News


ట్రేడ్‌ డీల్‌పై అమెరికా-చైనాల సంతకాలు

Thursday 16th January 2020
Markets_main1579146349.png-30957

అమెరికా, చైనా మధ్య తొలి దశ డీల్‌
ఎస్‌అండ్‌పీ, డోజోన్స్‌ సరికొత్త రికార్డ్స్‌

ఎట్టకేలకు అమెరికా, చైనా మధ్య వాణిజ్య మైత్రి కుదిరింది.​ ఏడాదిన్నర కాలంగా నలుగుతున్న వాణిజ్య వివాద పరిష్కారంలో భాగంగా బుధవారం రెండు దేశాలూ తొలి దశ డీల్‌పై సంతకాలు చేశాయి. దీంతో బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు తొలుత రివ్వుమన్నాయి. మార్కెట్ల చరిత్రలో తొలిసారి డోజోన్స్‌ 29,000 పాయింట్లను తాకగా.. ఎస్‌అండ్‌పీ సైతం రికార్డ్‌ సృష్టించింది. డోజోన్స్‌ 0.3 శాతం పుంజుకుని 29,030 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ-500 0.2 శాతం బలపడి 3,289 వద్ద స్థిరపడింది. ఇక నాస్‌డాక్‌ నామమాత్ర వృద్ధితో 9,259 వద్ద ముగిసింది. 

డీల్‌ ఇలా
వాణిజ్య వివాద పరిష్కారంలో భాగంగా బుధవారం అమెరికా, చైనా తొలి దశ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. డీల్‌లో భాగంగా రానున్న రెండేళ్ల కాలంలో చైనా అదనంగా కనీసం 200 బిలియన్‌ డాలర్ల విలువైన వ్యవసాయోత్పత్తులను అమెరికా నుంచి కొనుగోలు చేయవలసి ఉంటుంది. 2017లో కొనుగోలు చేసిన 186 బిలియన్‌ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను బేస్‌గా చేసుకుని ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి. డీల్‌లో భాగంగా 120 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై ప్రస్తుతం విధిస్తున్న 15 శాతం టారిఫ్‌లను 7.5 శాతానికి అమెరికా తగ్గించనుంది. డీల్‌ రెండో దశ కోసం త్వరలోనే చర్చలు ప్రారంభించనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. రెండో దశ డీల్‌ కుదిరాక చైనా దిగుమతులపై విధిస్తున్న అదనపు సుంకాలను ఎత్తివేయనున్నట్లు తెలియజేశారు.



You may be interested

ప్రారంభంలోనే సూచీలు కొత్త రికార్డు

Thursday 16th January 2020

సూచీలు గురువారం ఫ్లాట్‌గా మొదలైనప్పటికీ.., ప్రారంభంలోనే కొత్త రికార్డులను అధిగమించాయి. ప్రపంచమార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న  సూచీలు ఫ్లాట్‌ ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 42 పాయింట్లు లాభంతో  41,924.74 వద్ద నిఫ్టీ 5 పాయింట్లు పెరిగి 12,347 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ఆరంభంలోనే కొనుగోళ్లు విరివిరిగా జరగడంతో సూచీలు కొంత సేపటికే రికార్డు స్థాయిని అందుకున్నాయి. ఉదయం గం.9:30ని.కు సెన్సెక్స్‌ క్రితం ముగింపు(41,872)తో పోలిస్తే 133 పాయింట్ల

జనవరి 31 నుంచి బ్యాంకు ఉద్యోగుల రెండు రోజుల సమ్మె

Thursday 16th January 2020

బడ్జెట్‌ రోజుకూ బ్యాంకులు బంద్‌లు బ్యాంకు యూనియన్లు మరోసారి సమ్మెకు సిద్ధమయ్యాయి. జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీన సమ్మె చేయాలని బ్యాంకు యూనియన్లు బుధవారం పిలుపునిచ్చాయి. భారతీయ బ్యాంకుల సంఘం(ఐబీఏ)తో వేతన సవరణపై చర్చలు ముందుకు సాగకపోవడంతో సమ్మెకు పిలుపునిస్తున్నామని తొమ్మిది కార్మిక సంఘాలకు ప్రాతినిధ్య వహిస్తున్న యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌(యుఎఫ్‌బీయూ) ప్రకటించింది. వేతన సవరణను యుఎఫ్‌బీయూ కనీసం 15 శాతం పెంపును కోరుతుంది. 12.25 శాతం వేతనాల

Most from this category