టారిఫ్ దెబ్బ పెద్దదేం కాదు-ప్రభుత్వ వర్గాలు
By Sakshi

ఇతర దేశాలతో పోలిస్తే మనవద్ద చార్జీలు తక్కువే... టారిఫ్‌ల పెంపుతో టెలికం ఆపరేటర్రలకు నెలనెలా దాదాపు రూ.36వేల కోట్ల మేర లబ్ది చేకూరుతుందని అంచనా. సుప్రీం కోర్టు ఏజీఆర్‌పై ఇచ్చిన తీర్పుతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న టెల్కోలు మరింత ఆందోళనలోకి జారాయి. దీంతో ఆదాయాలు పెంచుకునేందుకు టారిఫ్‌లను పెంచుకున్నాయి. జనవరి చివరకు సుప్రీం తీర్పు ప్రకారం కంపెనీలు బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ తీర్పుపై టెల్కోలు రివ్యూకు వెళ్లాయి. దీనిపై ఉపశమనం లభిస్తే టెలికం కంపెనీలు మరింత కోలుకుంటాయని నిపుణుల అంచనా.
ప్రభుత్వ వాదన
చార్జీలు పెంచిన తర్వాత కూడా ప్రపంచంలో అత్యంత చౌకగా డేటా, వాయిస్ కాల్స్ ఇండియాలోనే లభిస్తున్నాయని, నాలుగేళ్ల క్రితం చార్జీలతో పోలిస్తే తాజా చార్జీలు చాలా తక్కువని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానించాయి. తాజాగా మూడు టెలికం ఆపరేటర్లు దాదాపు 40 శాతం మేర టారిఫ్‌లు పెంచిన సంగతి తెలిసిందే. దేశ టెలికం చరిత్రలో ఇది అత్యంత భారీ పెరుగుదల. ఇంతగా చార్జీలు పెంచడంపై కస్టమర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం మన దగ్గర టెలికం చార్జీలు చాలా తక్కువని అభిప్రాయపడింది. పెంపుదల తర్వాత సరాసరిన ఒక జీబీ డేటా ఖరీదు రూ. 16.49కి చేరవచ్చని అంచనా. ఇది ప్రపంచంలోనే తక్కువ సరాసరి ధరని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. మార్చిలో సరాసరి అవుట్గోయింగ్ కాల్ ధర 13 పైసలుండగా, తాజా పెంపుతో ఇది 18 పైసలకు చేరింది. 2014లో ఒక జీబీ సరాసరి ధర రూ. 268.97 ఉండేదని ప్రసార శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఒక ట్వీట్లో వెల్లడించారు. యూకేకి చెందిన కేబుల్ సంస్థ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో చౌకైన చార్జీలు మనవద్దే ఉన్నాయన్నారు. ట్రాయ్ ప్రకారం మన వద్ద ఒక జీబీ ధర రూ. 11.78 మాత్రమేనన్నారు.
You may be interested
పసిడి అక్కడక్కడే ..
Tuesday 3rd December 2019అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చల్లో భాగంగా తొలి దశ దాదాపు ఖరారయ్యే దశలో ఉన్నాయనే అంచనాలతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర మంగళవారం ఉదయం సెషన్లో 3డాలర్ల మేర నష్టపోయింది. ఆసియాలో ఔన్స్ పసిడి 3డాలర్ల నష్టంతో 1,466డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ ఏడాది చివరికల్లా చైనాతో ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీనియర్ సలహాదారు కెల్లియాన్ కాన్వే తెలిపారు.మరోవైపు అమెరికా చైనాల
పాజిటివ్ ప్రారంభం
Tuesday 3rd December 2019అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నా, మంగళవారం భారత్ స్టాక్ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 80 పాయింట్ల లాభంతో 40,852 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 12,067 పాయింట్ల వద్ద మొదలయ్యాయి.