News


సిమెంట్‌, రియల్‌ ఎస్టేట్‌లో ఈ స్టాకులు బెటర్‌!

Thursday 12th September 2019
Markets_main1568274911.png-28335

-ఐటీలో సాఫ్ట్‌వేర్‌ స్టాక్స్‌పై జాగ్రత్త..
-సిమెంట్‌, మెటల్‌ షేర్లు మంచి ప్రదర్శనను చేయగలవు: దీపాన్‌ మెహతా

స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ షేర్లు మరి కొన్ని సెషన్‌ల వరకు అద్భుతమైన ప్రదర్శనను చేస్తాయని ఎలిక్సిర్ ఈక్విటీస్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ దీపాన్ మెహతా ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యులోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే..

స్మాల్‌, మిడ్‌క్యాప్‌ షేర్ల ర్యాలీ కొనసాగుతుంది..
గత కొన్ని సెషన్‌లను గమనిస్తే స్మాల్‌క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ స్టాకులలో కొనుగోలు పెరిగాయి. అధిక స్థాయిల వద్దయిన వీటిని కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. భారీగా పడిపోయిన ఆటో, బ్యాంక్‌, కమోడిటీ స్టాకులు ప్రస్తుతం అద్భుత ప్రదర్శనను చేయడం గమనించవచ్చు. ఇవన్ని స్మాల్‌క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ స్టాకులు వచ్చే మరికొన్ని సెషన్‌ల వరకు అద్భుత ప్రదర్శనను చేస్తాయనే సంకేతాలనిస్తున్నాయి.      ప్రస్తుతం మార్కెట్‌ బాటమ్‌ స్థాయిలో ఉన్నట్టు అనిపిస్తోంది. ఇది మార్కెట్‌కు బాటమా? ఇక్కడ నుంచి మార్కెట్‌ బుల్లిష్‌గా మారుతుందా? లేకపోతే ఇంకా కనిష్ఠ స్థాయిల కోసం వేచి చూడాలా? అనే విషయాలు వచ్చే కొన్ని సెషన్‌లలో తేలుస్తాయి.  ప్రస్తుతానికయితే బేర్‌మార్కెట్‌ ముగిసినట్టనిపిస్తోంది.   ప్రస్తుతం మనం ఒక కీలకమైన దశలో ఉన్నాం. వచ్చే ఆరు వారాలలో ఫలితాల సీజన్‌ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మానేజ్‌మెంట్‌ కామెంటరీ దృక్పథం ప్రకారం ఈ సీజన్‌ చాలా ముఖ్యమైనది.

మెటల్‌ స్టాకులలో ఇవి బాగున్నాయి..
కమొడిటీ స్టాకులపై మరీ అంతా పాజిటివ్‌గా లేనప్పటికి, ట్రేడ్‌వార్‌ వలన దేశియ, అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం చోటుచేసుకోవడంతో ఈ కంపెనీల స్టాకులు చాలా వరకు దిద్దుబాటుకు గురయ్యాయి. కానీ కమొడిటీ స్టాకులు సైక్లికల్‌ స్టాకులు. ఒక పాయింట్‌ వద్ద ఈ స్టాకుల ధరలు స్థిరపడి తిరిగి పుంజుకుంటాయి. అది 12, 24 నెలల కనిష్ఠ స్థాయి కావచ్చు లేకపోతే అంతకన్నా ముందే తిరిగి పుంజుకోవచ్చు. ఒకసారి కమొడిటీ ధరలు తిరిగి పుంజుకుంటే చాలా వరకు కమొడిటీ స్టాకులు మంచి ప్రదర్శన చేయగలవు.

