News


మార్కెట్‌ను ముందుకు నడిపించే మూడు అంశాలు!

Thursday 13th February 2020
Markets_main1581569836.png-31752

దేశీయ మార్కెట్లు బడ్జెట్‌ రోజు పతనం అనంతరం వీ ఆకారపు రికవరీని వేగంగా సాధించాయి. కానీ 12200 పాయింట్ల వద్ద నిఫ్టీ నిరోధం ఎదుర్కొంటోంది. దీంతో ఇకపై నిఫ్టీ ర్యాలీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఈ సందేహాలు నిరర్ధకమని, నిఫ్టీ సమీప భవిష్యత్‌లో ముందుకే దూసుకుపోతుందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ అనలిస్టు పంకజ్‌ బోబ్డె భరోసా ఇస్తున్నారు. లాంగ్‌టర్మ్‌కు సైతం సూచీలు ముందుకే కొనసాగుతాయని, మధ్యలో కొంత చిన్న పాటి కరెక‌్షన్స్‌ వచ్చినా పరుగులు ఆగవని అభిప్రాయపడ్డారు. ఇందుకు మూడు అంశాలు దోహదం చేస్తాయని చెప్పారు. 
- ఎర్నింగ్స్‌ గ్రోత్‌: దేశీయ కంపెనీలు చాలా త్రైమాసికాల అనంతరం క్యు3లో మెరుగైన ఫలితాలు ప్రకటించాయి. కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపు తదితర సంస్కరణలు ఫలితాలిస్తున్నాయి.
- డిమాండ్‌ గ్రోత్‌: గ్రామీణ ఎకానమీలో క్రమానుగత రికవరీతో నెమ్మదిగా వినిమయాధారిత డిమాండ్‌ ఊపందుకుంటోంది. ఎకానమీలో కొనుగోళ్లు పెరుగుతున్నాయి. 
- బడ్జెట్‌, ఆర్‌బీఐ: బడ్జెట్లో ప్రకటించిన డీడీటీ ఎత్తివేత, ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు ధోరణి... ఎకానమీలో లిక్విడిటీ పెంచేందుకు, మందగమనాన్ని నివారించేందుకు ఉపయోగపడతాయి. తద్వారా వృద్ధి పెరుగుదల ఉంటుంది. 
ఎకానమీలో రికవరీ కనిపిస్తోందని, దీర్ఘకాలంలో మార్కెట్‌ ముందుకే కొనసాగుతుందని బోబ్డె చెప్పారు.



You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Thursday 13th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు డీమార్ట్‌: డీ మార్ట్‌ మాతృ సంస్థ ఎవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ 2.27 శాతం వాటాను విక్రయించనున్నట్లు వెల్లడించింది.  జీఐసీ : రష్యాలో వ్యాపారం చేసేందుకు లైసెన్సును పొందినట్లు జనరల్‌ ఇన్సురేన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తెలపింది.  టాటా కెమికల్స్‌: వేరే కంపెనీల నుంచి 1.08 వాటాను కొనుగోలు చేయడం ద్వారా టాటా సన్స్‌  వాటా 25.26 శాతం పెరగనున్నట్లు టాటా కెమికల్స్‌ వెల్లడించింది.

నిఫ్టీ 12వేల దిగువకు రాదు!

Thursday 13th February 2020

ఎఫ్‌అండ్‌ఓ అనలిస్టుల అంచనా నిఫ్టీ ఈ సీరిస్‌లో 12వేల దిగువకు రాకపోవచ్చని ఎఫ్‌అండ్‌ఓ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అందువల్ల కొంచెం రిస్కు తీసుకోగల ఇన్వెస్టర్లు ఈ నెల అవుట్‌ ఆఫ్‌ ద మనీ(ఓటీఎం) నిఫ్టీపుట్స్‌ను విక్రయించవచ్చని సూచిస్తున్నారు. పుట్‌ కాల్‌ నిష్పత్తి(పీసీఆర్‌) పెరుగుతుండడం, ఆప్షన్‌ ఐవీలో క్షీణత పరిశీలిస్తే నిఫ్టీ పుట్‌ విక్రయం మంచి లాభాలనిస్తుందని అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీ సాధ్యమైతే అప్‌మూవ్‌ చూపడం లేదా స్తబ్దుగా ఉండడమే జరుగుతుందని, 12000 పాయింట్ల

Most from this category