News


చైనాగూడ్స్‌పై టారిఫ్స్‌ కొనసాగుతాయ్‌!

Wednesday 15th January 2020
news_main1579071123.png-30947

రెండో దశ ట్రేడ్‌ ఒప్పందం జరిగేవరకు చైనా వస్తువులపై విధించిన టారిఫ్‌లు కొనసాగుతాయని అమెరికా వాణిజ్య సెక్రటరీ స్టీవెన్‌ నుచిన్‌ చెప్పారు. తొలిదశ ఒప్పందంపై సంంతకాలకు అనుకున్న గడువు సమీపిస్తున్న వేళ స్టీవెన్‌ ఈ ప్రకటన చేశారు. రెండో దశ వాణిజ్య ఒప్పందం వేగంగా జరిగితే ప్రెసిడెంట్‌ ట్రంప్‌ టారిఫ్‌ల తగ్గింపును పరిగణిస్తారని చెప్పారు. బుధవారం మధ్యాహ్నం ట్రంప్‌, చైనాకు చెందిన లీయుహె తొలిదశ ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. ట్రంప్‌ అభిశంసనపై సెనెట్‌ విచారణ ఆరంభమయ్యేందుకు వారం ముందు ఈ డీల్‌పై సంతకాలు జరగనున్నాయి. నవంబర్‌లో ఎన్నికల తర్వాతనే టారిఫ్‌ల తొలగింపు ఉండొచ్చన్న వార్తలు మంగళవారం యూఎస్‌ మార్కెట్లపై ప్రభావం చూపాయి, దీంతో యూఎస్‌ సూచీలు మిశ్రమంగా ముగియగా, బుధవారం యూఎస్‌ ఫ్యూచర్స్‌ నెగిటివ్‌గా ఉన్నాయి.

ట్రేడ్‌వార్‌లో భాగంగా విధించిన టారిఫ్‌ల తగ్గింపుపై ఎలాంటి ఒప్పందం లేదని స్టీవెన్‌, యూఎస్‌ ట్రేడ్‌ ప్రతినిధి రాబర్ట్‌ లైట్జర్‌ చెప్పారు. తొలిదశ ఒప్పంద వివరాలు బుధవారం అనంతరం బహిర్గతం చేస్తామని, అయితే యూఎస్‌ నుంచి చైనా కొనుగోలు చేయబోయే వస్తోత్పత్తుల వివరాలు మాత్రం రహస్యంగా ఉంటాయని చెప్పారు. తొలిదశ ఒప్పందంలో భాగంగా చైనాపై కొత్త టారిఫ్‌లు వేయకుండా ఉండేందుకు, ప్రస్తుతం ఉన్న కొన్ని టారిఫ్‌లను సగానికి తగ్గించేందుకు యూఎస్‌ అంగీకరించగా, యూఎస్‌ నుంచి భారీగా వస్తోత్పత్తులు కొనేందుకు చైనా అంగీకారం తెలిపింది. ట్రంప్‌ వచ్చిన తర్వాత చేపట్టిన వాణిజ్య ఒప్పందాల పునఃసమీక్షలతో యూఎస్‌ కంపెనీలు 4600 కోట్ల డాలర్లు వ్యయం చేయాల్సివచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలిదశ ట్రేడ్‌ ఒప్పందంతో పెద్దగా ప్రయోజనం ఉండదని, ట్రేడ్‌వార్‌ కారణంగా యూఎస్‌ కంపెనీలకే అధిక నష్టం వస్తోందని అమెరికన్స్‌ ఫర్‌ ఫ్రీట్రేడ్‌ సంస్థ ఆరోపించింది. 



You may be interested

ఎల్‌అండ్‌టీ ఇన్ఫో, శాక్‌సాఫ్ట్‌ భళా- బంధన్‌ డీలా

Wednesday 15th January 2020

రెండు రోజులపాటు హుషారుగా కదిలి బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు బుధవారం మధ్యాహ్నానికల్లా మరింత నీరసించాయి. 1.40 ప్రాంతంలో అమ్మకాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్‌ 282 పాయింట్లు క్షీణించి 41,670కు చేరింది. నిఫ్టీ సైతం 80 పాయింట్లు నష్టపోయి 12,282ను తాకింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలు ఆకట్టుకోవడంతో ఐటీ సేవల కంపెనీ ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇక రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ వార్తలతో

జనవరిలో మిడ్‌ క్యాప్స్‌ జోరు

Wednesday 15th January 2020

కొత్త ఏడాది(2020)లో అత్యధిక శాతం మంది విశ్లేషకులు అంచనా వేసినట్లుగానే మధ్య, చిన్నతరహా కౌంటర్లు జోరు చూపుతున్నాయి. ఓవైపు మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకుతుంటే.. మరోవైపు మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ ఇన్వెస్టర్లను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. వెరసి ఈ జనవరిలో ఇప్పటివరకూ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 1.6 శాతం పుంజుకోగా.. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 3 శాతం, స్మాల్‌ క్యాప్‌ 5 శాతం చొప్పున ఎగశాయి. ఇతర వివరాలు

Most from this category