   ప్రస్తుత స్థాయి నుంచి అప్‌మూవ్‌ ఉంటే వచ్చే మూడేళ్ల కాలంలో చాలా వరకు కమొడిటీ స్టాకులు 70 శాతం నుంచి 100 శాతం వరకు రిటర్న్‌లను ఇవ్వగలవు. ప్రస్తుతం ఉన్న స్థాయిల వద్ద మెటల్‌ షేర్లను విక్రయించకపోవడం మంచిది. దిద్దుబాటు ఉన్నప్పటికి కొన్ని మెటల్‌ పోర్టుపోలియో షేర్లు అండర్‌వెయిట్‌గా అనిపిస్తే లార్జ్‌ మెటల్‌ కంపెనీల షేర్లను పరిశీలించవచ్చు. స్టీల్‌ కంపెనీలకు సంబంధించి టాటా స్టీల్‌ లేదా జేఎస్‌డబ్యూ పై మా ప్రాధాన్యత ఉంది. ఎం అండ్‌ ఏ (మెర్జర్స్‌ అండ్‌ అక్వజేషన్‌) చర్య జరుగుతుండడం వలన నాల్కో(నేషనల్‌ అల్యూమినియం కార్పోరేషన్‌) ఆదాయాలు దీర్ఘకాలంలో ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఫలితంగా నోల్కో కన్నా హిందల్కో అల్యుమినియం షేర్లను పరిశీలించవచ్చు.

రియల్‌ఎస్టేట్‌లో ఈ నాలుగు కంపెనీలు..
రియల్‌ఎస్టేట్‌ షేర్లు బాటమ్‌ స్థాయిలను తాకినట్టనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్థికవ్యవస్థకు సంబంధం ఉన్న సిమెంట్‌ వంటి రంగాలు ముందుకు వెళ్లే కొద్ది మంచి ప్రదర్శన చేసే అవకాశం ఉంది. కోల్టీపటిల్‌, ప్రెస్టేజి ఎస్టేట్స్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ వంటి కంపెనీలు, మంచి ఫలితాలను ప్రకటించాయి కూడా. ఆర్థిక విభాగానికి చెందనప్పటికి డీఎల్‌ఎఫ్‌ను కూడా బాగుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఇన్వెస్ట్‌చేయాలనుకునే వాళ్లు ఈ మూడు-నాలుగు కంపెనీలను పరిశీలించవచ్చు. ల్యాండ్‌ బ్యాంక్‌ను అభివృద్ధి చేయడం కన్నా అమ్మకాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం, ధర పరంగా మంచి స్థాయిలో ఉండడం వంటి అంశాల వలన ఈ కంపెనీల బ్యాలెన్స్‌ షీట్‌లు బాగున్నాయి. ముందుకు వెళ్లే కొద్ది ఈ కంపెనీల స్టాకులు అద్భుత ప్రదర్శన చేస్తాయని అంచనా వేస్తున్నా.

ఐటీ రంగానికి కష్టకాలమే..
బేర్‌ మార్కెట్లో ఐటీ కంపెనీలు మంచి ‍ప్రదర్శనను చేశాయి. కనీసం ఇన్వెస్టర్ల మూలధనాన్నైనా కాపాడగలిగాయి. ఐటీ కంపెనీలలో చాలా వరకు కంపెనీలు వినియోగా ఆధారిత కంపెనీలు. ఇవి బేర్‌ మార్కెట్‌లో 8 శాతం నుంచి 10 శాతం వరకు ఆదాయం, లాభాలలో వృద్ధిరేటు కలిగిఉన్నాయి. ఇది బేర్‌మార్కెట్‌లో చాలా మంచి ప్రదర్శన కానీ ఒక వేళ బుల్‌ మార్కెట్‌ ప్రారంభమయితే ఐటీ కంపెనీల అండర్‌ ఫెర్ఫర్మెన్స్‌ చేయడం చూస్తాం. 
  అంతర్జాతీయ పరిణామాల వలన ఐటీ కంపెనీలు బాగా దెబ్బతింటున్నాయి. ఐటీ కంపెనీల మేనేజ్‌మెంట్‌ కామెంటరీ పాజిటివ్‌గా ఉన్నప్పటికి గతంలో పరిణామాలను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. గతంలో యుఎస్‌ ఆర్థిక వృద్ధి తగ్గినప్పుడు ఐటీ కంపెనీలు ఏవిధంగా ప్రభావితమయ్యాయో తెలిసిందే. ఇందులో కూడా తయారి, రిటైల్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌ సర్వీసులను అందించే ఐటీ కంపెనీలు మిగిలిన ఐటీ కంపెనీల కంటే అధింగా ఒత్తిడికి లోనయ్యాయి. సాఫ్ట్‌వేర్‌ స్టాకులపై కొద్దిగా జాగ్రత్తను వహించడం మంచిది. ఒక వేళ మార్కెట్‌ బుల్లిష్‌గా మారుతుందని నేను నమ్మినట్టయితే, ఐటీ స్టాకులపై అండర్‌వెయిట్‌ను కొనసాగిస్తు, ఇతర సైక్లికల్‌ స్టాకులపై ఓవర్‌వెయిట్‌ కలిగి ఉంటాను.

