News


లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్న బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 16th January 2020
Markets_main1579162997.png-30966

మార్కెట్‌ పరిమితి శ్రేణి ట్రేడింగ్‌లో భాగంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతుంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 31,810.55 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ అరశాతం పెరిగి 31,988.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. అనంతరం మార్కెట్‌ ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో భాగంగా ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ రంగ షేర్లకు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ ఇంట్రాడే గరిష్టం నుంచి 31,988.90 దాదాపు 1శాతం నష్టపోయి 31,692.40 వద్ద కనిష్టాన్ని తాకింది. అనంతరం మళ్లీ కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ మరోసారి లాభాల్లోకి మళ్లింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(31,692.40)తో పోలిస్తే 0.16శాతం స్వల్ప లాభంతో 31,876.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు 1శాతం నష్టపోయింది. ఆర్‌బీఎల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ అరశాతం క్షీణించాయి. మరోవైపు ఫెడరల్‌ బ్యాంక్‌ 2.50శాతం పెరిగింది. కోటక్‌ బ్యాంక్‌ 1శాతం లాభపడింది. యస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ అరశాతం పెరిగాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు అరశాతం 0.10శాతం స్వల్ప లాభంతో ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

వొలాటిలిటీలోనూ ఈ షేర్ల లాభాల దౌడు

Thursday 16th January 2020

జాబితాలో వొకార్డ్‌, మహానగర్‌ గ్యాస్‌ టొరంట్‌ ఫార్మా, ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌ చరిత్రాత్మక గరిష్టానికి నెస్లే ఇండియా అగ్ర దేశాలు అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కార ఒప్పందం కుదిరినప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండటంతో స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేట్‌ అవుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనూ హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ వొకార్డ్‌ లిమిటెడ్‌, యుటిలిటీస్‌ కంపెనీ మహానగర్‌ గ్యాస్‌, ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా, ఈ

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 16th January 2020

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  డెన్‌ నెట్‌వర్క్‌:-  డెన్‌ నెట్‌వర్క్‌ ఆర్థిక సంవత్సరం-2020 మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ముగిసిన ఆర్థిక సంవత్సరం 2019 మూడో త్రైమాసికంలో రూ.31.2 కోట్లు నష్టపోగా.. ఈ త్రైమాసికంలో పుంజుకుని నికర లాభాన్ని రూ.12.3 కోట్లుగా ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కార్యాకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.318 కోట్లు ఉంది. గతేడాది ఈ ఆదాయం రూ.308 కోట్లుగా నమోదైంది.  రిలయన్స్‌ ఇండస్ట్రీయల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌:- గతేడాది

Most from this category