News


బాండ్‌ ఈటీఎఫ్‌లు కొంటారా? ఇవి గమనించండి!

Wednesday 4th December 2019
personal-finance_main1575452585.png-30053

దేశీయ తొలి కార్పొరేట్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ లాంచింగ్‌కు ప్రభుత్వం బుధవారం అనుమతినిచ్చింది. దీంతో ఇకపై రిటైల్‌ ఇన్వెస్టర్లు దేశీయ బాండ్‌ మార్కెట్లో పాలుపంచుకోవచ్చు. బాండ్‌ జారీల ద్వారా ప్రభుత్వ సంస్థలకు నిధులు సమకూర్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌లకు ఆమోదం తెలిపింది. ఈ బాండ్స్‌లో మూడు, పదేళ్ల కాలపరిమితి రకాలున్నాయి.

బాండ్‌ ఈటీఎఫ్‌ల గురించి మరిన్ని వివరాలు...
= స్టాక్‌ ఎక్చేంజ్‌ల్లో వీటిని లిస్ట్‌ చేస్తారు.
= వీటిలో ఏఏఏ-, ఏఏ- రేటింగ్‌ ఉన్న పీఎస్‌యూ సెక్యూరిటీస్‌ ఉంటాయి.
= బ్యాంకు ఎఫ్‌డీల కన్నా కొంచెం ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంది. 
= పదేళ్ల ప్రభుత్వ బాండ్స్‌ కన్నా ఇవి మరో 50- 140 బీపీఎస్‌ అధిక రాబడినిస్తాయి.
= వీటిలో కేవలం గ్రోత్‌ ఆప్షన్‌ మాత్రమే ఉన్నాయి. డివిడెండ్‌ ఆప్షన్‌ లేదు.
= వీటిని నిర్వహిస్తున్న ఎడెల్‌వీజ్‌ ఏఎంసీ ఏడాదికి రెండు దఫాలు వీటిలో సబ్‌స్క్రిప్షన్‌కు విడుదల చేస్తుంటుంది. 
= వీటిలో కనీస పెట్టుబడి మొత్తం రూ.1000.



You may be interested

మెటల్‌ షేర్లకు డిమాండ్‌

Wednesday 4th December 2019

అనూహ్యంగా అమెరికా చైనాల మధ్య చర్చలు సఫలవంతం కావచ్చనే వార్తలు మార్కెట్‌ చివరి గంటలో తెరపైకి రావడంతో మెటల్‌ షేర్లలో కొనుగోళ్ల పర్వం నెలకొంది. దీంతో ఉదయం నుంచి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్న మెటల్‌ షేర్లు ఒక్కసారిగా లాభాల పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఇంట్రాడే కనిష్టం నుంచి 100పాయింట్లు(4శాతం) మేర పెరిగింది. నేడు ఇండెక్స్‌ 2,536.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్లో నెలకొన్న అమ్మకాల

టాటామోటర్స్‌కు జేఎల్‌ఆర్‌ అమ్మకాల జోష్‌

Wednesday 4th December 2019

6.50శాతం ర్యాలీ చేసిన షేరు అమెరికాలో లాండ్‌ రోవర్‌ నవంబర్‌ మొత్తం అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించడంతో ...మాతృసంస్థ టాటా మోటర్స్‌ షేరు బుధవారం మిడ్‌సెషన్‌ కల్లా 6.50శాతం లాభపడింది. టాటామోటర్స్‌ అనుబంధ, బ్రిటన్‌ ఆధారిత కార్ల తయారీ సంస్థ జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌ ఈ అక్టోబర్‌ అమ్మకాలతో పోలిస్తే ఈ నవంబర్‌లో 19.4శాతం వృద్ధిని సాధించింది.  వార్షిక ప్రాతిపాదిన చూసినట్లైతే.. గతేడాది నవంబర్‌లో విక్రయించిన 11,744 యూనిట్లుతో పోలిస్తే ​

Most from this category