News


నిఫ్టీ 11,042ను దాటింది... తర్వాత ఎటు?

Thursday 12th September 2019
Markets_main1568268078.png-28332

స్టాక్‌ మార్కెట్లు ఈ వారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 50 11,000 స్థాయికి పైన ప్రారంభమవ్వగా, ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 37,000 పాయింట్ల స్థాయిని అధిగమించింది. నిఫ్టీ తన 5, 13, 20-రోజుల ఈఎంఏ(ఎక్సోపోనెన్సియల్‌ మూవింగ్‌ యావరేజ్‌) సగటుల కంటే పైన ట్రేడవుతోంది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.97 శాతం, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.92 శాతం పెరిగాయి. నిఫ్టీ 50 తన కీలక నిరోధ స్థాయి 11,042 ను గురువారం ట్రేడింగ్‌లో అధిగమించింది. తర్వాత నిఫ్టీ ఎటువైపు కదలనుందో (నిపుణుల అంచనా ప్రకారం) ఈ క్రింద ఇవ్వబడింది..

సాంకేతికంగా..
నిఫ్టీ 50 రోజువారి చార్టులో బుల్లిష్‌ క్యాండిల్‌ నమూనాను ఏర్పాటుచేసిందని సాంకేతిక విశ్లేషకులు తెలిపారు. ఈ ఇండెక్స్‌ తన 21 రోజుల ఈఎంఏ(ఎక్సోపోనెన్సియల్‌ మూవింగ్‌ యావరేజ్‌) కంటే పైన ముగిసి రోజువారీ చార్టులో బుల్లిష్‌ క్యాండిల్‌ నమూనాను ఏర్పాటు చేసిందని, ఫలితంగా వచ్చే కొన్ని సెషన్‌లలో మార్కెట్‌లో బుల్స్‌ ఆధిపత్యం కొనసాగవచ్చని తెలిపారు. గత మూడు సెసన్‌లను నుంచి నిఫ్టీ 50 అధిక స్ధాయిలను, అల్ప స్టాయిలను తాకిందని, మద్దతు స్థాయి అధిక స్థాయిల వైపు క్రమంగా మారుతుందని విశ్లేషకులన్నారు. ఈ ఇండెక్స్‌ ఒకవేళ 11,042 నిరోధ స్థాయిని అధిగమిస్తే తర్వాత 11,150-11,200 వరకు బలమైన ర్యాలీ జరగవచ్చని నిపుణులు వివరించారు. 10,889, 11,028 మద్ధతు స్థాయిలుగా పనిచేయగా, 11,200 వద్ద నిరోధం ఎదుర్కోవచ్చు. 
గరిష్ఠంగా కాల్‌ ఓఐ(ఓపెన్‌ ఇంట్రస్ట్‌): 11,200-11,500
గరిష్ఠంగా పుట్‌ ఓఐ: 10,800, 10,600 

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సిఫార్సులు:
ర్యాలీస్‌ ఇండియా: కొనచ్చు | ఎల్‌టీపీ(తాజా ధర) : రూ .166.5 | టార్గెట్‌ ధర : రూ .185 | స్టాప్‌ లాస్‌: రూ .155 | అప్‌సైడ్‌ ర్యాలీ 11 శాతం
యునైటెడ్ స్పిరిట్స్: కొనచ్చు | ఎల్‌టీపీ: రూ 617 | టార్గెట్‌ ధర : రూ 675 | స్టాప్‌ లాస్‌ : రూ 588 | అప్‌సైడ్‌ 9 శాతం
సిమెన్స్: కొనచ్చు | ఎల్‌టీపీ: రూ .1,219 | టార్గెట్‌ ధర : రూ 1,300 | స్టాప్‌ లాస్‌ : రూ .1,170 | అప్‌సైడ్‌ 7 శాతం



You may be interested

స్థిరంగా పసిడి ధర

Thursday 12th September 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర గురువారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ద ఉద్రికత్తలు స్వల్పంగా తగ్గుముఖం పట్టడం, నేడు యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ సమావేశం జరుగున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం పసిడి స్థిరమైన ట్రేడింగ్‌కు కారణమవుతున్నాయి. అలాగే డాలర్‌ ఇండెక్స్‌ ఆరువారాల గరిష్టం వద్ద కదలాడుతుండటం సైతం  పసిడి ర్యాలీకి అడ్డంకిగా మారింది. నేడు ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర

71.43 వద్ద రూపీ ప్రారంభం​

Thursday 12th September 2019

ఆసియా ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవుతుండడం, ప్రపంచ ముడి చమురు ధరలు పెరుగుదల మధ్య రూపీ డాలర్‌ మారకంలో గురువారం 23 పైసలు బలపడి 71.43 వద్ద ప్రారంభమైంది. కానీ కొద్ది సమయంలోనే రూపీ డాలర్‌మారకంలో 30 పైసలు కొల్పోయి ట్రేడవుతోంది. దేశియ ఈక్విటీ మార్కెట్లు, చైనా కరెన్సీ యువాన్‌ బలపడడంతో బుధవారం రూపీ డాలర్‌ మారకంలో 5 పైసలు బలపడి 71.66 వద్ద స్థిరపడింది.     దేశీయ స్టాక్‌మార్కెట్లలో పెరుగుదల

Most from this category