News


టాటామోటర్స్‌కు జేఎల్‌ఆర్‌ అమ్మకాల జోష్‌

Wednesday 4th December 2019
news_main1575447896.png-30052

  • 6.50శాతం ర్యాలీ చేసిన షేరు

అమెరికాలో లాండ్‌ రోవర్‌ నవంబర్‌ మొత్తం అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించడంతో ...మాతృసంస్థ టాటా మోటర్స్‌ షేరు బుధవారం మిడ్‌సెషన్‌ కల్లా 6.50శాతం లాభపడింది. టాటామోటర్స్‌ అనుబంధ, బ్రిటన్‌ ఆధారిత కార్ల తయారీ సంస్థ జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌ ఈ అక్టోబర్‌ అమ్మకాలతో పోలిస్తే ఈ నవంబర్‌లో 19.4శాతం వృద్ధిని సాధించింది.  వార్షిక ప్రాతిపాదిన చూసినట్లైతే.. గతేడాది నవంబర్‌లో విక్రయించిన 11,744 యూనిట్లుతో పోలిస్తే ​ 6.2శాతం వృద్ధిని సాధించి 12,472 యూనిట్లకు చేరాయి.  అమెరికాలో అమ్మకాలు వరుసగా నాలుగో నెల పెరిగాయి. జూన్‌లో 8,476 యూనిట్లను, ఆగస్ట్‌లో 8,700 యూనిట్లను, సెప్టెంబర్‌లో 9,490 యూనిట్లను, అక్టోబర్‌లో 10,443 యూనిట్లను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.  బలమైన విక్రయ గణాంకాల నేపథ్యంలో టాటామోటర్స్‌ షేరుకు డిమాండ్‌ నెలకొంది. ఇంట్రాడేలో 6.50శాతం వరకు పెరిగి రూ.168.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.1:30ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(రూ.158.15)తో పోలిస్తే 6శాతం లాభంతో రూ.167.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.106.00, రూ.239.30లుగా నమోదయ్యాయి. 



You may be interested

బాండ్‌ ఈటీఎఫ్‌లు కొంటారా? ఇవి గమనించండి!

Wednesday 4th December 2019

దేశీయ తొలి కార్పొరేట్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ లాంచింగ్‌కు ప్రభుత్వం బుధవారం అనుమతినిచ్చింది. దీంతో ఇకపై రిటైల్‌ ఇన్వెస్టర్లు దేశీయ బాండ్‌ మార్కెట్లో పాలుపంచుకోవచ్చు. బాండ్‌ జారీల ద్వారా ప్రభుత్వ సంస్థలకు నిధులు సమకూర్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌లకు ఆమోదం తెలిపింది. ఈ బాండ్స్‌లో మూడు, పదేళ్ల కాలపరిమితి రకాలున్నాయి. బాండ్‌ ఈటీఎఫ్‌ల గురించి మరిన్ని వివరాలు... = స్టాక్‌ ఎక్చేంజ్‌ల్లో వీటిని లిస్ట్‌ చేస్తారు. = వీటిలో ఏఏఏ-,

అధిక వాల్యూషన్లు.. అయినా పర్లేదు!

Wednesday 4th December 2019

హై పీఈ స్టాకుల్లో అధిక కొనుగోళ్లు సాధారణంగా ఒక షేరును కొనేముందు టెక్నికల్స్‌ అధ్యయనం చేసేవాళ్లు అల్ప పీఈ స్థాయి ఉన్న షేర్ల వైపు మొగ్గు చూపుతారు. పీఈ తక్కువగా ఉంటే వాల్యూషన్లు తక్కువగా ఉన్నట్లు భావిస్తారు. కానీ తాజా మార్కెట్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోందని నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. ఇన్వెస్టర్లు ప్రస్తుతం అధిక పీఈ స్టాకులను వేలం వెర్రిగా కొనుగోలు చేస్తున్నారు. పీఈ ఎక్కువగా ఉన్నా పట్టించుకోకుండా కొన్ని షేర్ల

Most from this category