News


వొడాఫోన్‌ జూమ్‌- నేడు ఏజీఆర్‌పై విచారణ

Friday 14th February 2020
Markets_main1581654378.png-31783

11 శాతం దూసుకెళ్లిన షేరు
క్యూ3లో రూ. 6,439 కోట్ల నష్టం
నేడు ఏజీఆర్‌ బకాయిలపై కోర్టు విచారణ
ఎయిర్‌టెల్‌ మరిన్ని నిధుల సమీకరణ

వర్థమాన మార్కెట్ల టెలికాం కంపెనీల్లో ఎయిర్‌టెల్‌ అదుర్స్‌

ఏజీఆర్‌ బకాయిలపై మొబైల్‌ టెలికం కంపెనీలు వేసిన తాజా పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుం‍ది. ఏజీఆర్‌ చెల్లింపులపై గడువు పెంపు, తదితర అంశాలపై భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, టాటా టెలీసర్వీసెస్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దేశీ మొబైల్‌ టెలికం కంపెనీల ఏజీఆర్‌ బకాయిలు రూ. 1.47 లక్షల కోట్లవరకూ ఉన్నట్లు ఇప్పటికే పరిశ్రమవర్గాలు వెల్లడించాయి. వీటిలో లైసెన్స్‌ ఫీజు, వడ్డీలు, పెనాల్టీలు తదితరాలు కలసి ఉన్నట్లు తెలియజేశాయి. టెలికం శాఖ(డాట్‌) వివరాల ప్రకారం ఎయిర్‌టెల్‌ రూ. 21,682 కోట్లమేర లైసెన్స్‌ ఫీజు చెల్లించవలసి ఉండగా.. వొడాఫోన్‌ ఐడియా రూ. 19,824 కోట్లవరకూ బకాయి పడింది. ఇక రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ రూ. 16,456 కోట్లకుపైగా లైసెన్స్‌ ఫీజు చెల్లించవలసి ఉండగా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 2099 కోట్లు, ఎంటీఎన్‌ఎల్‌ రూ. 2537 కోట్లు బకాయిపడినట్లు తెలుస్తోంది. కాగా.. పెనాల్టీలు, వడ్డీలను మినహాయించడంతోపాటు.. అసలు చెల్లింపులకు పదేళ్ల గడువు ఇవ్వవలసిందిగా ఇటీవల వొడాఫోన్‌ ఐడియా ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఇవన్నీ కలసి వొడాఫోన్‌ ఐడియా భారాన్ని రూ. 53,000 కోట్లకు చేర్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 

క్యూ3లో నష్టాలు
ఈ ఆర్థిక సం‍వత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో వొడాఫోన్‌ ఐడియా నికర నష్టం ప్రకటించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో  రూ. 6439 కోట్ల నికర నష్టం‍ నమోదైంది. గతేడాది(2018-19) క్యూ3లో రూ. 5005 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.

ఎయిర్‌టెల్‌ రెండో ర్యాంకు  
ఇప్పటికే ఏజీఆర్‌ బకాయిల చెల్లింపులకు వీలుగా 3 బిలియన్‌ డాలర్లను సమీకరించిన మొబైల్‌ సేవల దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ తాజాగా 25 కోట్ల డాలర్ల(రూ. 1800 కోట్లు)ను సమకూర్చుకున్నట్లు వెల్లడించింది. పెర్‌పెట్యువల్‌ బాండ్ల జారీ ద్వారా వీటిని సమీకరించగా.. విదేశీ సంస్థలు బ్లాక్‌రాక్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌, యూబీఎస్‌ తదితరాలు ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆసక్తి చూపినట్లు పేర్కొంది. 150 కోట్ల డాలర్ల పెట్టుబడులకు ఆసక్తి వ్యక్తమైనట్లు వెల్లడించింది. కాగా.. ఇటీవల షేరు ర్యాలీ నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్‌ వర్ధమాన మార్కెట్లలో అత్యంత విలువైన టెలికాం కంపెనీల జాబితాలో రెండో ర్యాంకును పొందింది. చైనా మొబైల్‌ 175 బిలియన్‌ డాలర్లతో అగ్రస్థానాన్ని పొందగా.. 41 బిలియన్‌ డాలర్ల విలువతో ఎయిర్‌టెల్‌ తదుపరి ర్యాంకులో నిలిచినట్లు ఒక నివేదిక పేర్కొంది.

షేర్ల తీరిలా
నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే వొడాఫోన్‌ ఐడియా షేరు 11 శాతం దూసుకెళ్లి రూ. 5కు చేరింది. ఇంట్రాడేలో రూ. 5.45 వరకూ ఎగసింది. ఇక ఎయిర్‌టెల్‌ 0.4 శాతం బలపడి రూ. 542 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 548 సమీపానికి ఎగసింది. 



You may be interested

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి బ్రిటన్ హైకోర్టులో ఊరట

Friday 14th February 2020

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భాగస్వామ్య కంపెనీ షెల్‌కు బ్రిటన్‌ హైకోర్టులో ఊరట లభించింది. వెస్ట్రన్‌ ఆఫ్‌షోర్‌ లో ఉన్న పన్నా-ముక్త, తపతీ ఆయిల్‌  అండ్‌ గ్యాస్‌  క్షేత్రాలు రికవరీ  ధరలు చెల్లించాలని భారత ప్రభుత్వం వేసిన పిటీషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో నిఫ్టీలో రిలయన్స్‌ ఇండస్ట్రీ షేరు 0.34 శాతం తగ్గి 1,469.20 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  

షార్ట్‌టర్మ్‌ షేర్‌ ఐడియాలు!

Friday 14th February 2020

స్వల్పకాలానికి మంచి రాబడిని అందించే పలు స్టాకులను అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు.  అశ్విన్‌ గుజ్రాల్‌: 1. టైటాన్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1340. స్టాప్‌లాస్‌ రూ. 1285.  2. ఎస్‌బీఐ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 345. స్టాప్‌లాస్‌ రూ. 320. 3. అరబిందో ఫార్మా: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 510. స్టాప్‌లాస్‌ రూ. 532. 4. టాటాస్టీల్‌: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 430. స్టాప్‌లాస్‌ రూ. 446.  5. రేమండ్‌: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 580. స్టాప్‌లాస్‌ రూ.

Most from this category