News


వొలాటిలిటీలోనూ ఈ షేర్ల లాభాల దౌడు

Thursday 16th January 2020
Markets_main1579166262.png-30967

జాబితాలో వొకార్డ్‌, మహానగర్‌ గ్యాస్‌
టొరంట్‌ ఫార్మా, ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌
చరిత్రాత్మక గరిష్టానికి నెస్లే ఇండియా

అగ్ర దేశాలు అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కార ఒప్పందం కుదిరినప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండటంతో స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేట్‌ అవుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనూ హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ వొకార్డ్‌ లిమిటెడ్‌, యుటిలిటీస్‌ కంపెనీ మహానగర్‌ గ్యాస్‌, ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా, ఈ ఆక‌్షన్‌ సేవల కంపెనీ ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ కౌంటర్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం...

వొకార్డ్‌ లిమిటెడ్‌
ఔషధ నియంత్రణ అధీకృత సంస్థ(డీసీజీఐ) నుంచి రెండు కొత్త ఔషధాలకు అనుమతి లభించినట్లు వెల్లడించడంతో వొకార్డ్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ జోరందుకుంది. మధ్యాహ్నం 2.15 ప్రాంతంలో ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో 7.5 శాతం జంప్‌చేసి రూ. 279 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 14 శాతం దూసుకెళ్లింది. రూ. 296 వద్ద గరిష్టాన్ని తాకింది. చర్మ సంబంధ వ్యాధుల చికిత్సలో వినియోగించగల ఎమ్‌రాక్‌-4, ఎమ్‌రాక్‌ 0 ఔషధాలకు డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలియజేసింది. బ్యాక్టీరియల్‌ ఇనెఫెక్షన్లు, షుగర్‌ వ్యాధి పీడిత కాళ్ల పగుళ్లు, గాయాలు తదితర వ్యాధుల చికిత్సలో వీటిని వినియోగించవచ్చని పేర్కొంది.

నెస్లే ఇండియా
ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా కౌంటర్‌ మరోసారి వెలుగులో నిలుస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3.3 శాతం ఎగసి రూ. 15,345 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 15,398ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. కంపెనీ మార్కెట్‌ విలువ(కేపిటలైజేషన్‌) రూ. 1.5 ట్రిలియన్లకు చేరింది. తద్వారా అత్యంత విలువైన లిస్టెడ్‌ కంపెనీల జాబితాలో 20వ ర్యాంకులో నిలిచింది. గత నెల రోజుల్లో ఈ షేరు 10 శాతం బలపడింది. ఈ డిసెంబర్‌ క్వార్టర్‌లో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించగలదన్న అంచనాలు నెస్లే షేరుకి జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

మహానగర్‌ గ్యాస్‌ 
విదేశీ రీసెర్చ్‌ సంస్థ క్రెడిట్‌ స్వీస్‌ షేరుకి ఔట్‌పెర్‌ఫార్మ్‌ రేటింగ్‌ను ప్రకటించడంతో మహానగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ పుంజుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3 శాతం లాభంతో రూ. 1132 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1148 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. కంపెనీ అమ్మకాల పరిమాణం 5-6 శాతం పెరిగే వీలున్నట్లు క్రెడిట్‌ స్వీస్‌ భావిస్తోంది. దీంతో మహానగర్‌ గ్యాస్‌ షేరుకి రూ. 1280 టార్గెట్‌ ధరను ప్రకటించింది. ఈ ఏడాది క్యూ4లో 500 కొత్త బస్సుల కారణంగా కంపెనీ అమ్మకాలు పెరిగనున్నట్లు అంచనా వేసింది.

టొరంట్‌ ఫార్మా
అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు(క్విప్‌) ద్వారా నిధుల సమీకరణ చేపట్టే ప్రతిపాదనను ప్రకటించడంతో టొరంట్‌ ఫార్మా వెలుగులోని వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 1.5 శాతం లాభంతో రూ. 1922 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1968 సమీపంలో 52 వారాల గరిష్టాన్ని తాకింది. క్విప్‌ ఇష్యూ అంశాన్ని చర్చించడంతోపాటు ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) ఫలితాల విడుదలకు బోర్డు ఈ నెల 27న సమావేశంకానున్నట్లు టొరంట్‌ ఫార్మా తెలియజేసింది.

ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌
పీఎస్‌యూ దిగ్గజం ఇంజినీర్స్‌ ఇండియా సెల్లింగ్‌ ఏజెంట్‌గా ఎంపిక చేసుకున్నట్లు ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. దీంతో ఇంజినీర్స్‌ ఇండియాకు చెందిన స్థిర, చర వస్తువులతోపాటు.. వేస్ట్‌ మెటీరియల్‌, స్క్రాప్‌, ఫెర్రస్‌, నాన్‌ఫెర్రస్‌ తదితర సెకండరీ వేస్టేజీలను వెబ్‌సైట్‌ ద్వారా వేలం నిర్వహించనున్నట్లు ఎంఎస్‌టీసీ తెలియజేసింది. పరికరాలు, ప్లాంటు, మెషినరీ, మెటల్స్‌ తదితర విభాగాలకు సైతం ఈ సేవలు అందించనున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎంఎస్‌టీసీ షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 149 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 153 వరకూ ఎగసింది.



You may be interested

ఈ ఏడాది మార్కెట్ల నుంచి 9% రిటర్న్స్‌?

Thursday 16th January 2020

ఈ కేలండర్‌ ఏడాది(2020) దేశీ స్టాక్‌ మార్కెట్లు 8-9 శాతం స్థాయిలో రిటర్నులు అందించే వీలున్నట్లు ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఎంఎఫ్‌.. ఈక్విటీ విభాగం సీఐవో మహేష్‌ పాటిల్‌ అంచనా వేస్తున్నారు. 2019ని ప్రతిబింబిస్తూ ఈ ఏడాది కూడా లార్జ్‌ క్యాప్స్‌ జోరు చూపవచ్చని ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. వివరాలు చూద్దాం.. ఆర్థిక రికవరీ  వచ్చే ఆర్థిక సంవత్సరం(2020-21)లో ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్‌ నిఫ్టీ ఆర్జన 21 శాతం జంప్‌చేయవచ్చు. కార్పొరేట్‌ బ్యాంకులు ఇందుకు

లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్న బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 16th January 2020

మార్కెట్‌ పరిమితి శ్రేణి ట్రేడింగ్‌లో భాగంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతుంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 31,810.55 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ అరశాతం పెరిగి 31,988.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. అనంతరం మార్కెట్‌ ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో భాగంగా ప్రైవేట్‌

Most from this category