సిమెంట్‌ స్టాక్స్‌ బెటర్‌!
సిమెంట్‌ సెక్టార్‌కు సంబం‍ధించి పాజిటివ్‌గా ఉన్నాం. ఈ సెక్టార్‌ ఒక సైక్లికల్‌ సెక్టార్‌. అంతేకాకుండా ఈ రంగంలోని కంపెనీల ధరల నిర్వహణ, గత త్రైమాసికంలో తగ్గిన వాల్యుమ్‌ వృద్ధి కూడా ఈ రంగంపై పాజిటివ్‌గా ఉండడానికి కారణం మయ్యాయి. ప్రభుత్వం మౌలిక రంగానికి అధికంగా ఖర్చు పెట్టడానికి సిద్ధపడడంతో ఈ రంగం లాభపడే అవకాశం ఉం‍ది. డిమాండ్‌ పెరుగుదల అవకాశాలను అందిపుచ్చుకోడానికి ఈ రంగానికి సామర్ధ్యం ఉం‍ది. సిమెంట్‌ విభాగంలో పెద్ద కంపెనీలయిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌, అల్సమ్‌ శ్రీ సిమెంట్‌ కంపెనీలను పరిశీలించవచ్చు. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, సెంచ్యూరి సిమెంట్‌ యూనిట్‌లను విలీనం చేసుకోవడంతో లాభపడనుంది. అల్సమ్‌ శ్రీ సిమెంట్‌ తక్కువ క్యాపిటల్‌ ఖర్చుతో కొత్త సిమెంట్‌ ప్లాంట్‌లను ఏర్పాటు చేయనుం‍ది. సిమెంట్‌ రంగానికి సంబం‍ధించినంత వరకు ఈ రెండు కంపెనీలలో ఏ కంపెనీ అయిన మంచి రిటర్న్‌లను ఇవ్వగలవు.



You may be interested

మార్కెట్‌ పతనంలోనూ ‘‘సిప్‌’’ ఆపలేదు.

Thursday 12th September 2019

మార్కెట్‌ పతనంలోనూ రీటైల్‌ ఇన్వెస్టర్లు ‘‘సిప్‌’’లు కట్టడం ఆపలేదు. జాతీయ, అంతర్జాతీయంగా ప్రతికూలతలతో గత కొద్దినెలలుగా ఈక్విటీ మార్కెట్‌ ఒడిదుడుకులకు లోనైప్పటికీ., మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి ‘‘సిప్‌’’ల ద్వారా స్థిరమైన ప్రవాహాలొచ్చాయి. ఈ సిప్‌ ప్రవాహాల్లో అధిక మొత్తం రీటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి, మెట్రో నగరాలు బయటి ప్రాంతాలైన బీ-30 నగరాలను నుంచి వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. మార్కెట్లో అస్థిరత నెలకొన్నప్పటికీ వారు పెట్టుబడులను కొనసాగించడంలో సహనాన్ని చూపినట్లు ఇండస్ట్రీ వర్గాలు

పోస్టాఫీస్‌ డిపాజిట్లకు పెరుగుతున్న డిమాండ్‌

Thursday 12th September 2019

ఇటీవల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పోస్టాఫీస్‌ డిపాజిట్లు, ప్రభుత్వబాండ్ల వైపు మళ్లిస్తున్నారు. బ్యాంకుల  పిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లు 7శాతానికి దిగువకు చేరుకోవడం ఇందుకు కారణమవుతోంది. రానున్న రోజుల్లో వడ్డీరేట్లు మరింత తగ్గవచ్చనే అంచనాలతో పెట్టుబడిదారులు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలకు బదులుగా ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు. అగ్ర బ్యాంకులు తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రేట్లపై సరాసరి అరశాతం నుంచి 1శాతం మేర కోత విధించడంతో 6.5-7.1 శాతానికి పరిమితయ్యాయి. ఇదేకాలంలో పోస్టాఫీస్‌ డిపాజిట్లు, ప్రభుత్వబాండ్లపై

Most from this category