News


గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 12th September 2019
Markets_main1568262533.png-28328

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్:- ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా 3.5శాతం వాటాను విక్రయించడానికి బోర్డు అనుమతినిచ్చింది.
ఆల్కేమ్‌ ల్యా‍బ్స్:- ఇటీవల సెయింట్‌లూయిస్‌లోని ప్లాంట్‌ను తనిఖీ చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ లోపాలు గుర్తించి ఫారమ్ ‌483ను జారీ చేసింది.
సీజీ పవర్‌:- కంపెనీ దర్యాప్తులో భాగంగా ఛైర్మన్‌ తొలగించడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరించడం‍తో వర్కింగ్‌ క్యాపిటల్‌ సమీకరించడంలో విఫలమైంది.
అదానీ పవర్‌:- తన తిరోడా ప్లాంట్ కోసం అధిక బొగ్గు ధరలను చెల్లించడానికి విద్యుత్ రెగ్యులేటర్ మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్  అనుమతించిందని కంపెనీ తెలిపింది. 
విప్రో:- షేర్ల బైబ్యాక్‌లో అజిమ్‌ ప్రేమ్‌జీ, ఇతర ప్రమోటర్‌ సంస్థలు 22.46 కోట్ల షేర్లను కంపెనీకి అమ్మేశాయి. వీటి విలువ రూ.7,300 కోట్ల మేర ఉంటుందని అంచనా. గత నెలలో ముగిసిన షేర్ల బైబ్యాక్‌లో భాగంగా మొత్తం 32.3 కోట్ల ఈక్విటీ షేర్లను బైబ్యాక్‌  చేశామని విప్రో కంపెనీ వెల్లడించింది.
అపోలో హాస్పిటల్స్‌:- ఒక్కో షేరు రూ.1450 చొప్పున మొత్తం 50 లక్షల షేర్లను విక్రయించనున్న ఫౌండర్‌ సునితా రెడ్డి
హెచ్‌డీఎఫ్‌సీ:- బాండ్ల జారీ ద్వారా రూ.5వేల కోట్ల నిధులను సేకరించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది
క్రిదాన్‌ ఇన్‌ఫ్రా:- బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి రూ.112 కోట్ల విలువైన ఆర్డర్లను సంపాదించింది 
డాక్టర్‌ రెడ్డీస్‌:- ఫొసాప్రిపిట్యాంట్‌ఇంజక్షన్‌ను అమెరికా మార్కెట్లోకి విడుదల చేసింది.
టైటాన్‌ కంపెనీ:- కంపెనీ జారీ చేసిన రూ.900 కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్ల ఇష్యూకు ఇక్రా రేటింగ్‌ సంస్థ ఎ1(+) రేటింగ్‌ను కేటాయించింది. 



You may be interested

28000 పాయింట్లపైకి బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 12th September 2019

ప్రైవేట్‌ రంగ షేర్ల ర్యాలీ అండగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 28000 పాయింట్ల పైకి ఎగిసింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 27,870.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభంలోనే ప్రైవేట్‌రంగ షేర్లకు డిమాండ్‌ ఏర్పడటంతో ఇండెక్స్‌ 1శాతం(286 పాయింట్లు) పెరిగి 28,062.30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం:10:00లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(27,776.20)తో పోలిస్తే

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Thursday 12th September 2019

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో గురువారం భారత్‌ స్టాక్‌ సూచీలు గ్యాఫ్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 60 పాయింట్ల లాభంతో 37,330 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 23 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,058 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. 

Most from this category