నిర్మల్‌బంగ్ టాప్ రికమండేషన్లు
By Sakshi

ఐసీఐసీఐ బ్యాంకు, ముత్తూట్, మణప్పురం ఫైనాన్స్, ఐనాక్స్ లీజర్ రానున్న 12 నెలల కాలంలో మంచి పనితీరు చూపిస్తాయన్న అంచనాలతో ఉన్నట్టు నిర్మల్‌బంగ్ రీసెర్చ్ హెడ్ గిరీష్పాయ్ తెలిపారు. మార్కెట్లపై ఓ ప్రముఖ వార్తా సంస్థతో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. టెలికం స్టాక్స్.. వచ్చే 12-18 నెలలకు కొనుగోళ్ల అవకాశాలు యస్ బ్యాంకు..
రానున్న కాలంలో ముగ్గురు ప్లేయర్ల మార్కెట్ లేదా ఇద్దరు ప్లేయర్ల మార్కెట్ అవుతుందా అన్నది చూడాలి. ఒకవేళ ముగ్గురితో (ఎయిర్టెల్, జియో, వొడాఐడియా) కూడిన మార్కెట్ ఉండేట్టు అయితే, భారతీ ఎయిర్‌టెల్‌కు ప్రస్తుత స్థాయి నుంచి విలువలో వృద్ధి మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. వొడాఫోన్ ఐడియా బ్యాలన్స్ షీటు పరంగా చూస్తే ఏమంత మంచి పరిస్థితుల్లో లేదు. చార్జీలు పెంచడం వల్ల వొడాఫోన్ ఐడియా దివాలా చర్యల పరిస్థితి నుంచి మరికొన్ని సంవత్సరాలపాటు నిలదొక్కుకునే పరిస్థితికి వెళుతుంది. మూడు నుంచి ఐదేళ్ల కాలం కోసం అయితే భారతీ ఎయిర్‌టెల్‌ను పరిశీలించొచ్చు.
నేను అయితే ఐసీఐసీఐ బ్యాంకుపై ఆశావహంగా ఉన్నాను. ప్రాజెక్టు ఫైనాన్స్ నుంచి బయటకు వచ్చేయాలని బ్యాంకు తీసుకున్న నిర్ణయాన్ని మార్కెట్ తగిన విధంగా గుర్తించలేదని భావిస్తున్నాను. ఇది బ్యాంకు వ్యాల్యూషన్‌ను ఎంతో పెంచే నిర్ణయం. సబ్సిడరీల ద్వారా కూడా బ్యాంకు వ్యాల్యూషన్ పెరగనుంది. ఇన్సూరెన్స్ విభాగంలో సబ్సిడరీ కంపెనీలు మంచి పనితీరు చూపిస్తున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీని కూడా వచ్చే ఏడాది, ఏడాదిన్నర కాలంలో లిస్ట్ చేసే పరిస్థితి ఉంది. ఇది విలువను సంతరించి పెడుతుంది. గత కొన్ని త్రైమాసికాలుగా ఆస్తుల నాణ్యత మంచి నియంత్రణలతో కొనసాగుతోంది. ఇక మిడ్‌క్యాప్ విభాగంలో బంగారం రుణ కంపెనీలు ముత్తూట్, మణప్పురంపై ఆశావహంగా ఉన్నాం. ఇవి 12 శాతం, 18 శాతం మేర ఆస్తుల నిర్వహణను పెంచుకుంటున్నాయి. ఆర్వోఏ సైతం 5-6 శాతం మధ్య ఉంటోంది. ఇవి ఈ స్థాయి నుంచి ఎంతో పెరిగేందుకు అవకాశం ఉంది. స్మాల్‌క్యాప్ విభాగంలో ఐనాక్స్ లీజర్ పట్ల బుల్లిష్‌గా ఉన్నాం. చైనాలో 60వేల వరకు మల్టీప్లెక్స్ స్క్రీన్లు ఉండగా, మన దేశంలో ఇవి 3,000 వరకే ఉన్నాయి. ఈ స్థాయి నుంచి వృద్ధికి ఎంతో అవకాశం ఉంది.
యస్ బ్యాంకు విషయంలో పెట్టుబడులకు మేము అయితే ఇప్పుడేమీ తొందరపడడం లేదు. నిధుల సమీకరణను చేపడతారా, లేదా అన్నది వేచి చూడాలి. ఒకవేళ నిధులు సమీకరించలేకపోతే తిరిగి స్టాక్ మళ్లీ రూ.30లోపునకు వెళ్లిపోవచ్చు. దాంతో మరోసారి బ్యాంకు నిలదొక్కుకుంటుందా? అన్న సందేహాలు తలెత్త్తుతాయి. సింగిల్ డిజిట్‌కు పడిపోయే పరిస్థితిని చూడొచ్చు. ఒకవేళ నిధులు పొందగలిగితే, ఆస్తుల నాణ్యత పరంగా పురోగతి ఎలా ఉంటుందన్నది చూడాలి. బ్యాంకు వాచ్‌లిస్ట్‌లో రూ.30,000 కోట్ల రుణాలున్నాయి. వీటి కోసం ఎంత మేర కేటాయింపులు చేయాల్సి ఉంటుంది? అన్నది చూడాలి. నిధులు పొందగలిగితే మాత్రం బ్యాంకు నిలబడుతుంది.
You may be interested
మరిన్ని సంస్కరణలకు సిద్ధంగా ఉన్నాం
Wednesday 4th December 2019మరిన్ని సంస్కరణలకు సిద్ధంగా ఉన్నాం భారత్‌ను పెట్టుబడులకు గమ్యస్థానం చేయడమే లక్ష్యం బ్యాంకింగ్, మైనింగ్ తదితర రంగాల్లో చర్యలుంటాయ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ: భారత్‌లో తయారీ కోసం, పెట్టుబడులకు భారత్‌ను ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కార్పొరేట్ పన్ను తగ్గింపు సహా ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నట్టు ఆమె గుర్తు చేశారు. మంగళవారం ఢిల్లీలో
క్వాలిటీ మిడ్‌క్యాప్స్ ర్యాలీ త్వరలో: కోటక్
Wednesday 4th December 2019రానున్న త్రైమాసికాల్లో కంపెనీల ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఉండడంతోపాటు ఆదాయాలు కూడా మెరుగుడాల్సిన అవసరం ఉందన్నారు కోటక్ సెక్యూరిటీస్‌కు చెందిన పీసీజీ బిజినెస్ హెడ్ ఆశిష్నందా. స్థిరమైన రికవరీ అంచనాలతో 2020లో మార్కెట్ గమనం ఆశాజనకంగా ఉందన్నారు. వాస్తవానికి దేశ ఆర్థిక వ్యవస్థ 2011 నుంచి మందగమనం ఎదుర్కుంటోందని, ప్రభుత్వం, ఆర్బీఐ ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. బ్యాంకుల ప్రక్షాళన, బ్యాంకింగ్ రంగంలో తగినంత లిక్విడిటీ