News


నేటి వార్తల్లోని షేర్లు

Thursday 13th February 2020
Markets_main1581570085.png-31753

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు

డీమార్ట్‌: డీ మార్ట్‌ మాతృ సంస్థ ఎవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ 2.27 శాతం వాటాను విక్రయించనున్నట్లు వెల్లడించింది. 

జీఐసీ : రష్యాలో వ్యాపారం చేసేందుకు లైసెన్సును పొందినట్లు జనరల్‌ ఇన్సురేన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తెలపింది. 

టాటా కెమికల్స్‌: వేరే కంపెనీల నుంచి 1.08 వాటాను కొనుగోలు చేయడం ద్వారా టాటా సన్స్‌  వాటా 25.26 శాతం పెరగనున్నట్లు టాటా కెమికల్స్‌ వెల్లడించింది. కాగా ప్రస్తుతం  టాటా కెమికల్స్‌లో టాటా సన్స్‌  వాటా 24.18 శాతంగా ఉంది.

ఎన్‌బీసీసీ: డిసెంబర్‌తో మూగిసిన మూడో త్రైమాసికంలో ఎన్‌బీసీసీ లిమిటెడ్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 41 శాతం తగ్గి రూ.49.53 కోట్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ. 83.64 కోట్లుగా ఉంది.

పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌: ప్రస్తుత ఆర్థికం సంవత్సరం క్యూ3లో  పన్ను చెల్లింపులు ఎక్కువ అవ్వడంతో పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 12 శాత పడిపోయి రూ.3,386.72 కోట్లకు చేరింది.

ఫినోలెక్స్‌ ఇండస్ట్రీస్‌: ఈ కంపెనీ క్యూ3లో ఆదాయం తగ్గడంతో నికర లాభం 18.5 శాతం పెరిగి రూ.93.3 కోట్లకు చేరింది. ఆదాయం 7.6 శాతం పడిపోయి రూ.699.4 కోట్లకు చేరింది.

జేపీ పవర్‌: ఆదాయం తక్కువగా నమోదు అవ్వడంతో ఈ కంపెనీ క్యూ3లో కన్సాలిడేటెడ్‌ నికర నష్టం రూ.1,816.05 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర నష్టం రూ.95.21 కోట్లుగా ఉంది.



You may be interested

టీసీఎస్‌, ఇన్ఫీ అప్‌

Thursday 13th February 2020

నష్టాల మార్కెట్లోనూ గురువారం  ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లోనే అరశాతం లాభపడింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పుంజుకోవడంతో దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలహీనపడింది. డాలర్‌ మారకంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ షేర్లకు ఈ అంశం కలిసొచ్చింది.  దీంతో ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే

మార్కెట్‌ను ముందుకు నడిపించే మూడు అంశాలు!

Thursday 13th February 2020

దేశీయ మార్కెట్లు బడ్జెట్‌ రోజు పతనం అనంతరం వీ ఆకారపు రికవరీని వేగంగా సాధించాయి. కానీ 12200 పాయింట్ల వద్ద నిఫ్టీ నిరోధం ఎదుర్కొంటోంది. దీంతో ఇకపై నిఫ్టీ ర్యాలీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఈ సందేహాలు నిరర్ధకమని, నిఫ్టీ సమీప భవిష్యత్‌లో ముందుకే దూసుకుపోతుందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ అనలిస్టు పంకజ్‌ బోబ్డె భరోసా ఇస్తున్నారు. లాంగ్‌టర్మ్‌కు సైతం సూచీలు ముందుకే కొనసాగుతాయని, మధ్యలో కొంత చిన్న పాటి కరెక‌్షన్స్‌

Most from this category