News


ఫిబ్రవరిలో తగ్గిన వాణిజ్యలోటు

Saturday 16th March 2019
news_main1552719135.png-24633

- ఎగుమతుల విలువ 
26.67 బిలియన్‌ డాలర్లు
- దిగుమతుల విషయంలో
ఈ మొత్తం 36.26 బిలియన్‌ డాలర్లు
- వెరసి వాణిజ్యలోటు 
9.6 బిలియన్‌ డాలర్లు

న్యూఢిల్లీ: ఎగుమతులు-దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం- వాణిజ్యలోటు ఫిబ్రవరిలో ఉపశమించింది. దిగుమతులు తగ్గడం దీనికి ప్రధాన కారణం. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే...

- ఎగుమతుల విలువ 2.44 శాతం పెరుగుదలతో 26.67 బిలియన్‌ డాలర్లు.  ఫార్మా, ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌  ఎగుమతులు పెరిగాయి. 
- దిగుమతుల విషయంలో ఈ మొత్తం 36.26 బిలియన్‌ డాలర్లు. గత ఏడాది (2018 ఫిబ్రవరి) ఇదే నెలతో పోల్చిచూస్తే, ఈ విలువ 5.4 శాతం తగ్గింది. 
- వెరసి వాణిజ్యలోటు ఫిబ్రవరిలో 9.6 బిలియన్‌ డాలర్లు.  వాణిజ్యలోటు 2018 ఫిబ్రవరిలో 12.3 బిలియన్‌ డాలర్లు అయితే, 2019 జనవరిలో ఈ విలువ 14.73 బిలియన్‌ డాలర్లు. 
- పసిడి, పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు  తగ్గాయి. దీనితో దిగుమతులు మొత్తంగా తగ్గాయి. పసిడి దిగుమతులు 11 శాతం తగ్గి 2.58 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 2.89 బిలియన్‌ డాలర్లు. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు 8 శాతం తగ్గి 9.37 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 


ఏప్రిల్‌- ఫిబ్రవరి మధ్య...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- ఫిబ్రవరి మధ్య ఎగుమతుల విలువ 8.85 శాతం పెరిగి 298.47 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతుల విలువ 9.75 శాతం పెరిగి 464 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి వాణిజ్యలోటు దాదాపు 166 బిలియన్‌ డాలర్లు. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ విలువ 149 బిలియన్‌ డాలర్లు. 

అవరోధాలను ఎదుర్కొంటున్నాం: ఎఫ్‌ఐఈఓ
అంతర్జాతీయంగా వాణిజ్య రక్షణాత్మక విధానాలు ఉన్నాయి. కఠిన అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులు ఉన్నాయి. దేశీయంగానూ ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ ఎగుమతులు కొంత సానుకూలంగానే నమోదయ్యాయి. మొత్తం 30 ప్రధాన గ్రూపుల్లో 18 సానుకూల ఫలితాలను అందించాయి. 
- గణేశ్‌ కుమార్‌ గుప్తా, ఎఫ్‌ఐఈఓ

సేవలు తగ్గాయి...
సేవల ఎగుమతులు 2018 డిసెంబర్‌తో పోల్చితే, 2019 జనవరిలో 1.02 శాతం తగ్గాయి. 17.75 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక సేవల దిగుమతులు కూడా ఇదే కాలంలో 3.07 శాతం తగ్గి 11.03 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 



You may be interested

వేగంగా రూపాయి రికవరీ !

Saturday 16th March 2019

- శుక్రవారం 24 పైసలు బలోపేతం - 69.10కి పరుగు - వరుసగా ఐదవరోజు లాభాల బాట - 104 పైసల పురోగమనం ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ గడచిన ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో వేగంగా బలపడింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో శుక్రవారం 24పైసలు లాభపడితే, గడచిన ఐదు రోజుల్లో 104 పైసలు బలపడింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచీ రూపాయి లాభాల బాటన నడిచింది. గురువారం ముగింపు 69.34పైసలు అయితే, శుక్రవారం మరింత లాభంతో

మిడ్‌క్యాప్‌ ర్యాలీకి రంగం సిద్ధం!?

Saturday 16th March 2019

వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టడం ఆరంభమైంది. కరెంటు ఖాతా లోటు డిసెంబర్‌ త్రైమాసికానికి ఐదేళ్ల గరిష్ట స్థాయి నుంచి సులభతరం అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. చారిత్రకంగా చూస్తే ఈ రెండు పరిణామాలు చోటు చేసుకున్న సమయం అనుకూలమని, లార్జ్‌క్యాప్‌ కంటే ఇతర షేర్లు మంచి ప్రదర్శన చూపిస్తాయని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇటీవలి ఆర్‌బీఐ రేట్ల కోతతో ఇది ఇప్పటికే ఆరంభమైందంటున్నారు. నిఫ్టీ 500 ఇండెక్స్‌ ఫిబ్రవరి 7 నుంచి

Most from this category