News


మార్కెట్లోకి ‘టియాగో జేటీపీ, టిగోర్‌ జేటీపీ’

Thursday 15th August 2019
news_main1565852795.png-27784

న్యూఢిల్లీ: దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్‌, కోయంబత్తూరుకు చెందిన జయం ఆటోమోటివ్స్‌ భాగస్వామ్యంలో టియాగో జేటీపీ, టిగోర్‌ జేటీపీ నూతన వెర్షన్‌ కార్లు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఇరు సంస్థల జాయింట్‌ వెంచర్‌ జేటీ స్పెషల్‌ వెహికల్స్‌ (జేటీఎస్‌వీ) ఈ కార్లను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీటి ధరల శ్రేణి రూ.6.69 లక్షల నుంచి రూ.7.59 లక్షలుగా ప్రకటించింది. ఈ అధునాత వెర్షన్లలో ఆటో-ఫోల్డ్‌ వెలుపల అద్దాలు, పూర్తిస్థాయి ఆటోమేటిక్ ఉష్ణోగ్రత నియంత్రణ విధానం.. ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్ కార్‌ప్లే యాప్‌ల ఆధారంగా పనిచేసే కనెక్ట్‌ నెక్స్ట్‌ టచ్ స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నట్లు వివరించింది. స్పోర్టి అనుభూతి, మెరుగైన పనితీరు, మరింత సౌకర్యం ఈ అధునాతన వెర్షన్లలో లభిస్తుందని తెలిపింది. వినియోగదారులకు ఎప్పటికప్పుడు మెరుగైన వాహనాలను అందించే విషయంలో ఎల్లాప్పుడూ కట్టుబడే ఉంటాం అనే అంశానికి ఈ రెండు నూతన వెర్షన్ల విడుదల అద్దం పడుతుందని జేటీఎస్‌వీ సీఈఓ నాగభూషణ్‌ గుబ్బి అన్నారు. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, కాలికట్, చండీగఢ్‌, చెన్నై, కొచ్చిన్, కోయంబత్తూర్, ఢిల్లీ, గురుగ్రామ్, ఇండోర్, కాంగ్రా, కన్నూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నోయిడా, పూణే, త్రిసూర్, థానేల్లోని టాటా మోటార్స్‌ స్టోర్లలో ఈకార్లు అందుబాటులో ఉన్నట్లు వివరించారు.



You may be interested

హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్‌ ఎక్స్‌ ఆవిష్కరణ

Thursday 15th August 2019

ట్రిపుల్‌ కెమెరా ఫోన్‌ హైదరాబాద్‌: హెచ్‌టీసీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ దేశీయ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. వైల్డ్‌ఫైర్‌ ఎక్స్‌ స్మార్ట్‌ ఫోన్‌ను హెచ్‌టీసీ బ్రాండ్‌ లైసెన్స్‌ కలిగిన ‘ఇన్‌వన్‌ స్మార్ట్‌ టెక్నాలజీ’ తీసుకొచ్చింది. రెండు వేరియంట్లలో ఇది లభిస్తుంది. 3జీబీ ర్యామ్‌/32 జీబీ రామ్‌ ధర రూ.9,999. 4జీబీ ర్యామ్‌/64జీబీ రామ్‌ ఫోన్‌ ధర రూ.12,999. ఈ రెండూ శాఫైర్‌ బ్లూ కలర్‌ ఆప్షన్లో మాత్రమే లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌ పోర్టల్‌లో ఈ

ఐసీఐసీఐ ఎఫ్‌డీల రేట్లు మారాయి...

Thursday 15th August 2019

ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఏడు రోజుల నుంచి పదేళ్ల వరకు కాల వ్యవధి కలిగిన డిపాజిట్ల రేట్లలో మార్పులు చేసింది. 7-14 రోజుల డిపాజిట్లపై 4 శాతం, 15-29 రోజుల ఎఫ్‌డీలపై 4.25 శాతం, 30-45 రోజుల ఎఫ్‌డీలపై 5.25 శాతం, 46-60 రోజుల ఎఫ్‌డీపై 5.75 శాతం, 61-90 రోజుల డిపాజిట్‌పై 5.75 శాతం, 91-120 రోజుల డిపాజిట్‌పై 5.75

Most from this category