News


వృద్ధి కథ... బాలీవుడ్‌ సినిమాయే!

Thursday 12th September 2019
news_main1568258686.png-28317

  • మందగమనం రూపంలో విలన్‌ 
  • 8తో ముగిసే సంవ్సరాల్లో సంక్షోభాలు 
  • చివరికి సుఖాంతమే 
  • మందగమనంపై కోటక్‌ వ్యాఖ్యలు 

ముంబై: మన దేశ వృద్ధి కధ అచ్చం బాలీవుడ్‌ సినిమాలాగానే ఉందని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌  చైర్మన్‌ ఉదయ్‌ కోటక్‌ వ్యాఖ్యానించారు. భారత్‌లోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు సినిమాను తలపించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఆరంభంలో ప్రేమ కధలాగానే వృద్ది జోరుగానే మొదలైందని, ఆ తర్వాత మందగమనం రూపంలో విలన్‌ ఎదురయ్యాడని, దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారని వివరించారు. ఈ మందగమన విలన్‌ను ఎదుర్కొనడానికి భారత్‌ తన ప్రయత్నాలు తాను చేయాలని సూచించారు. తర్వాత తర్వాత పరిస్థితులు చక్కబడుతాయని పేర్కొన్నారు. సినిమాలు సుఖాంతమైనట్లే, మన వృద్ధి కధ కూడా శుభప్రదంగానే ఉంటుందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక స్థితిగతులు సమస్యాత్మకంగానే ఉన్నప్పటికీ, అందరూ భయపడుతున్నంత అధ్వానంగా మాత్రం లేవని వివరించారు. ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ కళ్లతో చూస్తే, భారత వృద్ధి కధ గగుర్పొడిచేలా ఉందని పేర్కొన్నారు. 

మీరు చేస్తున్న పనినే కొనసాగించండి. సరైన సమయంలో రిస్క్‌ తీసుకోవడానికి సిద్ధమైతే, దీర్ఘకాలంలో మంచి ఫలితాలే పొందవచ్చని ఉదయ్‌ కోటక్‌  వ్యాఖ్యానించారు. ఏ దేశమూ ఇవ్వన్నని గొప్ప అవకాశాలు భారత్‌లో కోకొల్లలుగా ఉన్నాయని వివరించారు. భారత్‌లో ఇలాంటి మందగమన పరిస్థితులు సాధారణమేనని, ప్రతి కొన్నేళ్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పారు. సాధారణంగా 8తో ముగిసే సంవత్సరాల్లో సంక్షోభాలు వచ్చాయని పేర్కొన్నారు. 1998లో ఆసియా సంక్షోభం తర్వాత భారత్‌లో ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని గుర్తు చేశారు. 2008లో అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం అతలాకుతలం చేసిందని, 2018లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభంతో ముసలం మొదలైందని పేర్కొన్నారు. 
 



You may be interested

ఎయిర్‌టెల్‌ ‘ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్’ సేవలు ప్రారంభం

Thursday 12th September 2019

1జీబీపీఎస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ధర రూ. 3,999 న్యూఢిల్లీ: టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌..  ‘ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్’ పేరుతో అపరిమిత బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను బుధవారం ప్రారంభించింది. గృహాలు, ఎస్‌ఓహెచ్‌ఎం (స్మాల్ ఆఫీస్ హోమ్ ఆఫీస్), చిన్న వాణిజ్య సంస్థల కోసం రూ. 3,999 నెలవారీ చందాకే తాజా సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ సేవలు ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ఇండోర్, జైపూర్, అహ్మదాబాద్, ఫరీదాబాద్, నోయిడా,

‘‘ఐఫోన్‌ 11’’ సేల్‌ 27 నుంచి...

Thursday 12th September 2019

- ప్రారంభ ధర రూ. 64,900 - హైఎండ్‌ రూ. 109,900 కాలిఫోర్నియాలో మంగళవారం అట్టహాసంగా విడుదలైన ‘ఐఫోన్‌ 11’ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ భారత ధరలను.. ఆపిల్‌ కంపెనీ బుధవారం ప్రకటించింది. మొత్తం ఆరు రంగుల్లో లభ్యంకానున్న  ‘ఐఫోన్‌ 11’ ధర ఇక్కడి మార్కెట్లో . రూ. 64,900 ప్రారంభం కానుంది. ‘ఐఫోన్‌ 11 ప్రో’  ప్రారంభ ధర రూ. 99,900 కాగా, ‘ఐఫోన్‌ 11 ప్రో మ్యాక్స్’ భారత ధర రూ.

Most from this category