News


గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 26th March 2020
Markets_main1585198714.png-32685

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు

ఇండియా సిమెంట్‌: ఎవెన్యూ సూపర్‌ మార్ట్‌ అధినేత రాధాకృష్ణ దమానీ ఇండియా సిమెంట్‌లోని ఒక్కో షేరును రూ.94.97 చొప్పున 16 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. బహిరంగ మార్కెట్‌లో ఇండియా సిమెంట్‌లోని 4 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు సోమవారమే ప్రకటించారు.

రియలన్స్‌ ఇండస్ట్రీస్‌: ప్రమోటర్‌ దేవర్షీ కమర్షియల్‌ ఎల్‌ఎల్‌పీ ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా రూ.11,000 కోట్ల షేర్లనుఅమ్మగా దానిని సమర్జిత్‌ ఎల్‌ఎల్‌పీ  కొనుగోలు చేసింది.

టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ: ఇండోనేషియాలో ఉన్న టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ అనుబంధ సంస్థ లో గురువారం నుంచి ఉత్పత్తులను ప్రారంభించింది.

ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌: ఎన్‌బీఎఫ్‌సీ రూ.500 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేసే ప్రక్రియను మొదలు పెట్టింది. కాగా గతేడాది నవంబర్‌లో రూ.100 చొప్పున ఇప్పుడున్న వాటాలో 11 శాతం ఈక్విటీ క్యాపిటల్‌ షేర్లను రూ.5 కోట్లవరకు బైబ్యాక్‌ చేసేందుకు కంపెనీ బోర్డు ఆమోదించింది.

ఏసీసీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉన్నందున ఏసీసీ కంపెనీ బుధవారం జరగాల్సిన వార్షిక జనరల్‌ మీటింగ్‌(ఏజీఎం)ను ఏప్రిల్‌ 6కు వాయిదా వే
సింది.

ఇండస్‌లాండ్‌ బ్యాంక్‌: ఇండస్‌ బ్యాంక్‌లోని 35.8 లక్షల షేర్లను సగటున రూ.298.83 చొప్పున యూరోపసిఫిక్‌ గ్రోత్‌ ఫండ్‌ విక్రయించినట్లు ఎన్‌ఎస్‌ఈకి ఇచ్చిన సమాచారంలో పేర్కొంది.

యస్‌బ్యాంక్‌: యస్‌బ్యాంక్‌ పునర్‌నిర్మాణంలో భాగంగా వివిధ కంపెనీల నుంచి యస్‌ బ్యాంక్‌కు వచ్చిన నిధులతో  బ్యాంక్‌ పరిస్థితి కొంత మేర మెరుగుపడిందని ఐసీఆర్‌ఏ వెల్లడించింది. అయితే వచ్చే ఒకటి రెండేళ్లలో  అదనంగా రూ.9,000–రూ.13,000 కోట్లు అవసరమని తెలిపింది.

ఎన్‌టీపీసీ: మధ్యప్రదేశ్‌లోని కర్గాన్‌ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో 660 మెగావాట్ల రెండో యూనిట్‌ ట్రైల్‌ పూర్తయిందని ఎన్‌టీపీసీ వెల్లడించింది.

ఐఓసీ: కరోనా వైరస్‌ ప్రభావంతో పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్‌ భారీగా పడిపోవడంతో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ 25 –30 శాతం ముడిచమురు శుద్ధిని నిలిపివేసింది.

ఆర్‌ఈసీ: ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో ముందుగా నిర్ణయించిన రూ.90,000 కోట్లు కాకుండా రూ.94,000 కోట్లను  రుణంగా తీసుకునేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది.

శంకరా బిల్డింగ్‌ ప్రాడెక్ట్స్‌: ఈ కంపెనీ రేటింగ్‌ను ఏ– నుంచి బీబీబీ+కు తగ్గించింది. కమర్షియల్‌ పేపర్‌ను ఏ2+ నుంచి ఏ2కు తగ్గించింది.

అశోక్‌ లేలాండ్‌: ఈకపెనీ రేటింగ్‌ను ఐసీఆర్‌ఏ ఏఏ నెగిటివ్‌గా ఇచ్చింది. అంతేకాకుండా షార్ట్‌ టర్మ్‌ రేటింగ్‌ను ఏ1+కు తగ్గించింది.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా: ఎంఎస్‌ఎంఈకు నిధులు సమకూర్చేందుకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ను ఏర్పాటు చేసింది. You may be interested

ఫైనాన్షియల్స్‌ భలే దూకుడు..

Thursday 26th March 2020

ఇండస్‌ఇండ్‌.. 35 శాతం అప్‌ బ్యాంక్‌ నిఫ్టీ 8 శాతం ప్లస్‌ కొద్ది రోజులుగా ఏకధాటిగా క్షీణిస్తూ వస్తున్న ఫైనాన్షియల్‌ రంగ కౌంటర్లకు ఉన్నట్టుండి జోష్‌ వచ్చింది. దీతో ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ కౌంటర్లు ఒక్కసారిగా జోరందుకున్నాయి. వెరసి ఎన్‌ఎస్‌ఈలో ప్రయివేట్ రంగ బ్యాంక్స్‌ 10 శాతం పురోగమించాయి. బ్యాంక్‌ నిఫ్టీ 8 శాతం ఎగసింది. గత మూడు వారాలుగా 42 శాతం క్షీణించిన ఫైనాన్షియల్‌ రంగం మూడు రోజులుగా టర్న్‌అరౌండ్‌ బాట

‘‘ప్యాకేజీ’’ లాభాల ప్రారంభం ..!

Thursday 26th March 2020

దేశీయ మార్కెట్‌ గురువారం లాభంతో ప్రారంభమైంది. కరోనా వైరస్‌ విపత్తు నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం రూ.1.5ట్రిలియన్ల ప్యాకేజీని సిద్ధం చేస్తుందనే అంచనాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అలాగే ఆర్థిక అగ్రరాజ్యమైన అమెరికా సెనెట్‌ సైతం కరోనా వైరస్‌ ఉద్దీపన చర్యల్లో భాగంగా  2ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి ఆమోదం తెలపడటంతో పాటు వైట్‌హౌస్‌కు పంపడం కూడా మార్కెట్లకు ఉత్సాహానిచ్చింది. దీంతో బెంచ్‌మార్క్‌ సూచీలు నిన్నటి భారీ లాభాల

Most from this category