News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 13th July 2018
Markets_main1531459371.png-18275

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు
ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌:- అనేక పరిమాణాల అనంతరం మలేషియాకు చెందిన ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌ బిడ్డింగ్‌కు ఆమోదం తెలిపింది. తాజాగా బిడ్డింగ్‌ ద్వారా ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌ సంస్థ ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌లో రూ.4వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌:- ప్రతి షేరు ధర రూ.1100ల చొప్పున మొత్తం 3.63 కోట్ల ఈక్విటీ షేర్ల బై బ్యాక్‌కు బోర్డు ఆమోదం తెలిపింది.
మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌:- రూ.400 కోట్ల విలువైన ఎన్‌సీడీల జారీ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది.
అలహాదాబాద్‌ బ్యాంక్‌:- నిరర్థక ఆస్తులతో విక్రయంతో పాటు, పలు జాయింట్‌ వెంచర్‌లోని వాటా ఉపసంహరణ, కొన్ని స్థిరాస్థుల విక్రయాలకు సంబంధించి బోర్డు అనుమతి కోరనుంది.
సోమ్‌ డిస్టలరీస్‌:- జూలై 13న జరిగే బోర్డు సమావేశంలో ఫ్రిపరెన్షియల్‌ బేసిస్‌ పద్ధతిలో ప్రతి షేరు ధర రూ.271.55ల వద్ద 36 లక్షల ఈక్విటీ షేర్ల కేటాయింపునకు ఆమోదం తెలపనుంది.
ఎస్‌ఆర్‌ఎస్‌ రియల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌:- బోర్డు సీఎఫ్‌ఓగా ధన్‌రాజ్‌ కుమార్‌ నియమితులయ్యారు.
హబ్‌ టౌన్‌:- ప్రమోటర్ల/ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థలకు ఫ్రిపరెన్షియల్‌ బేసిస్‌ పద్ధతిలో 3.09 కోట్ల ఈక్విటీ షేర్లకు సమానమైన వారెంట్ల జారీకి బోర్డు ఆమోదం తెలిపింది.
టాక్‌వాకర్స్‌ లైఫ్‌స్టైల్స్‌:- రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.10 డివిడెండ్‌ను కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ రికమెండ్‌ చేసింది
దీక్షిత్‌ టాన్స్‌వరల్డ్స్‌:- ఫ్రిపరెన్షియల్‌ బేసిస్‌ పద్ధతిలో నాన్‌ ప్రమోటర్‌ క్రిష్టన్‌ నరనపట్టికు 3.29లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేసింది. అలాడే అడ్‌ఫాం సంస్థలో 51శాతం వాటాను కొనుగోలు చేసింది.
విరంచి:- 1,10,000 వారెంట్లను  1,10,000 ఈక్విటీ షేర్లుగా మార్చేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు:- జూలై 17న కమిటీ బోర్డు డైరెక్టర్ల సమావేశాన్ని నిర్వహించనుంది.
శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌:- రూ.1000ల ముఖ విలువ కలిగిన 3.65 కోట్ల సెక్యూర్డ్‌ రీడమబుల్‌ నాన్‌-కన్వర్ట్‌బుల్‌ డిబెంచర్ల జారీకి బోర్డు ఆమోదం తెలిపింది.
హెచ్‌ఐఎల్‌:- జర్మనీకి చెందిన పరడోర్‌ హోల్డింగ్స్‌ సంస్థలో 100శాతం వాటా కొనుగోలుకు బోర్డు ఆమోదం తెలిపింది.
అలహాబాద్‌ బ్యాంకు:- కంపెనీ పలు జాయింట్‌ వెంచర్లలో వాటా విక్రయం ద్వారా వచ్చిన సొమ్ముతో తన మొండిబకాయిలను తగ్గించుకోవాలని యోచిస్తోంది.
హడ్కో:- జూలై 30న సంస్థ రూ.4071 కోట్ల రుణ మంజూరుతో పాటు రూ.1305 కోట్ల రుణాన్ని విడుదల చేసింది.
స్టెరిలైట్‌ పవర్‌:- బ్రెజిల్‌లో 6 నూతన ట్రాన్స్‌ మిషన్‌ ప్రాజెక్ట్‌లను దక్కించుకుంది.
నాథ్‌ బయో- జెనెస్ లిమిటెడ్:- సింగపూర్‌ ఆధారిత కంపెనీ గోల్డ్‌మాన్‌ శాచ్స్‌ ఈ సంస్థకు చెందిన 5లక్షల ఈక్విటీ షేర్లను ప్రతి షేరు ధర రూ.480ల వద్ద విక్రయించింది.
రుచి సోయా:- జేమ్స్‌ ఫైనాన్షియల్‌ ప్రొడెక్ట్స్‌ సంస్థ రుచి సోయా సంస్థకు చెందిన 18లక్షల ఈక్విటీ షేర్లను ప్రతి షేరు ధర రూ.11.37ల వద్ద విక్రయించింది.
నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- ఇన్ఫోసిస్‌, 3ఐ ఇన్ఫోటెక్‌, బజాజ్‌ కార్పోరేషన్‌.You may be interested

ఏడాదికోసం టాప్‌టెన్‌ సిఫార్సులు

Friday 13th July 2018

వచ్చే 12నెలల కాలానికి 30 శాతం వరకు రాబడినిచ్చే పది స్టాకులను జేఎం ఫైనాన్షియల్స్‌, షేర్‌ఖాన్‌ రికమండ్‌ చేస్తున్నాయి.. 1. అపోలోటైర్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 305. దేశీయ ట్రక్‌, బస్‌ టైర్ల విభాగంలో బలంగా ఉంది. చైనా టైర్లపై విధించిన సుంకం కారణంగా కంపెనీ విక్రయాలు మరింత ఊపందుకున్నాయి. దీనికితోడు హంగరీ ప్లాంట్‌ కార్యకలాపాలు పునర్‌వ్యవస్థీకరించడంతో యూరప్‌ వ్యాపారం మరింత జోరందుకోనుంది. ఈ ప్లాంట్‌తో ఎబిటా మార్జిన్లలో బ్రేక్‌ ఈవెన్‌వస్తుందని

25 పైసలు బలపడిన రూపాయి

Friday 13th July 2018

10 గంటల సమయానికి 68.37 వద్ద ట్రేడింగ్‌ డాలర్‌తో రూపాయి మారకం విలువ శుక్రవారం ఉదయం లాభాలతో మొదలయ్యింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ ఎక్స్ఛేంజ్‌లో 9 గంటల సమయానికి రూపాయి విలువ 25 పైసలు బలపడి 68.32 దగ్గర ప్రారంభమయ్యింది. ముడిచమురు ధరలు ఒక్కసారిగా పడిపోవడం, దేశీయ స్టాక్‌ మార్కె‍ట్‌ లాభాల్లో ప్రారంభంకావడం వల్ల విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరిగి రూపాయి విలువ బలపడిందని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు తెలియజేశారు. నిఫ్టీ

Most from this category