News


ప్రతికూల ఓపెనింగ్‌ నేడు!

Wednesday 25th March 2020
Markets_main1585105102.png-32657

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 205 పాయింట్లు డౌన్‌
ఆసియా మార్కెట్లు 2-6 శాతం ప్లస్‌
మంగళవారం అమెరికా మార్కెట్లు జూమ్‌
అమెరికా స్టాక్‌ ఫ్యూచర్స్‌ నష్టాల్లో
మంగళవారం యూరప్‌ ఇండెక్సుల జోరు

నేడు(బుధవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.10 ప్రాంతం‍లో 205 పాయింట్లు పతనమై 7,705 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 7,910 పాయింట్ల వద్ద  ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. 

రికార్డ్‌ ర్యాలీ
కరోనా పతనాలకు చెక్‌ పెడుతూ మంగళవారం ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు దూకుడు చూపాయి.  డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ 12 ఏళ్ల తదుపరి ఒక్క రోజులోనే ఏకంగా 11-8 శాతం మధ్య జంప్‌చేశాయి. అంతకుముందు యూరోపియన్‌ మార్కెట్లు సైతం ఇదే స్థాయిలో ఎగశాయి. ఇక ప్రస్తుతం ఆసియాలో సైతం జపాన్‌ 6 శాతం జంప్‌చేయగా.. కొరియా, తైవాన్‌ 5 శాతం ఎగశాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సహాయక ప్యాకేజీ ప్రకటనకుతోడు.. విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో మంగళవారం దేశీ స్టాక్‌ మార్కెట్లలోనూ పుల్‌బ్యాక్‌ ర్యాలీ వచ్చింది. సెన్సెక్స్‌ 693 పాయంట్లు జంప్‌చేసి 26,674 వద్ద నిలవగా.. నిఫ్టీ 191 పాయింట్లు ఎగసి 7,801 వద్ద ముగిసింది.


నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 7,529 పాయింట్ల వద్ద, తదుపరి 7,257 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు   భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 8,055 పాయింట్ల వద్ద, ఆపై 8,309 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు.  ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 16,202 పాయింట్ల వద్ద, తదుపరి 15,296 వద్దపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత  17,927 పాయింట్ల వద్ద, తదుపరి 18,747 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. 

విక్రయాల బాటలోనే
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2153 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు)  రూ. 1554 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 2989 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టగా..  డీఐఐలు రూ. 1082 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.You may be interested

కరోనా కల్లోలం: ఆర్థిక ఉపశమనం!

Wednesday 25th March 2020

పన్ను రిటర్నులు, జీఎస్‌టీ రిటర్నుల గడువు పొడిగింపు ఏ బ్యాంకు ఏటీఎం అయినా చార్జీ ఉండదు సేవింగ్స్‌ ఖాతా బ్యాలన్స్‌ చార్జీల ఎత్తివేత ఇన్‌సాల్వెన్సీ నిబంధనల సడలింపు న్యూఢిల్లీ: కోవిడ్‌-19 వైరస్‌ కారణంగా ప్రజలు, వ్యాపారస్థులు ఇళ్లకే పరిమితమవుతున్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సర్కారు ఉపశమన చర్యలను ప్రకటించింది. ఆదాయపన్ను రిటర్నులు, జీఎస్‌టీ రిటర్నుల దాఖలు గడువులను పెంచింది. ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో లావాదేవీల చార్జీలు, బ్యాంకు ఖాతాల్లో బ్యాలన్స్‌ నిర్వహణ చార్జీలను మూడు

చమురు ధరల పతనం.. వీటికి లాభం

Tuesday 24th March 2020

కోవిడ్‌ వైరస్‌ కారణంగా చమురుకు డిమాండ్‌ తగ్గింది. మరోవైపు సౌదీ, రష్యాల మధ్య చమురు ఉత్పత్తి కోత విషయమై ఏకాభిప్రాయం రాకపోవడం.. దాంతో సౌదీ అరేబియా ఏకపక్షంగా ధరలను తగ్గించేయడం చూశాం. దీంతో చమురు ధరలు బ్యారెల్‌కు 25 డాలర్ల వరకు ఇటీవల పడిపోయాయి. 2003 ఏప్రిల్‌ తర్వాత ఇంత తక్కువ ధరలను చూడడం మళ్లీ ఇదే మొదటిసారి. ఈ ఏడాది జనవరిలో చూసిన గరిష్ట ధరల నుంచి 65

Most from this category