,100.6 కోట్లను ఆర్జించింది. డాలర్ పరంగా ఐటి సేవల ఆదాయం వరుసగా 2019 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో వరుసగా 2.2 శాతం పెరిగి 2,094.8 మిలియన్ డాలర్లకు చేరుకుంది.

బ్రోకరేజ్‌ పేరు:- కోటక్‌ ఇస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌
రేటింగ్‌:- టార్గెట్‌ ధరను తగ్గించింది. 
షేరు టార్గెట్‌:- రూ.265 
విశ్లేషణ:- ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గించింది. ఈపీఎస్‌ అంచనాలను కొనసాగించింది. క్వార్టర్‌ టు క్వార్టర్‌ గైడెన్స్‌ మార్చి 2020 నాటికి 0-2% ఆదాయ వృద్ధి మా అంచనా కంటే తక్కువగా ఉంటుంది. వార్షిక ప్రాతిపదికన అన్ని విభాగాల్లో క్యూ3 ఆదాయ వృద్ధి బలహీనంగా ఉంది. 

బ్రోకరేజ్‌ పేరు:- మోర్గాన్‌ స్టాన్లీ
రేటింగ్‌:- అండర్‌వెయిట్‌
షేరు టార్గెట్‌:- రూ.233 నుంచి రూ.240లకు పెంచింది. 
విశ్లేషణ:- మెరుగైన మార్జిన్లలను సాధించవచ్చనే అంచనాలతో మోర్గాన్ స్టాన్లీ రెండేళ్లలో ఈపీఎస్‌ అంచనాలను 1-3 శాతం మేర పెంచింది. ఆదాయ వృద్ధి స్తబ్దుగా ఉన్నప్పటికీ, స్థూల ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పరిస్థితులున్నటికీ రెండేళ్ల తరువాత షేరు 13పీఈ వద్ద లభిస్తుంది. గతంలో నమోదు చేసిన కొన్ని ప్రొవిజన్లు రద్దు చేయడంతో మార్జిన్లు మెరుగపడుతాయి. కొన్ని స్థూల అనిశ్చితులతో స్థిరమైన డిమాండ్ వాతావరణం ఉందని యాజమాన్య వ్యాఖ్యలు సూచిస్తున్నాయని మోర్గాన్ స్టాన్లీ అన్నారు. 

 



You may be interested

యస్‌ బ్యాంక్‌- కెపాసైట్‌- పీఎన్‌బీహెచ్‌ జోరు

Wednesday 15th January 2020

వాణిజ్య వివాద పరిష్కారానికి వీలుగా నేడు అమెరికా, చైనా ప్రాథమిక ఒప్పందంపై సంతకాలు చేయనున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మా‍ర్కెట్లు అమ్మకాలతో కుదేలయ్యాయి. మధ్యాహ్నం 2.30 కల్లా సెన్సెక్స్‌ 210 పాయింట్లు, నిఫ్టీ 55 పాయింట్ల వరకూ పతనమయ్యాయి. అయితే ఈ పరిస్థితుల్లోనూ యస్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, కెపాసైట్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ కౌంటర్లకు డిమాండ్‌ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ మూడు కౌంటర్లూ నష్టాల మార్కెట్లోనూ లాభాలతో సందడి

ఎల్‌అండ్‌టీ ఇన్ఫో, శాక్‌సాఫ్ట్‌ భళా- బంధన్‌ డీలా

Wednesday 15th January 2020

రెండు రోజులపాటు హుషారుగా కదిలి బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు బుధవారం మధ్యాహ్నానికల్లా మరింత నీరసించాయి. 1.40 ప్రాంతంలో అమ్మకాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్‌ 282 పాయింట్లు క్షీణించి 41,670కు చేరింది. నిఫ్టీ సైతం 80 పాయింట్లు నష్టపోయి 12,282ను తాకింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలు ఆకట్టుకోవడంతో ఐటీ సేవల కంపెనీ ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇక రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ వార్తలతో

Most from this category