News


నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ...బ్యాంకింగ్‌ ఏడీఆర్‌లు డౌన్‌

Saturday 12th October 2019
Markets_main1570862316.png-28842

శనివారం ఉదయం ట్రేడింగ్‌లో సింగపూర్‌ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నష్టాల్లో ట్రేడవుతోంది. శుక్రవారం నిఫ్టీ ఫ్యూచర్స్‌ ముగింపు 11318 పాయింట్లతో పోలిస్తే 31 పాయింట్ల నష్టంతో 11287 పాయింట్ల వద్ద కదలాడుతోంది. ఒకదశలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 11359 పాయింట్ల గరిష్ఠాలను చేరినా అక్కడ నిలబడలేకపోయింది. శుక్రవారం ట్రేడ్‌ డీల్‌ వార్తలతో ప్రపంచ మార్కెట్లన్నీ కదం తొక్కాయి. దీంతో సోమవారం దేశీయ సూచీలు పాజిటివ్‌గా ఉంటాయని చాలామంది అంచనా వేశారు. కానీ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ మాత్రం భిన్న సంకేతాలు ఇస్తోంది. మరోవైపు అమెరికా మార్కెట్లో ట్రేడయ్యే ఇండియన్‌ ఏడీఆర్‌లలో ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌లు నష్టాల్లో ఉన్నాయి. వేదాంత, టాటామోటార్స్‌ ఏడీఆర్‌లు మాత్రం పాజిటివ్‌గా ఉన్నాయి. నిఫ్టీలో అధిక వెయిటేజ్‌ ఉన్న ప్రధాన స్టాకుల ఏడీఆర్‌లు నష్టాల్లో ఉండడం సోమవారం మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణుల అంచనా. 



You may be interested

రూ. 38,000 దిగువకు ఎంసీఎక్స్‌ గోల్డ్‌!

Saturday 12th October 2019

  యుఎస్‌-చైనా మధ్య పాక్షిక వాణిజ్య ఒప్పందం కుదరడంతో పాటు, బ్రెక్సిట్‌ పురోగతి సాధించడంతో బంగారం ధరలు శుక్రవారం నష్టపోయాయి. యుఎస్‌ గోల్డ్‌ ప్యూచర్స్‌ 0.50 శాతం పడిపోయి 1,489.80 డాలర్లకు చేరుకుంది. అదే విధంగా దేశీయ ఎంసీఎక్స్‌ బంగారం 0.82 లేదా రూ. 314 నష్టపోయి రూ. 37845.00 వద్ద ముగిసింది. ‘యుఎస్‌-చైనా మధ్య పాక్షిక ఒప్పందం కుదరడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది. ఫలితంగా రిస్క్‌ ఉన్న ఆస్తులలో

యుఎస్‌-చైనా మధ్య పాక్షిక ఒప్పందం!

Saturday 12th October 2019

దీర్ఘకాలంగా కొనసాగిన యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌కి పాక్షీక సంధి కుదిరింది. యుఎస్‌-చైనా ప్రతినిధులు మధ్య ప్రారంభమైన వాణిజ్య చర్చలు శుక్రవారం నాడు ఓ కొలిక్కి వచ్చాయి. ఇరు దేశాల మధ్య పరిమితితో కూడిన వాణిజ్య ఒప్పందమైన స్వల్పకాలంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.   పాక్షిక ఒప్పందంలోని ముఖ్యమైన అంశాలు..   ఈ పాక్షిక ఒప్పందం, యుఎస్‌-చైనా వాణిజ్య ఒప్పందంలో కీలకమైనదని యుఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు.

Most from this category