News


T2T, A, B, Z స్టాకులంటే ఏంటి?

Saturday 12th October 2019
Markets_main1570876308.png-28846

లిస్టెడ్‌ స్టాకుల్లో అనేక వర్గీకరణలుంటాయి. ఇన్వెస్టర్లకు స్టాకుల గురించి అవగాహన పెంచేందుకు ఎక్చేంజ్‌లు ఇలా వర్గీకరణ చేస్తాయి. ఆయా ట్రేడింగ్‌ లక్షణాల ఆధారంగా షేర్లను ఎక్చేంజ్‌లు వర్గీకరిస్తాయి. ఒక షేరు ఏ తరగతిలో ఉందో తెలుసుకోవడం ద్వారా దాని స్వరూప స్వభావాలు అర్ధం చేసుకోవచ్చు. రెండు ప్రధాన ఎక్చేంజ్‌ల్లో ఈ వర్గీకరణ ఇంచుమించు ఒకేలా ఉంటుంది.

ముందుగా బీఎస్‌ఈలో వివిధ గ్రూపుల గురించి తెలుసుకుందాం..

  • బీఎస్‌ఈలో స్టాకులను A, B, S, T or T2T and Z గ్రూపులుగా వర్గీకరించారు. 
  • గ్రూప్‌లో స్టాకులు బాగా లిక్విడిటీ ఉన్న స్టాకులు. ట్రేడింగ్‌, ఇన్వెస్టింగ్‌పరంగా బాగుంటాయి. ట్రేడింగ్‌ వాల్యూంలు కూడా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఈ గ్రూప్‌లో స్టాకుల మార్కెట్‌ క్యాప్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రూప్‌లోని కంపెనీలు సమయానుకూలంగా ఫలితాలు వెల్లడిస్తూ అన్ని నిబంధనలు పక్కాగా పాటిస్తుంటాయి. 
  • ఎస్‌ గ్రూప్‌లో షేర్లు చిన్న కంపెనీలవి. సుమారు రూ. 5కోట్ల టర్నోవర్‌ ఉన్న కంపెనీల షేర్లు ఇందులో ఉంటాయి. వీటి కౌంటర్లలో లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. వాల్యూంలు కూడా అల్పంగా ఉంటాయి. అందువల్ల షేరు ధర కదలికలు అనూహ్యంగా ఉంటుంటాయి. 
  • జెడ్‌ గ్రూప్‌లో ఎక్చేంజ్‌లు పేర్కొన్న లిస్టింగ్‌ నిబంధనలను అందుకోలేని కంపెనీల షేర్లు ఉంటాయి. ఇన్వెస్టర్ల ఫిర్యాదులు పట్టించుకోని కంపెనీల షేర్లను ఇందులో చేరుస్తారు.
  • టీ2టీ గ్రూప్‌లో ఇంట్రాడేలో ట్రేడ్‌ చేయకూడని షేర్లను ఉంచుతారు. అంటే తప్పక డెలివరీ తీసుకోవాల్సిన కంపెనీల షేర్లు ఇందులో ఉంటాయి. అంటే ఈ గ్రూప్‌లోని షేర్లలో దేన్ని కొన్నా పూర్తి మొత్తం చెల్లించి తప్పక అకౌంట్‌లోకి జమ చేసుకోవాలి. ఇందులోని షేర్లు తీవ్ర ఒడిదుడుకుల మార్కెట్లో రక్షణనిస్తాయి. కొంతమంది ట్రేడర్లు ఎంపిక చేసిన కౌంటర్లలో స్పెక్యులేషన్‌ లావాదేవీలు జరపకుండా ట్రేడర్లను రక్షించేందుకు ఈ గ్రూప్‌ ఏర్పాటైంది. 
  • బీ గ్రూప్‌లో పైన చెప్పిన ఎందులోనూ లేని కంపెనీల షేర్లుంటాయి. ఇందులో సబ్‌కేటగిరీలు బీ1, బీ2 అని ఉంటాయి. బీ1లో ఉన్న కంపెనీలు బీ2లో ఉన్నవాటి కన్నా మెరుగైనవి. 

ఇవే కాకుండా ఎస్‌ఎల్‌బీ అని ఇంకో గ్రూప్‌ కూడా ఉంటుంది. ఇందులో ఎఫ్‌అండ్‌ఓ విభాగం నుంచి డీమెటిరియలైజ్‌ చేసిన స్టాకులుంటాయి. ఇందులో ఉన్నవాటిని అప్పు కింద తనఖా పెట్టుకోవడం చేస్తారు. ఎక్చేంజ్‌లు సమయానుకూలంగా కంపెనీలను వాటి పనితీరును బట్టి పైన చెప్పిన గ్రూపుల్లో చేరుస్తుంటాయి.

ఈ రకమైన వర్గీకరణతో పాటు మార్కెట్‌ క్యాప్‌ ఆధారంగా షేర్లను లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌గా కూడా వర్గీకరిస్తారు. 


BSE

You may be interested

భారతీ ఎయిర్‌టెల్‌పై బుల్లిష్‌!

Saturday 12th October 2019

‘జీయో, ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్‌ కాల్స్‌పై చార్జీలను వసూల్‌ చేయడం మొదలుపెట్టడంతో ఎయిర్‌టెల్‌కు లాభం చేకూరుతుంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయమని సిఫార్సు చేస్తున్నాం’ అని చార్ట్ అడ్వైజ్‌ వ్యవస్థాపకుడు, సీ.కే నారాయణ్ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే... అరబిందో ఫార్మా పతనం కొనసాగుతుంది.. ఫార్మా సెక్టార్‌లో సన్‌ ఫార్మా, లుపిన్‌ వంటి కంపెనీల షేర్లు నష్టపోతున్నప్పటికి, అరబిందో ఫార్మా మాత్రం నెలల తరబడి స్థిరమైన ప్రదర్శన

రికార్డు స్థాయికి ఫారెక్స్‌ నిల్వలు

Saturday 12th October 2019

రిజర్వుబ్యాంక్‌ వద్దనున్న ఫారెక్స్‌ నిల్వలు(విదేశీ మారక ద్రవ్య నిల్వలు) అక్టోబర్‌ 4తో ముగిసిన వారంలో రికార్డుస్థాయికి చేరుకున్నాయి. తాజాగా ముగిసిన వారంలో విదేశీ మారక నిలవ్లు 4.24 బిలియన్‌ డాలర్లు పెరిగి 437.83 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్లు ఆర్‌బీఐ(రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) ఓ నివేదికలో పేర్కొం‍ది. ఈ వారానికి ముందు వారంలో ఈ నిల్వలు 5.02 బిలియన్‌ డాలర్లు పెరిగి 433.59 బిలియన్‌ డాలర్లకు చేరుకోవడం గమనార్హం. విదేశీ కరెన్సీ(ఎఫ్‌సీఏ) నిల్వలు పెరగడంతో

Most from this category