News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 25th March 2020
Markets_main1585112866.png-32663

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు

రియలన్స్‌ ఇండస్ట్రీస్‌: భారతీయ అతిపెద్ద వైర్‌ లెస్‌ నెట్‌వర్క్‌ రిలయన్స్‌ జియో కంపెనీలో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌  10శాతం వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. 

 క్వెస్‌ కార్ప్‌ లిమిటెడ్‌: కోవిడ్‌ –19 సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుండటంతో కంపెనీ తన ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు (బైబ్యాక్‌) చేయనుంది.

యస్‌బ్యాంక్‌: రేటింగ్‌ సంస్థ ఐసీఆర్‌ఏ యస్‌ బ్యాంక్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది. ఇందులు భాగంగా రూ.10,900 కోట్ల విలువైన 2 టైర్‌ బాండ్లను బీబీ నుంచి ‘ఏ4ఫ్లస్‌’ రేటింగ్‌ ఇచ్చింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్లకు బీబీ ప్లస్‌ రేటింగ్‌ను ఇచ్చింది.

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌: అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ని«ధుల సమీకరణ సవాళ్లను ఎదుర్కొంటుండంతో ఆవుట్‌లుక్‌ రేటింగ్‌ను ‘నెగిటివ్‌’గా ఇచ్చింది. కార్పొరేట్‌ ఫ్యామిలీ రేటింగ్‌(సీఎఫ్‌ఆర్‌), ఫారీన్‌ కరెన్సీ సినారియో సెక్యూర్డ్‌ రేటింగ్‌ను బీ2 నుంచి బీ3కి తగ్గించింది.  

వేదాంత: మూడీస్‌ రేటింగ్‌ సంస్థ వేదాంత రీసోర్సెస్‌ రేటింగ్‌ను తగ్గించింది. మెటల్‌ ధరలు భారీగా పడిపోతుండడంతో రేటింగ్‌ను తగ్గించినట్లు వెల్లడించింది.

టీసీఎస్‌: ఈ కంపెనీ 90 శాతం ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం  ద్వారా సేవల్ని కొనసాగిస్తున్నారు.

నేస్లే ఇండియా: నెస్లే ఇండియా, వరుణ్‌ బేవరేజెస్, అమర్‌ రాజా బ్యాటరీ వంటి కంపెనీలు కరోనా కారణంగా తమతమ ప్లాంట్లలో ఉత్పత్తులను నిలిపివేసాయి. 



You may be interested

25,200 కోట్ల డాలర్ల నష్టం

Wednesday 25th March 2020

విమానయానంపై కోవిడ్‌ వైరస్‌ కాటు  ప్రభుత్వాలు ఆదుకోవాలి: ఐఏటీఏ  న్యూఢిల్లీ: కోవిడ్‌-19(కరోనా)వైరస్‌ కల్లోలం కారణంగా అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ప్రయాణీల ఆదాయంలో ఈ ఏడాది 25,200 కోట్ల డాలర్లు (19,15,200 కోట్లు)నష్టం వాటిల్లనున్నది. గత ఏడాది వచ్చిన ప్రయాణీకుల ఆదాయంలో ఇది దాదాపు 44 శాతానికి సమానం.  కోవిడ్‌-19 (కరోనా) వైరస్‌ వేగంగా విస్తరిస్తుండటంతో పలు దేశాలు విమాన సర్వీసులపై ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆంక్షలు మరో మూడు నెలలు కొనసాగితే,

లాభాల ఓపెనింగ్‌ ..!

Wednesday 25th March 2020

అంతర్జాతీయ మార్కెట్లను నుంచి సానుకూల సంకేతాలు 250 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌  7800 పైన నిఫ్టీ ప్రా‍రంభం రిలయన్స్‌ 8శాతం జంప్‌ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చున్న దేశీయ మార్కెట్‌ బుధవారం లాభంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 258.41 పాయింట్ల లాభంతో 26932.44 వద్ద, నిఫ్టీ 72.05 పెరిగి 7873.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కరోనా వైరస్‌ ధాటికి విలవిలాడుతున్న ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు భారీ ప్యాకేజీని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌

Most from this category