News


టారిఫ్‌ల పెంపు ఎవరికి ప్రయోజనం..?

Tuesday 3rd December 2019
Markets_main1575312881.png-30007

టెలికం కంపెనీలు డేటా, వాయిస్‌ చార్జీలను భారీగా పెంచేశాయి. ఈ పెంపు ఏకంగా 40 శాతం వరకు ఉంది. దీంతో టెలికం షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. ఈ నెల 3 నుంచి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు చార్జీల పెంపు అమల్లోకి వస్తుంటే, 6వ తేదీ నుంచి జియో చార్జీల పెంపు అమలు కానుంది. టెలికం కంపెనీలు  ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రభుత్వానికి చెల్లించాల్సిన భారీ చార్జీలు, రుణ భారం, అదే సమయంలో సేవలపై వస్తున్న ఆదాయం తక్కువ కారణంగా అవి భారీ నష్టాలను పోగేసుకుంటున్నాయి. ఈ క్రమంలో టారిఫ్‌లను భారీగా పెంచేశాయి. ఇటీవలి సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగా సవరించిన స్థూల ఆదాయం బకాయిల రూపంలో ఎయిర్‌టెల్‌, వొడాఐడియాలు రూ.74,000 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా చార్జీల పెంపు అంచనాల కంటే ఎక్కువే ఉందని బ్రోకరేజీలు పేర్కొంటున్నారు.

 

‘‘భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు అంచనాలకు మించి ధరలను పెంచేశాయి. అంతేకాదు, మరిన్ని విడతల పెంపును అంచనా వేస్తున్నాం’’ అని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌ పేర్కొంది. చార్జీల పెంపుతో భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (జియో) ఎక్కువగా ప్రయోజనం పొందుతాయని అంచనా వేసింది. ఈ రెండింటికీ బై రేటింగ్‌ ఇచ్చింది. ఏజీఆర్‌ భారం కారణంగా వొడాఫోన్‌ ఐడియా రిస్క్‌ రాబడుల విషయంలో ఆకర్షణీయంగా లేదని పేర్కొంది. క్రెడిట్‌ సూసే కూడా టారిఫ్‌ల పెంపు అంచనాలకు తగ్గట్టుగానే ఉందన్న అభిప్రాయాన్ని తెలియజేసింది. ధరల రికవరీతో ఎక్కువగా లాభపడే పరిస్థితుల్లో ఎయిర్‌టెల్‌ ఉందని పేర్కొంది. వొడాఫోన్‌ ఐడియా పట్ల న్యూట్రల్‌ రేటింగ్‌తో ఉంది. ఈ సంస్థకు 2023 ఆర్థిక సంవత్సరంలో మరో విడత నిధుల సమీకరణ అవసరం పడొచ్చని అంచనా వేసింది. వచ్చే 12-18 నెలల కాలంలో మరిన్ని టారిఫ్‌ల పెంపు ఉంటుందని పేర్కొంది. వచ్చే జనవరి-మార్చి త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్‌ ఎబిట్డా 15 శాతం, వొడాఫోన్‌ ఐడియా ఎబిట్డా 54 శాతం త్రైమాసికం వారీగా పెరగొచ్చని అంచనా వేసింది. 2021-22 నాటికి మొత్తం మీద ఏఆర్‌పీయూ (సగటు వినియోగదారుని నుంచి వచ్చే ఆదాయం) 55 శాతం పెరుగుతుందని క్రెడిట్‌సూసే తెలిపింది. 

 

‘‘వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ ఏఆర్‌పీయూ రూ.25-30 వరకు పెరగొచ్చు. దీంతో వొడాఐడియా ఎబిట్డా రూ.8,000-9,500 కోట్లు, ఎయిర్‌టెల్‌ ఎబిట్డా రూ.7,000-8,500 కోట్ల వరకు పెరుగుతుంది’’అని కోటక్‌ సెక్యూరిటీస్‌ తన నివేదికలో పేర్కొంది. అయితే, జియో ప్లాన్ల వివరాలు (పెంపు అనంతరం) పూర్తిగా వెల్లడైన తర్వాతే చందాదారులు ఒక కంపెనీని వీడి మరో కంపెనీకి వెళ్లే విషయమై స్పష్టత వస్తుందని తెలిపింది.You may be interested

కార్వీకి మరో షాక్‌..!

Tuesday 3rd December 2019

ట్రేడింగ్‌ లైసెన్సు సస్పెండ్‌ చేసిన ఎక్సే్ఛంజీలు నిబంధనలు ఉల్లంఘించినందుకే శాట్‌ను ఆశ్రయించనున్న సంస్థ పీవోఏపై ఊరటనివ్వని సెబీ ముంబై/హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ కార్వీకి ఒకదాని తర్వాత మరొకటిగా షాకులు తగులుతున్నాయి. తాజాగా  అన్ని విభాగాల్లో ట్రేడింగ్‌ లైసెన్సును సస్పెండ్‌ చేస్తున్నట్లు స్టాక్‌ ఎక్సే్ఛంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ సోమవారం ప్రకటించాయి.  ఎక్సే్ఛంజీల నిబంధనలను ఉల్లంఘించడమే ఇందుకు కారణమని వెల్లడించాయి. సస్పెన్షన్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని వేర్వేరుగా

యస్‌ బ్యాంకు.. జోష్‌నివ్వని నిధుల సమీకరణ!

Tuesday 3rd December 2019

యస్‌ బ్యాంకు 2 బిలియన్‌ డాలర్ల నిధుల సమీకరణకు నిర్ణయం తీసుకున్నట్టు చేసిన ప్రకటన సోమవారం స్టాక్‌ ధరకు జోష్‌నివ్వలేకపోయింది. సగటు ధర ప్రకారం చూస్తే ఒక్కో షేరును రూ.77 ధర వద్ద కేటాయించే అవకాశాలు ఉన్నాయి. కానీ, షేరు మాత్రం బీఎస్‌ఈలో 6 శాతానికి పైగా నష్టపోయి రూ.64.05 వద్ద క్లోజయింది. యస్‌ బ్యాంకు షార్ట్‌లిస్ట్‌ చేసిన ఇన్వెస్టర్లు అందరికీ ఆర్‌బీఐ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే విషయమై విశ్లేషకుల్లో

Most from this category