News


ఎగుమతులు పెరిగాయ్‌... దిగుమతులు తగ్గాయ్‌!

Thursday 15th August 2019
news_main1565851055.png-27773

  • జూలైలో ఎగుమతులు 2.25 శాతం అప్‌
  • దిగుమతులు 10.43 శాతం క్షీణత
  • వెరసి తగ్గిన వాణిజ్య లోటు 
  • 13.43 బిలియన్‌ డాలర్లుగా నమోదు

న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు 2019 జూలైలో కేవలం 2.25 శాతం (2018 జూలైతో పోల్చి) పెరిగాయి. విలువ రూపంలో 26.33 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 2018 జూలైలో ఈ విలువ 25.75 బిలియన్‌ డాలర్లు. కాగా  అయితే దిగుమతులు మాత్రం 10.43 శాతం తగ్గాయి. విలువ రూపంలో 39.76 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతులు-దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం 13.43 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. ఇది నాలుగు నెలల కనిష్టస్థాయి. చమురు, బంగారం దిగుమతులు పడిపోవడం వాణిజ్యలోటు తగ్గుదలపై సానుకూల ప్రభావం చూపింది.  ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

- రసాయనాలు, ఇనుము, ఫార్మా రంగాల నుంచి ఎగుమతులు భారీగా పెరిగాయి. 
- అయితే రత్నాలు, ఆభరణాలు (-6.82 శాతం), ఇంజనీరింగ్‌ గూడ్స్‌ (-1.69 శాతం), పెట్రోలియం ప్రొడక్టుల (-5 శాతం) ఎగుమతులు పెరక్కపోగా క్షీణించాయి. 
- పసిడి దిగుమతులు 42.2 శాతం పడిపోయి 1.71 బిలయన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 
- చమురు దిగుమతులు 22.15 శాతం క్షీణించి 9.6 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. చమురేతర దిగుమతులు 5.92 శాతం పడిపోయి, 30.16 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 

తొలి నాలుగు నెలల్లో నీరసం
2019 ఏప్రిల్‌ నుంచి జూలై వరకూ ఎగుమతులు 0.37 శాతం క్షీణించి (2018 ఇదే నెలలతో పోల్చి) 107.41 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు సైతం 3.63 శాతం క్షీణించి 166.8 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి వాణిజ్యలోటు 59.39 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ కాలంలో చమురు దిగుమతులు 5.69 శాతం తగ్గి 44.45 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది.
అంతర్జాతీయ ప్రతికూలత ప్రభావం
ఎనిమిది నెలల తర్వాత జూన్‌లో భారత ఎగుమతులు మొదటిసారి క్షీణతలోకి జారాయి. ఈ క్షీణత 9.71 శాతంగా నమోదయ్యింది. జూలైలో కొంత మెరుగుదలతో 2.25 శాతంగా నమోదయ్యాయి. అయినా ఉత్సాహకరమైన పరిస్థితి ఉందని చెప్పలేం.  వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు భారత్‌ ఎగుమతులపై ప్రభావం చూపుతున్నాయి. ఎగుమతిదారులకు సంబంధించి దేశీయంగా వేగవంతమైన రుణ లభ్యత, వడ్డీల తగ్గింపు, అగ్రి ఎగుమతులకు రాయితీలు, విదేశీ పర్యాటకులకు అమ్మకాలపై ప్రయోజనాలు, వస్తు, సేవల పన్ను తక్షణ రిఫండ్‌ వంటి అంశాలపై కేంద్రం తక్షణం దృష్టి సారించాలి. 
- శరద్‌ కుమార్‌ షరాఫ్‌, ఎఫ్‌ఐఈఓ ప్రెసిడెంట్‌

రూపాయి బలహీన ప్రభావమే...
జూన్‌ క్షీణ బాట నుంచి జూలైలో వృద్ధి బాటకు భారత్‌ ఎగుమతులు వచ్చాయంటే, డాలర్‌ మారకంలో రూపాయి గడచిన ఆరు వారాల 3.5 శాతం క్షీణించడమే కారణం. స్వల్పకాలికంగా ఎగుమతుల్లో సానుకూలత రావడానికి ఇదే కారణం.
- మోహిత్‌ సింగ్లా, టీపీసీఐ చైర్మన్‌

 



You may be interested

క్యూఐపీ ద్వారా యస్‌బ్యాంక్‌ రూ.1,930 కోట్లు సమీకరణ

Thursday 15th August 2019

వ్యాపార విస్తరణకు వినియోగిస్తాం న్యూఢిల్లీ: యస్‌బ్యాంక్‌ క్యూఐపీ ద్వారా రూ.1,930 కోట్లు సమీకరించింది. ఈ నెల 9న మొదలైన ఈ ఇష్యూ బుధవారం ముగిసిందని, ఈ నిధులను వ్యాపార విస్తరణకు వినియోగిస్తామని యస్‌బ్యాంక్‌ తెలిపింది. ఈ క్యూఐపీ ఇష్యూకు ఇష్యూ ధరగా రూ.83.55ను నిర్ణయించామని పేర్కొంది. ఫ్లోర్‌ ధర రూ.87.90తో పోల్చితే 5 శాతం డిస్కౌంట్‌తో ఇష్యూ ధరను ఖరారు చేశామని వివరించింది. వాటా మూలధనంలో 9.96 శాతానికి సమానమైన 23.10

హైదరాబాద్‌ రియల్టీలోకి 10,100 కోట్ల పెట్టుబడులు

Thursday 15th August 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు హైదరాబాద్‌ అభివృద్ధికి చోదకశక్తిగా మారింది. 2015లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2019 తొలి ఆర్ధ సంవత్సరం వరకూ  హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం 10,100 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. 2008–14 మధ్యకాలంలో ఇది రూ.1,800 కోట్లుగా ఉందని జోన్స్‌ లాంగ్‌ లాసెల్లె (జేఎల్‌ఎల్‌) తెలిపింది. ఇందులోనూ 70 శాతం పెట్టుబడులు కార్యాలయాల విభాగమే ఆకర్షించిందని పేర్కొంది. బుధవారమిక్కడ జేఎల్‌ఎల్‌

Most from this category