News


తగ్గిన ద్రవ్యోల్బణం..బలపడిన రూపీ

Wednesday 14th August 2019
Markets_main1565758628.png-27748

ఇంధన ధరలు తగ్గడంతో జులై నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గి 3.15 శాతంగా నమోదయ్యింది. ఫలితంగా రూపీ డాలర్‌ మారకంలో 47 పైసలు బలపడి బుధవారం ట్రేడింగ్‌లో 70.93 వద్ద ప్రారంభమైంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండడంతో అక్టోబర్‌లో ఆర్‌బీఐ ఇంకోసారి వడ్డీ రేట్లను తగ్గించడానికి వీలు కలుగుతుందని విశ్లేషకులు తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణం 2019 జూన్‌లో 3.18 శాతంగా ఉండగా, గత ఏడాది (జూలై 2018) ఇదే కాలంలో ఇది 4.17 శాతంగా ఉండడం గమనార్హం. గత మొత్తం సెషన్‌లో తక్కువ పరిధిలో ఏకీకృతమైన రూపీ, చివరి గంటలో డాలర్‌ మారకంలో బలహీనపడింది. చైనా తన కరెన్సీ యువాన్‌ విలువను తగ్గించుకోవడంతో ఆ ప్రభావం ఇండియా రూపీపై పడుతోంది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు నష్టపోవడంతో పాటు, అర్జెంటీనా కరెన్సీ క్రాష్‌ అవ్వడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 62 పైసలు బలహీనపడి 71.40 వద్ద ముగిసింది. 
  ఈ రోజు రూపీ డాలర్‌ మారకంలో 70.70 నుంచి 71.50 పరిధిలో కదలాడవచ్చని బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక నివేదికలో తెలిపింది. యుఎస్‌ హాలిడే అమ్మకాలలో చైనా వస్తువుల ప్రభావాన్ని తగ్గించాలని, మిగిలిన చైనా దిగుమతులపై విధించాలనుకున్న 10 శాతం సుంకం గడువు సెప్టెంబర్ 1ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వాయిదా వేయడంతో గత సెషన్లో డాలర్‌ బలపడింది. ట్రంప్ 10 శాతం సుంకాలు డిసెంబర్ 15 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.



You may be interested

60 డాలర్ల పైకి చమురు

Wednesday 14th August 2019

గత సెషన్లో 3 శాతం మేర పెరిగిన చమురు ధరలు బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఉదయం 10.41 సమయానికి 0.85 శాతం తగ్గి బ్యారెల్‌కు 60.78 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 1.10 శాతం తగ్గి బ్యారెల్‌కు 56.47 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. యుఎస్‌ చైనా దిగుమతులపై విధిస్తానన్న టారిఫ్‌ జాబితా నుంచి కొన్ని ఉత్పత్తులను మినహాయించడంతో, వాణిజ్య యుద్ధ భయాలు కొం‍త సరళతరం అయ్యాయనే అంచనాల

గరిష్టస్థాయిల వద్ద పసిడిలో లాభాల స్వీకరణ

Wednesday 14th August 2019

కిత్రం ట్రేడింగ్‌ సెషన్‌లో గరిష్టస్థాయిని అందుకున్న పసిడి ఫ్యూచర్లో లాభాల స్వీకరణ చేటుచేసుకుంది. హాంగ్‌కాంగ్‌ ఉద్రికత్తలు, అర్జెంటీనా రాజకీయ సంక్షోభం, అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుండటం తదితర కారణాలో నిన్నటి ట్రేడింగ్‌లో ప్రపంచమార్కెట్లో పసిడి ధర 1,546 డాలర్ల వద్ద గరిష్టస్థాయిని తాకింది. అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్జైజర్, ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్ మునుచిన్‌లు చైనా వైస్ ప్రీమియర్ లియు హితో వాణిజ్య చర్చలు జరిపినట్లు ప్రకటించారు.

Most from this category