News


టారిఫ్‌ పెంపుతో ఎయిర్‌టెల్‌కు ప్రయోజనం!

Tuesday 3rd December 2019
Markets_main1575368900.png-30030

ఫిచ్‌ రేటింగ్స్‌ డైరెక్టర్‌ నితిన్‌ సోనీ
టెలికం రంగంలోని ప్రైవేట్‌ ఆపరేట్లరంతా ఒక్కమారుగా టారిఫ్‌లను పెంచారు. పెరిగిపోతున్న ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేందుకు టారిఫ్‌లు పెంచాల్సివచ్చిందని కంపెనీలు చెబుతున్నాయి. అయితే ఈ పెంపు సరాసరిన 25- 40 శాతం ఉన్నా, నిజమైన పెరుగుదల ఆయా కస్టమర్లు తీసుకొనే ప్లాన్లపై ఆధారపడి ఉంటుందని ఫిచ్‌ రేటింగ్స్‌ డైరెక్టర్‌ నితిన్‌ సోనీ చెప్పారు. కస్టమర్లు అధిక డేటా వాడకానికి ప్రాధాన్యమిస్తారా? లేక అధిక టారిఫ్‌ చెల్లింపునకు ఇష్టపడతారా? అనే అంశాలపై నిజ పెరుగుదల ఆధారపడి ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టెల్కోలకు ఈ పెంపు చాలా అవసరమని, వాటి రెవెన్యూ, ఎబిటాల్లో రికవరీకి టారిఫ్‌లు పెంచక తప్పదని తెలిపారు. ముఖ్యంగా విపరీతమైన ఒత్తిడిలో ఉన్న వొడాఫోన్‌ ఐడియాకు ఈ పెరుగుదల అత్యావశ్యకమన్నారు. కానీ ఈ పెరుగుదల కంపెనీ పూర్తిగా కోలుకునేందుకు ఉపయోగపడకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కంపెనీ ప్రమోటర్లు నగదు సాయం చేసేందుకు ముందుకు రానందున తాజా పెరుగుదలతో పూర్తి రికవరీ ఉండకపోవచ్చన్నారు. 
భారతీ ఎయిర్‌టెల్‌కు మాత్రం ఈ పెరుగుదల బాగా కలిసివస్తుందని చెప్పారు. కంపెనీకి బీబీబీ మైనస్‌రేటింగ్‌ ఇచ్చామని, భవిష్యత్‌ ప్రదర్శనను బట్టి అవుట్‌లుక​ ధృక్పథం మార్చుకుంటామని వివరించారు. వొడాఫోన్‌ ఐడియా తాజా ఎబిటా కేవలం 1000 కోట్ల రూపాయలేనని, అందువల్ల తాజా పెరుగుదలతో కంపెనీ నగదు ఉత్పత్తి ఏమంత మెరుగుపడదని తెలిపారు. ఏజీఆర్‌ ఆర్డర్‌ ప్రకారం వచ్చే నెలాఖరులోపు బకాయిలు చెల్లించాల్సిఉంటే కంపెనీ 35 శాతం టారిఫ్‌లు పెంచినా ప్రయోజనం ఉండదన్నారు. కానీ ఎయిర్‌టెల్‌కు మాత్రం తాజా పెరుగుదల సరిపోతుందని, ఈ పెరుగుదల ఏఆర్‌పీయూపై ప్రభావం చూపకుండా ఉండేలా జాగ్రత్త వహించాలని చెప్పారు. ధరల పెంపు అనంతరం కంపెనీల కస్టమర్ల స్పందన ఎలా ఉంటుందో జాగ్రత్తగా పరిశీలించాల్సిఉందన్నారు. 



You may be interested

12000 దిగువన ముగిసిన నిఫ్టీ

Tuesday 3rd December 2019

127పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌ ఆర్‌బీఐ పాలసీ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత మరోసారి తెరపైకి అంతర్జాతీయ వాణిజ్య భయాలు జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలతో మార్కెట్‌ మంగళవారం నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్‌ 127 పాయింట్లను కోల్పోయి 40,675.45 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 54 పాయింట్లు నష్టపోయి 12వేల దిగువున 11,994 వద్ద స్థిరపడింది. నిఫ్టీకి మూడో రోజూ నష్టాల ముగింపు. బ్రెజిల్‌, అర్జెంటీనా దేశాల నుంచి అమెరికాలోకి దిగుమతయ్యే స్టీల్‌, అల్యూమినియంలపై టారీఫ్‌లను

రెండోరోజూ యస్‌ బ్యాంక్‌ పతనం

Tuesday 3rd December 2019

యస్‌బ్యాంక్‌ షేరు వరుసగా రెండోరోజూ నష్టాల బాట పట్టింది. నిన్నటి ట్రేడింగ్‌లో 6శాతం నష్టపోయిన ఈ షేరు మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో మరో 6శాతం నష్టపోయింది. అమెరికాకు చెందిన అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థల్లో ఒకటైన క్యాపిటల్‌ ఇంటర్నేషనల్‌ ఈ బ్యాంకులో 120 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనుందనే వార్తలు షేరుకు ర్యాలీకి తోడ్పానివ్వలేకపోయాయి. యస్‌ బ్యాంక్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్న 8పెట్టుబడిదారులలో క్యాపిటల్‌ ఇంటర్నేషనల్‌ ఒకటి. అమెరికాలో నియంత్రణ

Most from this category